Bigg Boss 7: బిగ్‌బాస్ అమ్మాయిలకు అచ్చిరాలేదా? ఈసారి నయని పావని ఎలిమినేట్

బిగ్‌బాస్‌ (Bigg Boss 7):  హౌస్‌ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈసారి కూడా అమ్మాయే హౌస్‌ నుంచి బయటికి వచ్చింది. తొలి వారంలో కిరణ్ రాథోడ్, తర్వాత షకీలా, దామినీ, రతిక, శుభశ్రీ, ఇప్పుడు నయని పావని. వరుసగా ఆడవాళ్లే బయటికి వచ్చేస్తున్నారు. తొలి వారంలోనే కిరణ్‌రావు ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు కూడా తన తొలి వారంలోనే నయని పావని ఎలిమినేట్ అయింది. గత వారం గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు తొలుత ప్రకటించి, తర్వాత […]

Share:

బిగ్‌బాస్‌ (Bigg Boss 7):  హౌస్‌ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈసారి కూడా అమ్మాయే హౌస్‌ నుంచి బయటికి వచ్చింది. తొలి వారంలో కిరణ్ రాథోడ్, తర్వాత షకీలా, దామినీ, రతిక, శుభశ్రీ, ఇప్పుడు నయని పావని. వరుసగా ఆడవాళ్లే బయటికి వచ్చేస్తున్నారు. తొలి వారంలోనే కిరణ్‌రావు ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు కూడా తన తొలి వారంలోనే నయని పావని ఎలిమినేట్ అయింది. గత వారం గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు తొలుత ప్రకటించి, తర్వాత సీక్రెట్‌ రూమ్‌కు పంపారు. దీంతో అతడు మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.

ఏడ్చేసిన నయని పావని

వైల్డ్‌ కార్డుతో హౌస్‌లోకి అడుగుపెట్టిన పావని వారం రోజుల్లోనే బిగ్‌బాస్‌ (Bigg Boss 7) హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో అమర్‌‌దీప్, తేజ, అశ్వినీ, ప్రిన్స్ యావర్, పూజ, శోభాశెట్టి, నయని పావని ఉండగా.. చివరకు అశ్విని, నయని పావని (Nayani Pavani) మిగిలారు. ఈ సందర్భంగా అశ్విని, పావని ఎదురుగా రెండు బాటిళ్లను ఉంచారు. వాటిలో నంబర్ 1 బాటిల్‌లో ఉన్న లిక్విడ్‌ను ఫిష్ బౌల్‌లోకి పోశారు. ఇద్దరి బౌల్స్‌ రెడ్‌ కలర్‌‌లోకి మారాయి. దీంతో హోస్ట్ నాగార్జున.. ఈ వారం డబుల్ ఎలిమినేషనా? అని ప్రశ్నించారు. కొద్దిసేపు ఆగిన తర్వాత రెండో బాటిల్‌లోని లిక్విడ్‌ను పోయమని చెప్పారు. రెండో సారి పోసినా పావని బౌల్‌ రెడ్ కలర్‌‌లోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున (nagarjuna) ప్రకటించారు. తన పేరు చెప్పగానే పావని భావోద్వేగానికి గురైంది. తర్వాత కార్యక్రమాన్ని ముగించే ముందు పావని మాట్లాడింది. ఏడుస్తూనే అందరి గురించి పాజిటివ్‌గా మాట్లాడి.. విష్ చేసి వెళ్లిపోయింది.

బాగా ఆడినా ఎలిమినేషన్

బిగ్‌బాస్ 7 (Bigg Boss 7) లో  గత వారం ఐదుగురు సభ్యులు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పావని, అశ్విని, భోలే షావలి వచ్చారు. వీరిలో అశ్విని, నయని పావని చివరి దాకా నామినేషన్లలో ఉన్నారు. అయితే నిజానికి తక్కువ ఓట్లు పొందిన వాళ్లలో శోభా శెట్టి, పూజా మూర్తి ఉన్నారు. వారి కన్నా ఎక్కువ ఓట్లు పావనికి పడ్డాయి. అయినప్పటికీ పావనిని ఎలిమినేట్ చేశారు. ‘ఆ అమ్మాయి బాగా ఆడుతోంది సార్.. కావాలంటే నన్ను ఎలిమినేట్ చేసి.. ఆమెను ఆడించండి’ అంటూ శివాజీ చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలోనూ పావని ఎలిమినేషన్‌పై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్లలో (దామిని భాటియా,  రతిక రోజ్, శుభశ్రీ రాయగురు) ఒకరు తిరిగి హౌస్‌లోకి వచ్చేందుకు అవకాశం ఉందట. ఇందుకోసం కంటెస్టెంట్లతో ఓటింగ్ పెట్టారు. అయితే ఓట్లు ఎక్కువ వచ్చిన వారిని కాకుండా.. తక్కువ ఓట్లు పడ్డ వారిని హౌస్‌లోకి పంపిస్తామని నాగార్జున ప్రకటించడం గమనార్హం. 

ఒక్కసారే మహిళ విన్నర్

బిగ్‌బాస్‌ ఇప్పటిదాకా 8 సీజన్లు సాగింది. ఇందులో ఒకటి ఓటీటీ కాగా, మిగతావి రెగ్యులర్‌‌గా సాగాయి. అయితే ఈ ఎనిమిది సీజన్లలో ఒక్కసారి, అది కూడా ఓటీటీ సీజన్‌లో మహిళ గెలుపొందింది. బింధుమాధవి విజయం సాధించింది. తర్వాత ఎన్నడూ అమ్మాయలు గెలవలేదు. గీతా మాధురి, శ్రీముఖి మాత్రమే ఫైనల్ దాకా వెళ్లారు. కానీ వాళ్లు విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ సారి కూడా ఉన్న మహిళలందరూ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. దీంతో ఈ సీజన్‌లో మహిళలు విన్నర్‌‌గా నిలవడం డౌట్‌గానే కనిపిస్తోంది.