భోళా శంకర్ మొదటి రోజు వసూళ్లు

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ  శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా, విమర్శకుల దగ్గర నుంచి మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది.  చిరంజీవి నటించిన ఈ భోళా శంకర్ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా, మురళి శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, సురేఖావాణి, తులసి, హైపర్ ఆది, గెటప్ శీను, బిత్తిరి సత్తి, లోబో, రష్మీ గౌతమ్, శ్రీముఖి తగిన పాత్రలో చేసి మెప్పించారు.  […]

Share:

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ  శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా, విమర్శకుల దగ్గర నుంచి మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. 

చిరంజీవి నటించిన ఈ భోళా శంకర్ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా, మురళి శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, సురేఖావాణి, తులసి, హైపర్ ఆది, గెటప్ శీను, బిత్తిరి సత్తి, లోబో, రష్మీ గౌతమ్, శ్రీముఖి తగిన పాత్రలో చేసి మెప్పించారు. 

ఈ సినిమాకు దర్శకత్వం వహించింది బిల్లా, శక్తి, షాడో సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు మెహెర్ రమేష్ మొట్ట మొదటి సారిగా చిరంజీవితో కలిసి పని చేస్తున్నారు, అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద, అనిల్ సుంకర రామ బ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ కొడుకు అయిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు, సినిమా విడుదల కాకముందే ఈ సినిమా యొక్క పాటలు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతోంది. 

బాక్సాఫీస్ వద్ద పర్లేదనిపించిన మూవీ

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎంత వసూలు చేసిందో చెప్పాలంటే, మంచి ప్రారంభమనే చెప్పుకోవచ్చు కానీ చిరంజీవి స్థాయి కలెక్షన్ అయితే కానే కాదు. 

ట్రేడ్ పండితుల ప్రకారం, చిరంజీవి భోళా శంకర్ సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వారాంతంలో ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించినట్లైతే నంబర్ పెరిగే అవకాశం ఉంది. చిరంజీవి గత సినిమా వాల్తేర్ వీరయ్యతో పోల్చుకుంటే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ తక్కువనే చెప్పుకోవాలి. 

రిమేక్ అయినా కానీ

ఈ సినిమా కోలీవుడ్‌లో అజిత్ నటించిన వేదలం సినిమాకు రీమేక్. అందులో అజిత్ నటనకు విమర్శల నుంచి ప్రశంసలు వచ్చాయి అన్నది అందరికీ తెలిసినదే. ఈ వేదలం తమిళ సినిమా ఓటిటిలో అందుబాటులో లేకపోవడం వల్ల రీమేక్‌కి ఆస్కారం ఉన్నందున ఈ సినిమా చేశామని చిరంజీవి ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.  రాబోయే రోజుల్లో భోళా శంకర్ సినిమా ఎటువంటి ఊపు అందుకోబోతుందో వేచి చూద్దాం. 

మరో పక్క జైలర్ హవా

 ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ పలు రికార్డులను కొల్లగొడుతోంది. ఈ మూవీతో పోల్చుకుంటే మెగాస్టార్, మహానటి కీర్తి సురేష్, అందాల బొమ్మ తమన్నా నటించినా కానీ భోళా శంకర్ ను కాపాడలేకపోయారు. మూవీకి మెగా మేనియా తోడవుతుందని అంతా అనుకున్నారు కానీ ఆ విధంగా జరగలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ డైరెక్టర్ మెహర్ రమేష్ మీద పీకలదాక కోపం మీద ఉన్నారు. తమ అభిమాన హీరో అవకాశం ఇస్తే ఇలా చేస్తావా అని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. మరో పక్క దీని మాతృక అయిన వేదాలం మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ మూవీ.  అయినా కానీ ఇక్కడ రిమేక్ ప్లాప్ ఇచ్చాడు మెహర్ రమేష్. దీంతో మెగా ఫ్యాన్స్ అతడి మీద ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. 

మెహర్ అంతే

డైరెక్టర్ మెహర్ రమేష్ గత చిత్రాలను చూసుకుంటే కూడా ఆయన ఇదే విధంగా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. ఓ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను శక్తిలా ప్రజెంట్ చేసి బొక్క బోర్లా పడ్డాడు. అప్పడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఇలియానా ఇందులో నటించినా కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక మరో మారు విక్టరీ వెంకటేశ్ ను షాడోలా ప్రజెంట్ చేసి చేతులు కాల్చుకున్నాడు.