బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ప్రోమో వచ్చేసింది

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్-7 వచ్చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ నుంచి రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో టెలివిజన్ లో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్-7 ఎప్పుడు మొదలవుతుంది? ఏ రోజు నుంచి టెలికాస్ట్ అవుతుంది? అనే విషయం గురించి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూశారు.  బిగ్ బాస్ తెలుగు సీజన్-7:  ఈ సీజన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని, ఈ రియాలిటీ షో మీద ఒక […]

Share:

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్-7 వచ్చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ నుంచి రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో టెలివిజన్ లో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్-7 ఎప్పుడు మొదలవుతుంది? ఏ రోజు నుంచి టెలికాస్ట్ అవుతుంది? అనే విషయం గురించి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూశారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్-7: 

ఈ సీజన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని, ఈ రియాలిటీ షో మీద ఒక వైపు నుంచి క్రిటిక్స్ వస్తున్నప్పటికీ, మరోవైపు అభిమానులు మాత్రం వారి అభిమానాన్ని అలాగే చూపిస్తున్నారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ బిగ్ బాస్ 6లో సింగర్ రేవంత్ విన్నర్ గా నిలిచాడు ఆ సీజన్ ఎంత ఆసక్తికరంగా మారింది, అండ్ టాస్కులు, ఎమోషన్స్, హ్యాపీనెస్ ఇవన్నీ మిక్స్ అయిన సీజన్, సీజన్-6. అయితే ప్రస్తుతం రాబోతున్న సీజన్-7 అంతకుమించి ఉండబోతుందని అలరిస్తుందని అంటున్నారు. అభిమానుల కోసం మరింత అందంగా ముస్తాబయి బిగ్ బాస్ హౌస్ ఉండబోతోంది. ఇందులో ఉండబోయే ఎమోషన్స్, హ్యాపీనెస్, గేమ్స్ మరెన్నో చూపులను కట్టిపడేస్తాయని, ఈ సీజన్ మిస్ కాకూడదు అంటున్నారు. 

ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది: 

గత సీజన్లలో కనిపించినట్లే, బిగ్ బాస్ తెలుగు 7 కూడా ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్, స్టార్ మాలో ప్రసారం కానుంది. మొదటి చిన్న ప్రోమో సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఈ ఆసక్తికరమైన రియాలిటీ షో తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మాట ఇస్తున్నారు. వర్గాల సమాచారం ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్‌లో స్టార్ మాలో ప్రసారం కానుంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 

బిగ్ బాస్ సీజన్-7 హోస్ట్ ఎవరు?: 

బిగ్ బాస్ నిర్వాహకులు టెలివిజన్ పరిశ్రమ, సోషల్ మీడియా మరియు యూట్యూబ్‌లోని ప్రఖ్యాత సెలబ్రిటీలను సంప్రదించడం ఇప్పటికే జరిగినట్లు సమాచారం. ఇప్పుడు రాబోతున్న సీజన్‌కు సంబంధించిన హౌస్‌మేట్స్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ప్రస్తుతం పాపులర్ యాంకర్గా రాణిస్తున్న రష్మీ గౌతమ్ రాబోయే సీజన్‌లో భాగం కానుందని ఊహాగానాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి, అయితే అలాంటిదేమీ లేదని ఇప్పటికే ఆమె చెప్పడం జరిగింది. మరో ప్రముఖ . సెలబ్రిటీ మాధవి లతను కూడా సంప్రదించినట్లు సమాచారం. జానకి కలగలేదు అనే సీరియల్‌తో సహా పలు సీరియల్స్‌తో పాపులారిటీకి ఎదిగిన అమర్‌దీప్ చౌదరి ఈ సీజన్‌లో కన్ఫర్మ్ చేసిన కంటెస్టెంట్‌గా పలుచోట్ల వినిపించింది.

బిగ్ బాస్ తెలుగు 7కి ఎవరు హోస్ట్ చేస్తారనే వివరాలు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేనట్లే తెలుస్తోంది. నాలుగు సీజన్ల నుండి తన హోస్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను అలరించడంలో పేరుగాంచిన నాగార్జున అక్కినేని ఈసారి హోస్ట్ చేయకపోవచ్చు అని అభిమానుల్లో అనుమానం కూడా ఉంది. నాగార్జున షో నుండి నిష్క్రమించారని మరియు తదుపరి సీజన్ బిగ్ బాస్ తెలుగు 7ని నందమూరి బాలకృష్ణ చేజిక్కించుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఏది ఏమైనాప్పటికీ, బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎవరు నిర్వహించబోతున్నారు అనే ఊహగానాలు ప్రస్తుతం ఇంకా వీడలేనట్లే. కాకపోతే ఇందులో కంటెస్టెంట్ల గురించి పలు వార్తల్లో అనేక రకాలుగా వచ్చాయి. సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సీజన్ ఎలా ఉండబోతోంది? ప్రతిరోజు ఒక ఆసక్తికరమైన అంశం గురించి కంటెస్టెంట్ల మధ్య జరిగే చర్చల గురించి ప్రేక్షకులు అయితే ఎదురుచూస్తున్నారని చెప్పుకోవాలి. మునపటి సీజన్లో, రేవంత్ విన్నర్ గా నిలిచినప్పటికీ, రన్నరప్గా నిలిచిన శ్రీహాన్ ఎక్కువ మొత్తంలో ప్రైజ్ మనీ గెల్చుకున్నాడు. చివరి క్షణంలో ఓటింగ్ లో శ్రీహన్ ముందంజలో ఉన్నప్పటికీ, ప్రైజ్ మనీ చేజారిపోతుందనే క్రమంలో తాను రన్నరప్గా నిలిచి రేవంత్ ని విన్నర్ చేశాడు.