బేస్‌మెంట్‌లో దాక్కున్నాను.. వెల్ల‌డించిన నుష్ర‌త్ బ‌రూచా

హైఫాలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందదుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్ నుష్ర‌త్ బ‌రూచా ఇజ్రాయెల్‌ యుద్ధంలో చిక్కుకుంది. వెంటనే ఆమె సిబ్బంది ఇజ్రాయెల్‌లోని ఇండియా ఎంబస్సీని సంప్రదించి, ఆమెను సురక్షితంగా ఇండియా తీసుకొచ్చారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుష్రత్ భారుచా ఎట్టకేలకు సురక్షితంగా బయటపడింది. ఆదివారం ఆమె ఇజ్రాయెల్‌ నుంచి ముంబై ఎయిర్‌‌పోర్ట్‌కు సురక్షితంగా చేరుకుంది. ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి ఆమె బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తమ అభిమాన నటి […]

Share:

హైఫాలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందదుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్ నుష్ర‌త్ బ‌రూచా ఇజ్రాయెల్‌ యుద్ధంలో చిక్కుకుంది. వెంటనే ఆమె సిబ్బంది ఇజ్రాయెల్‌లోని ఇండియా ఎంబస్సీని సంప్రదించి, ఆమెను సురక్షితంగా ఇండియా తీసుకొచ్చారు.

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుష్రత్ భారుచా ఎట్టకేలకు సురక్షితంగా బయటపడింది. ఆదివారం ఆమె ఇజ్రాయెల్‌ నుంచి ముంబై ఎయిర్‌‌పోర్ట్‌కు సురక్షితంగా చేరుకుంది. ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి ఆమె బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తమ అభిమాన నటి సేఫ్‌గా బయటపడిందని ఫ్యాన్స్‌ ఆనంద పడుతున్నారు. అయితే, నుష్రత్‌లో ఆ ఆనందం కనిపించలేదు. ఫేస్‌లో కొద్దిగా భయం, నిరాశ కనిపించడం మనం వీడియోలో చూడొచ్చు. హైఫా ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు నుశ్రత్‌ ఇజ్రాయెల్‌కు వెళ్లింది. ఆమె అక్కడ ఉండగానే ఇజ్రాయెల్‌, పాలస్తీనాలోని హమాస్‌ టెర్రరిస్టుల మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ఇజ్రాయెల్‌కు అన్నీ ఫ్లైట్‌లు క్యాన్సిల్‌ కావడంతో ఆమె అక్కడ చిక్కుకుపోయారు. 

నుశ్రత్ ఇజ్రాయెల్‌ ఎందుకు వెళ్లింది?

 ఇజ్రాయెల్లోని హైఫాలో ప్రతి ఏటా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. 1983 నుంచి మొదలైన ఈ కార్యక్రమానికి క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాదిలో 39 ఎడిషన్ సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికే నుష్రత్ ఇజ్రాయెల్‌కి వెళ్లింది. ఇంతలో అక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా యుద్ధం మొదలవ్వడంతో నుష్రత్తో ఆమె బృందానికి సంప్రదింపులు తెగిపోయాయి. ఆ వెంటనే నష్రత్ బృందం ఇజ్రాయెల్‌లోని ఎంబసీని కాంటాక్ట్ అయ్యారు. వారి సహకారంతో నుష్రత్ క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చారు.  ఎయిర్‌‌ పోర్ట్‌లో ఆమె చాలా ఆందోళనకరంగా కనిపించింది.మేకప్ లేకుండా అలసిపోయి కనిపించింది. పింక్‌ కోఆర్ట్ సెట్‌ ధరించింది. నడుము చుట్టూ స్లింగ్‌ బ్యాగ్‌ ఉంది. ఆమెతో మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా, నుష్రత్‌ తిరస్కరించింది. కారు దగ్గరకి వేగంగా వెళ్లి, ఎక్కి వెళ్లిపోయింది. కనెక్ట్ ఫ్లైట్లో వచ్చింది.

అంతకుముందు నుష్రత్‌ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న వివరాలను ఆమె ప్రచారకర్తలు వివరించారు. ‘‘మేము అతి కష్టం మీద నుష్రత్‌ను సంప్రదించగాలిగాం. ఎంబసీ సహాయంతో ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువస్తున్నాం. మాకు నేరుగా విమానం దొరకలేదు. అందుకే కనెక్టిగ్‌ ఫ్లైట్లో నుష్రత్‌ వస్తున్నారు. ఆమె సేఫ్‌గా ఇక్కడి వస్తారని మేము అనుకుంటున్నాం. ఇంతకంటే వివరాలు పంచుకోవడం సాధ్యం కాదు. నుష్రత్‌ ఇండియాలో అడుగుపెట్టగానే మేము మిగతా వివరాలు చెప్తాం. ఆమె సేఫ్‌గా ఉన్నందుకు ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం” అని ఆమె ప్రచారకర్తలు తెలియజేవారు.

శనివారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్‌ నుంచి హమాస్‌ మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడి జరిపారు. దీంతో షాక్‌ అయిన ఇజ్రాయెల్‌ వెంటనే తేరుకోని, ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు హమాస్‌పై యుద్ధం ప్రకటించారు. తమ దేశం ప్రస్తుతం యుద్ధంలో ఉందని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. యుద్ధం కారణంగా ఇప్పటివరకు ఇరువైపుల 1,000 మంది వరకు మరణించారు. 

కాగా, నుష్రత్‌ బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ప్యార్‌‌ కా పంచ్‌నామాతో ఫేమ్‌ అవ్వడానికి ముందు నుష్రత్‌ ‘లవ్‌ సెక్స్ ఔర్ ధోఖా’లో నటించింది. ఆమె సోను కే టిబు కి స్వీటీ, చోరీ, రామ్‌ సేతు, సెల్ఫీ తదితర చిత్రాల్లో పనిచేసింది. ఆమె చివరిసారిగా అకెల్లి అనే చిత్రంలో కనిపించింది. ఇందులో ఆమె ఇరాక్‌లోని పోరాట మండలంలో చిక్కుకొని, మనుగడ కోసం పోరాడుతున్న ఒక సాధారణ భారతీయ మహిళగా నటించిన థ్రిల్లర్‌‌ డ్రామా మూవీ. ఆమె ఇప్పుడు చోరీ2లో నటిస్తోంది.