Bigg Boss Telugu 7: రసతవర్తంగా సాగుతున్న బిగ్ బాస్ షో..

బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu 7)  షో చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది కంటెస్టుంట్లు ఈ షో (Bigg Boss Telugu 7) నుంచి ఇంటికి పయనం కాగా.. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ పూర్తయ్యాయి. శని, ఆదివారాల్లో షోను హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున (Nagarjuna) వచ్చి షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్రకటించనున్నారు. అప్పటి వరకు కేవలం ఊహాగానాలు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ […]

Share:

బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu 7)  షో చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది కంటెస్టుంట్లు ఈ షో (Bigg Boss Telugu 7) నుంచి ఇంటికి పయనం కాగా.. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ పూర్తయ్యాయి. శని, ఆదివారాల్లో షోను హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున (Nagarjuna) వచ్చి షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్రకటించనున్నారు. అప్పటి వరకు కేవలం ఊహాగానాలు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ ఊహాగానాలు (Expectations) కొన్ని సార్లు నిజం అయిన కానీ అవి కేవలం ఊహాగానాలు మాత్రమే. వాటినే నిజాలుగా అస్సలుకే పరిగణలోకి తీసుకోలేం. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ (Nominations) ఆల్ మోస్ట్ పూర్తి కాగా.. కొంత మంది డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. సీజన్ 7 (Bigg Boss Telugu 7) ఎవరి అంచనాలకు అందకుండా ఉంటుందని హోస్ట్ నాగ్ ముందు నుంచే చెబుతున్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ అనేక గొడవలతో మొదలైంది. ఇక మొదటి సీజన్ నుంచే (Bigg Boss Telugu 7) బిగ్ బాస్ అంటే గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలు అనే ముద్ర జనాల్లో బలంగా నాటుకుపోయింది. మునుపటి గొడవలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సీజన్ (Bigg Boss Telugu 7) లో కూడా గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకుంటూ షో (Bigg Boss Telugu 7) ను హీటెక్కిస్తున్నారు.

డేంజర్ జోన్ లో ఉన్నది వీరే.. 

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7) కు ఈ వారం కూడా నామినేషన్స్ ఓ కొలిక్కి వచ్చాయి. మొదటి రౌండ్ నామినేషన్‌ లో, సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, భోలే షావలి, పూజా మూర్తి, గౌతమ్ మరియు ప్రియాంక డేంజర్ జోన్‌ లో ఉన్న పోటీదారులుగా పరిగణించారు. ఈ. నామినీల జాబితాలోకి అమర్‌దీప్‌ ను కూడా చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో (Bigg Boss Telugu 7) నామినేషన్ ప్రక్రియ కొలిక్కి వచ్చినా కానీ, సురక్షితంగా ఉన్నవారిపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే, ఈ రాత్రి ఎపిసోడ్ నామినీలను (Nominees) వెల్లడించే అవకాశం ఉంది. అంతే కాకుండా షో ను ఫాలో అవుతున్న వారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్ కు ఓటు (Voting) వేసే  అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. 

Read Also: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్..

నామినేషన్ ప్రాసెస్ ఇది.. 

హౌస్‌ మేట్‌ (HouseMate) లు తమ ఏ-గేమ్‌ ను టేబుల్‌ పైకి తీసుకురావడంతో ఈ సారి నామినేషన్లు ఉంటున్నాయి. ఫుల్ జోకులు (Jokes) వేసే కంటెస్టెంట్ గా పేరుగాంచిన భోలే షావలికి అత్యధిక ఓట్లు వచ్చాయి. అతడిని తన తోటి హౌస్‌ మేట్స్ అయిన అమర్‌ దీప్, పూజా మూర్తి, సందీప్, అర్జున్ మరియు ప్రియాంక నామినేట్ చేశారు. వారు అతని ఆటతీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నామినేట్ చేశారు. అశ్విని శ్రీ కూడా అధిక సంఖ్యలో ఓట్లతో టాప్ ప్లేస్ కు పోటీపడింది. కానీ తను చివర్లో మిస్ అయింది. 

తిరిగొచ్చిన శివాజీ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7) అంచనాలకు అందకుండానే సాగుతోంది. షో నుంచి అర్దాంతరంగా వెళ్లిపోయిన ఒకప్పటి హీరో శివాజీ (Sivaji) తిరిగి బిగ్ బాస్ హౌస్ లో చేరిపోయాడు. కొన్ని రోజుల క్రితం ఆయన తనకు అయిన గాయానికి స్కాన్ (Scan) చేయించుకునేందుకు బయటకి వెళ్లారు. రీసెంట్ గా ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్ కంటే ముందు కెప్టెన్ యావర్ తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ కు గురి చేసింది. వంటగది విభాగానికి అతడు డిప్యూటీలను నియమించే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అందుకు గాను యావర్ శివాజీ మరియు సందీప్ లను ఎంచుకున్నాడు.  ఈ షో అప్పుడే 7వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ్ ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈ షో ఎవరి అంచనాలకు అందకుండా సాగుతోంది. ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఊహిస్తే సంబంధం లేకుండా మరొకరు ఎలిమినేట్ అవుతూ షాక్ ఇస్తున్నారు. 7వ వారంలోకి వచ్చింది కావున ఇక షోలో కొత్త కొత్త స్ట్రాటజీలను మనం చూసే అవకాశం ఉంటుంది. టైటిల్ ను గెలుచుకునేందుకు అందరూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.