వెయ్యి కోట్ల ఆన్‌లైన్‌ స్కాంలో గోవింద‌ ?

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు గోవింద చిక్కుల్లో పడ్డారు. రూ.1,000 కోట్ల పాన్‌ ఇండియా ఆన్‌లైన్‌ పోంజీ స్కాంకు సంబంధించి గోవిందను ప్రశ్నించనున్నారు.  ఈ మేరకు ఒడిశా ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) సెప్టెంబర్‌‌ 13న తెలిపింది. సోలార్‌‌ టెక్నో అలయన్స్‌ (ఎస్‌టీఏ టోకెన్‌) సంస్థ పలు దేశాల్లో ఆన్‌లైన్‌ ద్వారా క్రిప్టో పెట్టుబడి ద్వారా మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పోంజీ స్కామ్‌ను చట్ట విరుద్ధంగా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.  ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌లో గోవిందాను ఈఓడబ్ల్యూ ప్రశ్నిస్తామని […]

Share:

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు గోవింద చిక్కుల్లో పడ్డారు. రూ.1,000 కోట్ల పాన్‌ ఇండియా ఆన్‌లైన్‌ పోంజీ స్కాంకు సంబంధించి గోవిందను ప్రశ్నించనున్నారు.  ఈ మేరకు ఒడిశా ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) సెప్టెంబర్‌‌ 13న తెలిపింది. సోలార్‌‌ టెక్నో అలయన్స్‌ (ఎస్‌టీఏ టోకెన్‌) సంస్థ పలు దేశాల్లో ఆన్‌లైన్‌ ద్వారా క్రిప్టో పెట్టుబడి ద్వారా మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పోంజీ స్కామ్‌ను చట్ట విరుద్ధంగా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. 

ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌లో గోవిందాను ఈఓడబ్ల్యూ ప్రశ్నిస్తామని చెప్పడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కంపెనీకి సంబంధించిన కొన్ని ప్రచార వీడియోల్లో నటించేందుకు గోవిందా అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈవోడబ్ల్యూ ఇన్‌స్పెక్టర్‌‌ జనరల్‌ జేఎన్‌ పంకజ్‌ మీడియాతో మాట్లాడుతూ, జులైలో గోవాలో జరిగిన ఎస్‌టీఏ గ్రాండ్‌ ఫంక్షన్‌కు గోవిందా హాజరైనట్లు తెలిసిందన్నారు. అలాగే, కొన్ని వీడియోల్లో కంపెనీని ప్రమోట్‌ చేసేలా కొన్ని వీడియోల్లో కనిపించాడని చెప్పారు. అందుకే గోవిందను ప్రశ్నించడానికి తాము త్వరలో ఒక బృందాన్ని ముంబైకి పంపుతామని తెలిపారు. కాగా, వ్యాపార ఒప్పందం ప్రకారమే (ఎస్‌టీఏ టోకెన్‌ బ్రాండ్‌) గోవింద పాత్ర పరిమైందని తాము విచారణలో కనుగొంటే, అతనిని ఈ కేసులో సాక్షిగా పరిగణిస్తామని అధికారులు వెల్లడించారు. 

ఇంటెలిజెన్స్ సమాచార మేరకే..

