జం జం జజ్జనక సాంగ్ వచ్చేసింది..

చిరంజీవి సినిమా అంటేనే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కదండీ.. అదే విధంగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా మీద మరింత అంచనాలు పెంచే విధంగా ఈ పాటను రూపొందించడం జరిగింది. ప్రేక్షకులు, చిరంజీవి అభిమానులు ఈ సాంగ్ వింటూ మైమరిచిపోతున్నారు.  జం జం జజ్జనక సాంగ్:  ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరంజీవి బోలా శంకర్ లోనుంచి మరో […]

Share:

చిరంజీవి సినిమా అంటేనే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కదండీ.. అదే విధంగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా మీద మరింత అంచనాలు పెంచే విధంగా ఈ పాటను రూపొందించడం జరిగింది. ప్రేక్షకులు, చిరంజీవి అభిమానులు ఈ సాంగ్ వింటూ మైమరిచిపోతున్నారు. 

జం జం జజ్జనక సాంగ్: 

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరంజీవి బోలా శంకర్ లోనుంచి మరో సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఈ లిరికల్ వీడియో పార్టీ సాంగ్ అవడంతో ప్రతి ఒక్కరూ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాటలో ఫోక్ అలాగే తెలంగాణ యాస కూడా మిక్స్ అయింది. అందుకే ప్రేక్షకులకు ఈ పాట గమ్మత్తుగా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. 

చిరంజీవి గారు 67 వయసులో కూడా తన డ్యాన్స్ ఇరగదీసారు. అంతేకాకుండా ఈ పాటలో ముఖ్యంగా తమన్న, కీర్తి గ్లామర్ ని ఆడ్ చేశారు. ఈ పాటలో సుశాంత్ కూడా కనిపించడం జరుగుతుంది. ఈ పాట వినగానే ఎవరికైనా సరే అదిరే స్టెప్పులు గుర్తొచ్చి డాన్స్ చేయాలనిపిస్తుంది. ఈ పాటకి మ్యూజిక్ అందించిన వారు మహత స్వారీ. పాటను ఆలపించిన వారు మంగ్లీ, అనురాగ్ కులకర్ణి. 

జామ్ జామ్ జజ్జనకా పోస్టర్లో చిరంజీవి, కీర్తి, తమన్నా మరియు సుశాంత్ చాలా అందంగా కనిపిస్తారు. స్టైలిష్ ఎత్నిక్ డ్రెస్‌లో మెగాస్టార్‌తో పాటు నటీమణులు లెహంగాల్లో అందంగా కనిపిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇప్పుడు భోలా శంకర్లో అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా టీజర్‌లోని కనిపించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 

బోలా శంకర్ సినిమా: 

2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం వేదాళం రీమేక్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న భోలా శంకర్. ఈ చిత్రంలో తమన్నా చిరంజీవికి జతగా నటిస్తూ ఉండగా, మరోవైపు కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది. బోలా శంకర్ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, మరియు ఉత్తేజ్ కూడా నటించారు.

భారీ అంచనాల మధ్య, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన క్షణం నుంచి ఎన్నో ఆదరాభిమానాలను అందుకుంది అంతేకాకుండా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ పవర్-ప్యాక్డ్ యాక్షన్ అంతే కాకుండా బ్యాగ్రౌండ్ లో వినిపించ మాస్ మ్యూజిక్ ర్యాంపేజ్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. భోళా శంకర్ ఈ సంవత్సరం ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. అదే రోజున విడుదలవుతున్న రజనీకాంత్ జైలర్‌ మూవీకి గట్టి పోటీ ఇవ్వనుంది. 

దూసుకుపోతున్న తమన్నా సినిమాలు: 

రజనీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. ఈ సినిమాలో కావాలా అనే పాటను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా స్టెప్పులు ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి.  రజనీకాంత్ తో కలిసి తమన్నా స్టెప్పులు వేయడం సినిమా పై అంచనాలను మరింత పెంచింది. 

శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ లో నటించింది తమన్నా. ఈ సినిమా విజయంతో తమన్నా ఓవర్ నైట్ స్టార్ అయింది. అక్కడి నుంచి తమన్నా వెనుతిరిగి చూసుకోలేదు. ఒక్కసారిగా ఇండస్ట్రీలో చాలామందికి తన కాల్ షీట్ దొరకని పరిస్థితి వచ్చింది. రామ్ చరణ్ తో రచ్చ, కార్తితో ఆవారా, నాగచైతన్యతో 100% లవ్ ఇలా అన్ని పెద్ద చిత్రాల్లో తనే కనిపించింది. తమన్నా సమంత లాంటి స్టార్స్ కి మంచి పోటీ ఇచ్చింది. ఇంకా తమన్నా రవితేజతో బెంగాల్ టైగర్, నాగార్జున కార్తీతో కలిసి ఊపిరి లాంటి సినిమాల్లో కూడా నటించింది. తమన్నా తెలుగులో మహేష్ బాబు లాంటి స్టార్స్ హీరోస్తో కూడా నటించింది. అంతేకాకుండా తను వెబ్ సిరీస్లో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె అకౌంట్లో ఉన్న బోలా శంకర్, జైలర్ సినిమాలు తమన్నాకు మంచి విజయం అందించాలని కోరుకుందాం.