భగవంత్ కేసరి ట్రైలర్ హైలెట్స్ 

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలలో కనిపించే ఎనర్జీ, డాన్స్, డైలాగ్స్, ముఖ్యంగా ఫైట్ సీన్స్ చూసేందుకు చాలామంది మక్కువ చూపిస్తూ ఉంటారు. బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ వచ్చేసింది.  భగవంత్ కేసరి ట్రైలర్:  ట్రైలర్‌లో చూస్తే, ఈ చిత్రం యాక్షన్-ప్యాక్డ్ రైడ్‌గా ఉండబోతోంది, ఎందుకంటే NBK ఈ సినిమాలో ప్రత్యేకమైన ఫైట్ సీన్స్ ఉండేలా చూసినట్లు తెలుస్తోంది. సినిమాలో విలన్ గా […]

Share:

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలలో కనిపించే ఎనర్జీ, డాన్స్, డైలాగ్స్, ముఖ్యంగా ఫైట్ సీన్స్ చూసేందుకు చాలామంది మక్కువ చూపిస్తూ ఉంటారు. బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ వచ్చేసింది. 

భగవంత్ కేసరి ట్రైలర్: 

ట్రైలర్‌లో చూస్తే, ఈ చిత్రం యాక్షన్-ప్యాక్డ్ రైడ్‌గా ఉండబోతోంది, ఎందుకంటే NBK ఈ సినిమాలో ప్రత్యేకమైన ఫైట్ సీన్స్ ఉండేలా చూసినట్లు తెలుస్తోంది. సినిమాలో విలన్ గా ఉన్న అర్జున్ రాంపాల్ నటుడిని ఎదిరిస్తూ కొన్ని వైలెన్స్ డైలాగ్స్ చెప్తున్నా బాలకృష్ణ సన్నివేశాలు ట్రైలర్ లో కనిపించాయి. కాజల్ అగర్వాల్ పాత్ర కేవలం స్టార్‌ని హైప్ చేయడానికి మాత్రమే ప్రోమో వీడియోలో కనిపించినట్లు అనిపిస్తుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో హిందీ సినిమాల్లో ప్రధానంగా కనిపించిన అర్జున్ రాంపాల్ టాలీవుడ్ అరంగేట్రం ఇది. రాహుల్ సంఘ్వీ పాత్రలో అర్జున్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం S థమన్ అందించారు. ఈ సినిమా అక్టోబర్ 19 న సినిమాల్లో విడుదల అవుతుంది, రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావుతో తలపడడానికి వచ్చేస్తుంది, టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల అవుతుంది. 

బోయపాటితో అఖండ 2!: 

నందమూరి బాలకృష్ణ ‘స్కంద’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమాన దర్శకుడు బోయపాటిపై ప్రశంసలు కురిపించారు. ప్రతి సినిమాతో ఎప్పుడు కూడా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లడానికి మాత్రమే బోయపాటి శ్రీను ప్రయత్నిస్తారని పేర్కొన్నారు బాలకృష్ణ. గత హిట్‌ల గురించి ఆలోచించకుండా ఒక సినిమా తర్వాత మరొకటి ముందుకు సాగుతూనే ఉన్నామని.. తాము ప్రతి సినిమాను కొత్తగా ప్రారంభించామని.. అంతేకాకుండా’సింహా నుండి ‘అకండ’ వరకు పెద్ద హిట్‌లను అందించడానికి దానిపై పూర్తిగా దృష్టి పెట్టామని అని నందమూరి బాలకృష్ణ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడారు. ఇదే వేదికపై బాలకృష్ణతో ‘అఖండ 2’ సినిమా చేస్తానని బోయపాటి చెప్పడంతో స్టేడియంలో నందమూరి అభిమానుల చప్పట్లు కొట్టారు.

నిజానికి బోయపాటి సినిమా చేసేందుకు బాలకృష్ణ ఎప్పుడు వెనకాడడు. బాలకృష్ణ హిట్లు, ఫ్లాప్‌ల గురించి నిజానికి పట్టించుకోరు. ఫలానా దర్శకుడు చెప్పిన కథ ప్రకారం వెళతాడు.. అతనికి నచ్చితే, సినిమాకి ఓకే చెప్తాడు బాలకృష్ణ. 

భగవంత్ కేసరిలో ప్రత్యేక ఆకర్షణ శ్రీలీల:

శ్రీలీల పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఆమెకు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గడియారంతో పోటీపడుతూ షూటింగ్స్ లో బిజీగా ఉంది అని చెప్పుకోవాలి. తెలుగు మాట్లాడే అమ్మాయి కావడం కూడా ఆమె కెరీర్‌కు కొంత ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మరియు ఇతరుల కంటే ఎక్కువ సినిమాలు, యంగ్ స్టార్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. 

యువ సంచలనం శ్రీలీల ఖచ్చితంగా టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె సినిమాలు, రాబోయే ఐదు నెలలలో వరుసగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 15న విడుదల అయిన రామ్ పోతినేని-బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘స్కంద’లో శ్రీలీల కనిపించి అందర్నీ ఆకర్షించింది. ఆమె నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’లో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.