మొదలైన బిగ్ బాస్ సీజన్-7 సందడి

తెలుగు బిగ్ బాస్ 7 వీక్షకులారా, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో మన ముందుకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 రిలీజ్ అయిన అనంతరం ప్రతి ఒకరు షాక్ కి గురయ్యారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 లో అంతా ఉల్టా పల్టాగా జరుగుతుంది. విశేషాలు తెలుసుకుందాం రండి.. కుడి ఎడమైనా పర్లేదు:  ఈమధ్య వచ్చిన బిగ్ బాస్ 7 లో నాగార్జున చేసిన ప్రోమో చూసారా? […]

Share:

తెలుగు బిగ్ బాస్ 7 వీక్షకులారా, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో మన ముందుకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 రిలీజ్ అయిన అనంతరం ప్రతి ఒకరు షాక్ కి గురయ్యారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 లో అంతా ఉల్టా పల్టాగా జరుగుతుంది. విశేషాలు తెలుసుకుందాం రండి..

కుడి ఎడమైనా పర్లేదు: 

ఈమధ్య వచ్చిన బిగ్ బాస్ 7 లో నాగార్జున చేసిన ప్రోమో చూసారా? కొత్తగా ఏమి చెప్పాలి? ఈసారి సరికొత్తగా ఉండబోతోంది అని పాప్కార్న్ తింటూ వచ్చి, ఇలా ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఈసారి కొత్తగా చెప్తాను అని “కుడి ఎడమైనతే పొరపాటులేదోయ్..” అన్నాడు కింగ్. కుడి ఎడమైనా పర్లేదు మనం ఓడిపోము అని ఏఎన్ఆర్ చేసిన దేవదాసు సినిమాలో పాట పాడుతూ స్టైల్గా “మీరు ఓడిపోయినా పర్లేదు పాల్గొటం ముఖ్యం” అని పాల్గొనే వారిని ఆహానిస్తున్నాడా.. ఈ మన్మధుడు అని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే అనుకున్నట్టుగానే, ప్రోమోలో చూపించిన విధంగానే, బిగ్ బాస్ హౌస్ లో అంతా రివర్స్ లో జరుగుతోంది. మొదటి రోజే, బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి 5 కంటెస్టెంట్లకు సుమారు 35 లక్షలు ఆఫర్ చేయడం జరిగింది. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్ లో, పాల్గొన్న కంటెస్టెంట్ల లో ఎవరైతే చివరి వరకు ఉంటారో, ఆ ఐదు మందికి మాత్రమే 35 లక్షలు ఆఫర్ చేయడం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ సీజన్-7 మొదలైన మొదటి రోజే జరగడం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కంటెస్టెంట్లు గా వచ్చింది ఎవరు?: 

షో మొదలైన దగ్గర్నుంచి, ముందు నుంచి అనుకున్న కంటెస్టెంట్లు వస్తారా! లేదంటే కంటెస్టెంట్లు మారుతారా? అని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్న ప్రేక్షకులు, వచ్చిన కంటెస్టెంట్లను చూసి సంబరాశ్చర్యాలకు గురయ్యారు. నిజానికి బిగ్ బాస్ సీజన్-7 అన్ని సీజన్ల కన్నా భిన్నంగా ఉంటుంది అని మొదటి నుంచి ప్రోమోలో చూపించిన విధంగానే, ఈ సీజన్ లో అంత తారుమారుగా జరగడం కనిపించింది. కేవలం 15 మంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ మొదటి రోజున సందడి చేశారు. ఇక కంటెస్టెంట్లు విషయానికి వస్తే..

ప్రియాంక జైన్ – ప్రఖ్యాత టీవీ సీరియల్ ఆర్టిస్ట్ – మౌనరాగం మరియు జానకి కలగలేదు టీవీ సీరియల్స్‌లో పనిచేశారు.

శివాజీ – తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి.. పరిచయం అవసరం లేదు.

దామిని భట్ల – బాహుబలిలోని పచ్చబొట్టేసిన పాపులర్ పాట మరియు కొండ పొలం చిత్రంలో ధమ్ ఢామ్ పాడారు, దీనికి ఇటీవల చంద్రబోస్ జాతీయ అవార్డును అందుకున్నారు.

ప్రిన్స్ యావార్ – మోడల్ మరియు ఫిట్‌నెస్ ఫ్రీక్, అతను కోల్‌కతాకు చెందినవాడు మరియు హైదరాబాద్‌లో కెరీర్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు.

సుభాశ్రీ రాయగురు – నటి మరియు న్యాయవాది – ఇటీవల అమిగోస్ చిత్రంలో నటించారు.

షకీలా – సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.

ఆట సందీప్ – బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్, గతంలో అనేక రియాల్టీ షోలలో పాల్గొన్నారు.

శోభా శెట్టి – కార్తీక దీపంలోని ‘మోనిత’ పాత్రకు ప్రసిద్ధి చెందింది.

టేస్టీ తేజ – ఫుడ్ వ్లాగర్.. ఫుడ్.. ఇంక తనదైన శైలిలో వినోదంతో తాజా సినిమాలను ప్రమోట్ చేస్తుంటాడు.

రాధిక – సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ – రీసెంట్‌గా నేను స్టూడెంట్ సర్ సినిమాలో నటించింది.

గౌతం కృష్ణ – నటుడు మరియు డాక్టర్– ఆకాశవీధుల్లో సినిమాలో నటించారు.

కిరణ్ రాథోడ్ – జెమిని మరియు మరెన్నో చిత్రాలలో నటించిన ప్రముఖ నటి.

పల్లవి ప్రశాంత్ – యూట్యూబర్, బిగ్ బాస్ షోలో భాగం కావాలని చాలా కాలంగా కోరుకుంటున్న డై హార్డ్ ఫ్యాన్.
అమర్‌దీప్ – పరిణయం సీరియల్ తో పాపులర్ అయిన టీవీ సీరియల్ ఆర్టిస్ట్.