భువనేశ్వర్‌‌ ఈవోడబ్ల్యూ డీఎస్పీ సస్మితా సాహు మాట్లాడుతూ, ఇంటెలిజెన్స్‌ నుంచి సమాచారం అందిన తర్వాతే తాము ఎస్‌టీఏపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ‘‘ఎస్‌టీఏ దాని సొంత టోకెన్‌ను ప్రారంభించింది. దానికి ఎస్‌టీఏ టోకెట్‌ అని పేరు పెట్టింది. ఆ తర్వాత దీనిని స్థానికంగా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. పోంజీ స్కీమ్‌ లేదా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ స్కీమ్‌లో జనాన్ని ఎస్‌టీఏలో సభ్యులుగా చేయడం ప్రారంభించింది. ఇందుకోసం మొదట తెలిసిన వారిని అడుగుతారు. అలా అలా చైన్‌ సిస్టమ్‌ ద్వారా వందల మంది ఇందులో జాయిన్‌ అయ్యేలా చూస్తారు. కొత్త సభ్యులను చేర్చిన ప్రతిసారి కొన్ని ప్రయోజనాలు ఉంటాయని, రాబడి కూడా వస్తుందని వారు నమ్మబలుకుతారు. అయితే, మొదట స్కీమ్‌లో చేరేందుకు కొంత అమౌంట్ కట్టాలని, ఆ డబ్బులను కూడా తిరిగి ఎదో ఒక గిఫ్ట్‌ రూపంలో ఇస్తామని నమ్మిస్తారు” అని ఆమె చెప్పారు. భద్రక్‌, కియోంఝర్‌‌,బాలాసోర్‌‌, మయూర్భంజ్‌, భువనేశ్వర్‌‌లోని 10 వేల మంది నుంచి ఈ కంపెనీ రూ.30 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం.

భువనేశ్వర్‌‌ కేంద్రంగా కార్యకలాపాలు..

ప్రాథమిక విచారణలో ఈవోడబ్ల్యూ భువనేశ్వర్‌‌ ద్వారా నిర్వహిస్తున్నామని తెలుసుకున్నామని సస్మితా సాహూ తెలిపారు. ఎస్‌టీఏ ఒడిశా హెడ్‌గా భద్రక్‌కు చెందిన నిరోద్‌ కుమార్‌‌ దాస్‌, అతని అనచరులు ఎస్‌టీఏ పేరుతో 5 వేల నుంచి 6 వేల మందికిపైగా ఈ స్కీమ్‌లో సభ్యులుగా చేర్చుకున్నారని తెలిపారు. మొదట్లో ఆఫీసుల్లో మీటింగ్‌లు పెట్టి, ఈ స్కీమ్‌లో సభ్యులను చేర్చడానికి ముందుగా అతను మీటింగ్‌లు పెడతాడని చెప్పారు. లేనిపోని మాటలు చెప్పి, ప్రజలను మోసం చేస్తూ వారిని సభ్యులుగా చేర్చుకొని, డబ్బులు వసూలు చేస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి చెందిన దేశ, ఒడిశా అధిపతులు గుర్తేజ్‌ సింగ్‌ సిద్ధూ, నిరోద్‌ దాస్‌లుగా గుర్తించి వారిని ఆగస్టు 7న అరెస్ట్ చేశామని తెలిపారు. ఎస్‌టీఏ మరో ముఖ్య సభ్యుడైన రత్నాకర్ పాలై… ఇతను కూడా భార సంఖ్యలో సభ్యులను జాయిన్‌ చేయించడానికి చెప్పారు. దీంతో ఆగస్ట్ 16న అతన్ని అరెస్ట్‌ చేశామని  వెల్లడించారు. 

సభ్యులకు ప్రోత్సహకాలు..

‘‘సంస్థ నెట్‌వర్క్‌లను పెంచడానికి సభ్యులకు ప్రోత్సహకాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2023 జులై 30న వారు బాలీవుడ్‌ స్టార్‌‌ గోవిందను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, మెగా ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఈ విషయం మాకు తెలిసింది. దీంతో ఈవెంట్‌ జరిగిన గోవాకు ఈవోడబ్ల్యూ బృందం బయలుదేరింది. ఈ ఈవెంట్‌ గురించి గోవింద అభిప్రాయం తీసుకోవాలనుకున్నాం. కానీ, వీలు పడలేదు. అందుకే ఇప్పుడు ఆయనను విచారించాలని అనుకుంటున్నాం” అని సాహు చెప్పారు. 

ఈ స్కీమ్‌ లో భాగంగా పలు రాష్ట్రాల్లో డిపాజిట్‌ కింద లక్షల్లో వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. బీహార్‌‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్‌, ఇతర రాష్ట్రాల్లోని పెట్టుబడిదారుల నుంచి లక్షల్లో డిపాజిట్‌ కింద తీసుకున్నారు. కాగా, హంగేరీ దేశస్తుడైన కంపెనీ చీఫ్‌ డేవిడ్‌ గెజ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి.