ఇంకా న‌డుస్తున్న‌ RRR మేనియా

జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR మూవీ ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసి రికార్డు స్థాయి వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీని ఎవరో ఒకరు మెచ్చుకుంటూనో ఉన్నారు. కేవలం ఇండియాలో (తెలుగు కాకుండా ఇతర భాషల్లో) అనే కాకుండా చివరికి జపాన్ లో కూడా ఈ మూవీ సత్తా చాటింది. అక్కడి స్థానిక భాషలో రిలీజ్ అయి కూడా […]

Share:

జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR మూవీ ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసి రికార్డు స్థాయి వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీని ఎవరో ఒకరు మెచ్చుకుంటూనో ఉన్నారు. కేవలం ఇండియాలో (తెలుగు కాకుండా ఇతర భాషల్లో) అనే కాకుండా చివరికి జపాన్ లో కూడా ఈ మూవీ సత్తా చాటింది. అక్కడి స్థానిక భాషలో రిలీజ్ అయి కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. అందుకే ఇండియన్ మూవీ హిస్టరీలో ఈ మూవీని స్పెషల్ గా చూస్తారు. ఇక మొన్న ఇండియాలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా కూడా ఈ మూవీ గురించిన టాపిక్ వచ్చింది. సదస్సులో అంటే వేదిక మీద కాదు కానీ ఈ సదస్సు కోసం ఇండియాకు వచ్చిన ఓ దేశ ప్రధాని RRR మూవీని మెచ్చుకున్నారు.అతడు ఏమని చెప్పాడంటే…. 

మూడు గంటలు మర్చిపోలేనివి..

రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఇటీవలే చూశానని జీ -20 సమావేశాల కోసం ఇండియాకు వచ్చిన బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తెలిపారు. ఆయన మాట్లాడుతూ… RRR మూవీని చూసి మంత్ర ముగ్దుడని అయ్యానని తెలిపారు. ఈ మూవీలోని డ్యాన్స్ ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందన్నారు. ఈ మూడు గంటలు నేను చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు. ఇందులో కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా ఫన్నీ సీన్స్ కు కొదువే లేదని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇక బ్రిటీషర్స్ నుంచి స్వాతంత్ర్యం కోసం ఇండియన్స్ ఎంతలా పోరాటం చేశారో కళ్లకు కట్టినట్లు చూపించారని కొనియాడారు. ఇదో గొప్ప ఫీచర్ ఫిల్మ్ అన్నారు. దీంతో ఈ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. 

ఆస్కార్ కూడా…. 

ఇండియన్ సినిమాలకు ఆస్కార్ అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. ఎంత కష్టపడి తీసినా కానీ ఎన్ని కలెక్షన్లు సాధించినా కానీ మన చిత్రాలకు ఆస్కార్ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఆ లోటును ఆస్కార్ తీర్చింది. ఆస్కార్ మూవీలోని పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. దీంతో మూవీ యూనిట్ మొత్తం కలిసి ఆస్కార్ అవార్డులు ఇచ్చే వద్దకు వెళ్లారు. దీంతో ఇంటర్నేషనల్ మీడియా మొత్తం RRR మూవీ టీంను ఫోకస్ చేసింది. వారు ఏదో అలా వెళ్లకుండా ఇండియన్ వేషధారణతో వెళ్లే సరికి వీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. దీంతో మీడియా కళ్లన్నీ నార్మల్ గానే వీళ్ల మీద పడ్డాయి. 

థ్యాంక్స్ చెప్పిన జక్కన్న

RRR మూవీని బ్రెజిల్ ప్రధాని పొగడ్తల వర్షంలో ముంచెత్తడంతో మూవీ డైరెక్టర్ జక్కన్న స్పందించాడు. అతడికి ధన్యవాదాలు తెలియజేశాడు. మీకు RRR మూవీ నచ్చినందుకు ధన్యవాదాలు. మీ నుంచి వచ్చిన అప్రిసియేషన్ మా టీం అందరికీ ఎంతో గొప్పది అని అన్నారు. కేవలం ఇతడు మాత్రమే కాకుండా ఇప్పటికే అనేక మంది దేశాధినేతలు RRRను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. బ్రెజిల్ ప్రధాని RRR మూవీని మెచ్చుకుంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోను షేర్ చేస్తూ RRR మూవీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇది RRR మూవీ స్టామినా అని ట్వీట్లు చేస్తున్నారు. RRR మూవీ తర్వాత రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ అడ్వెంచరస్ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ యే కథను అందిస్తున్నాడు.