మరో వినోదాత్మక సౌత్ చిత్రాన్ని రీమేక్ చేయాలని బాలీవుడ్ నిర్ణయం!

ఈ మధ్య సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్‌‌లో పాగా వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలతో కూడిన సౌత్ బ్లాక్ ఎప్పుడూ బాక్సాఫీస్‌లో కాసులు కురిపిస్తోంది. సింగిల్ స్క్రీన్‌లు, ఉత్సాహభరితమైన వీక్షకులు, ప్రముఖ సినీతారల గొప్ప నెట్‌వర్క్.. వీటన్నిటితో  బాలీవుడ్ సినిమాలకి అంతులేని క్రేజ్ ఉన్నప్పటికీ, ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా చాలా బలపడింది. ఈ కారణంగానే సౌత్ ఇండియన్ సినిమా కేవలం మనుగడ సాగించడమే కాదు, నిజంగా అభివృద్ధి చెందింది. ‌వాస్తవానికి […]

Share:

ఈ మధ్య సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్‌‌లో పాగా వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలతో కూడిన సౌత్ బ్లాక్ ఎప్పుడూ బాక్సాఫీస్‌లో కాసులు కురిపిస్తోంది. సింగిల్ స్క్రీన్‌లు, ఉత్సాహభరితమైన వీక్షకులు, ప్రముఖ సినీతారల గొప్ప నెట్‌వర్క్.. వీటన్నిటితో  బాలీవుడ్ సినిమాలకి అంతులేని క్రేజ్ ఉన్నప్పటికీ, ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా చాలా బలపడింది. ఈ కారణంగానే సౌత్ ఇండియన్ సినిమా కేవలం మనుగడ సాగించడమే కాదు, నిజంగా అభివృద్ధి చెందింది.

‌వాస్తవానికి దక్షిణాది సినిమాలు, నిర్మాతలు హిందీ సినిమాలని బాగానే పోషించారు. మణిరత్నం, ప్రియదర్శన్, రామ్ గోపాల్ వర్మ వంటి పేరు పొందిన దర్శకులు తమ సినిమాలకు బహుభాషా వెర్షన్‌లను రూపొందించడం మనం చూశాము. ఇందులో హిందీ కూడా ఉంది. ఈ ప్రయోగం వివిధ స్థాయిలలో విజయాన్ని సాధించింది. రోజా, బొంబాయి, శివాజీ, రోబో వంటివి కొన్ని ఉదాహరణలు అని చెప్పవచ్చు.

హిందీలో సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ సినిమాలను చూస్తున్నారనేది ట్రేడ్ సర్కిల్‌లలో అందరికీ తెలిసిన విషయమే. హిందీలోకి డబ్ అయిన సౌత్ ఇండియన్ సినిమాలు టెలివిజన్‌లో కూడా బాగా ఆదరణ పొందాయి. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి వచ్చిన ప్రేరణతో  ఆ సినిమాలకి మాత్రమే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది.

అంతేకాకుండా.. ఎస్‌ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి వంటి ప్రేక్షకులను ఆకర్షించగలిగే సినిమాల రాకతో పట్టణ కేంద్రాల్లోని మల్టీప్లెక్స్‌‌ల్లో ప్రేక్షకులతో నిండిపోయింది. సబ్ టైటిల్స్, చక్కటి డబ్బింగ్‌తో భాషకు ఇబ్బంది లేకుండా పోయిన ఈ రోజుల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లాభాల పంట పండిస్తోంది.

ఈ రోజుల్లో బాలీవుడ్‌లో వస్తున్న చాలా సినిమాలు వాస్తవ సంఘటనలను బట్టి తీసినవి గానీ, బయోపిక్‌లు లేదా సౌత్ ప్రాజెక్ట్‌ల రీమేక్‌లు కాకుండా..  హిందీ చిత్ర పరిశ్రమలో కొత్త కథలు రావడం లేదు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ తెలుగులో ‘కాటమరాయుడు’ గా వచ్చిన ‘వీరం’ కి రీమేక్ కాగా, ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన ‘షెహజాదా’ ‘అల వైకుంఠపురంలో’కి రీమేక్. షాహిద్ కపూర్ ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’ని రీమేక్ చేయగా, మలయాళ సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’కి రీమేక్ అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న ‘సెల్ఫీ’. హృతిక్ కూడా ‘విక్రమ్ వేద’ని అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశాడు.

ఇప్పుడు, ‘ఫాంటమ్ స్టూడియోస్’ ‘లవ్ టుడే’ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు అధికారికంగా తెలిసింది. గతంలో ‘కోమలి’ తీసిన ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. చక్కని కథ, కథనం, సన్నివేశాలు, సాపేక్షమైన కథాంశం, హత్తుకునే భావోద్వేగాలు, బలమైన నటనతో జత చేసిన పరిపూర్ణ కథనం ఈ సినిమాని చిరస్మరణీయంగా మార్చాయి.

‘లవ్ టుడే’ సినిమాలో ఇవానా కథానాయికగా నటిస్తుండగా సత్య రాజ్, యోగి బాబు, రాధికా శరత్‌ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమానికి ప్రదీప్ రంగనాథన్ సర్వస్వం కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఒకరోజు ఫోన్‌లు మార్పిడి చేసుకున్న జంట, ఆ తర్వాత ఏమి జరుగుతుందనేది చాలా వినోదం, నాటకం, గందరగోళానికి దారితీస్తుందనేదే కథ.

హిందీ రీమేక్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందాన్ని త్వరలో ప్రకటించనున్నారు. మరి ఒరిజినల్ తీసిన ప్రదీప్ ఈ సినిమాని హిందీలో డైరెక్ట్ చేస్తాడా లేక వేరే నిర్మాతకు వదిలేస్తాడా అనేది చూడాలి.