జవాన్ సినిమాలో ఇదే బెస్ట్ సీన్ అంటున్న ఫ్యాన్స్

షారుక్ ఖాన్ మరొకసారి ఒక పెద్ద హిట్ తో సెప్టెంబర్ 7న జవాన్ సినిమాతో అందరి ముందుకు వచ్చాడు. ఈ సినిమా సినీ ప్రేక్షకుల మనసుల్నే కాకుండా, ప్రత్యేకించి పాలిటిక్స్ మీద కూడా దృష్టి పెట్టినట్టు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  జవాన్ సినిమా ప్రత్యేక వీడియో:  ‘జవాన్’ సినిమా, భారతీయ వ్యవస్థలోని ఉన్న అనేకమైన లొసుగులను ఎత్తిచూపుతూ సామాజిక రంగంలోకి ధైర్యంగా దూసుకుపోతుంది. అయితే షారుక్ ఖాన్ తన సినీ కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది […]

Share:

షారుక్ ఖాన్ మరొకసారి ఒక పెద్ద హిట్ తో సెప్టెంబర్ 7న జవాన్ సినిమాతో అందరి ముందుకు వచ్చాడు. ఈ సినిమా సినీ ప్రేక్షకుల మనసుల్నే కాకుండా, ప్రత్యేకించి పాలిటిక్స్ మీద కూడా దృష్టి పెట్టినట్టు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

జవాన్ సినిమా ప్రత్యేక వీడియో: 

‘జవాన్’ సినిమా, భారతీయ వ్యవస్థలోని ఉన్న అనేకమైన లొసుగులను ఎత్తిచూపుతూ సామాజిక రంగంలోకి ధైర్యంగా దూసుకుపోతుంది. అయితే షారుక్ ఖాన్ తన సినీ కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది ప్రత్యేకమైన సినిమా అంటున్నారు ఫాన్స్. జవాన్ లో చూపించిన ఒక ప్రత్యేకమైన సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది, ఆ సన్నివేశం వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది అని చెప్పుకోవచ్చు. ఆ వీడియో ద్వారా, ఖాన్ తమ ఓటును కులం, మతం మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయకండి అని, కేవలం విద్యా, వైద్యం, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండేలా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ, జవాన్ సినిమాలో షారుక్ చెప్పిన డైలాగ్ లు వైరల్ గా మారుతున్నాయి. ఆ జవాన్ సినిమాలో చెప్పిన డైలాగ్ తాలూకా క్లిప్, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. 

‘జవాన్’ సినిమా ద్వారా షారూఖ్ ఖాన్ తిరిగి రాజకీయ గొంతును బయటపెట్టాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దేశంలో పెరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, షారుక్ జవాన్ సినిమా ద్వారా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. 2015 నుండి రాజకీయ విషయాలపై మౌనం వహించిన, ఇప్పుడు మరింత పదునైన, ఆలోచింపజేసే సందేశంతో మళ్లీ, షారుక్ ఖాన్ తెరపైకి వచ్చాడు అంటూ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జవాన్ సినిమాలో మరో ఆకర్షణ నయనతార: 

ఇప్పుడున్న హీరోయిన్ల‌లో ఎవ‌రైనా లేడీ సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నారు అంటే అది న‌య‌న‌తార‌. ర‌జినీకాంత్ త‌ర్వాత అంత‌టి రేంజ్‌లో హీరోయిన్ల‌లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు జ‌వాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఉత్కంఠ భరితంగా సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన జవాన్ సినిమాలో మరో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది సౌత్ ఇండియా సూపర్ స్టార్ నయనతార. ఒక పోలీస్ ఆఫీసర్ గా అదే విధంగా శారీలో కూడా షారుక్ ఖాన్ పక్కన ఆకట్టుకుంది. జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో నయనతారే కాకుండా విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా కూడా నటించారు. 

నయనతార సుమారు 20 ఏళ్ల క్రింద సినీ రంగ ప్రవేశం చేసింది. చంద్రముఖి సినిమా తనకి మొదటగా బ్రేక్ ఇచ్చింది. తర్వాత తను తెలుగులో లక్ష్మీ తో అరంగ్రేటం  చేసింది. తర్వాత నాగార్జునతో బాస్ సినిమా నటించింది. ఆ తర్వాత కూడా నయనతార ప్రభాస్ తో యోగి, రవితేజ తో దుబాయ్ శీను వంటి సినిమాలు చేసింది. నయనతార తన పర్ఫార్మెన్స్ తో కొంత కాలంలోనే టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయింది. తెలుగులో నటిస్తూనే తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. నయనతార నటించిన హిందీ సినిమా జవాన్ మరింత విజయం సాధించి అక్కడ కూడా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుందాం. నయనతార బాలీవుడ్ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి తనకు ఇది బాగా కలిసి రావాలని కోరుకుందాం.