ఇండియాలో బెస్ట్ యాక్టర్స్ వీళ్లే

సినిమా స్టార్స్ చెప్పారని చాలా మంది చాలా అలవాట్లను మానేశారు. అంతే కాకుండా వారిని చూసి కొత్తగా అలవాట్లను కూడా నేర్చుకున్నారు. ఈ విశాల దేశంలో ఒక్కటని కాదు అనేక రకాల ఇండస్ట్రీలు ఉన్నాయి. చాలా రాష్ట్రాలకు ప్రత్యేక భాషలు ఉండడం మూలాన అక్కడి స్థానిక భాషలో సినిమాలు తీయడం ఎక్కువైంది.  అక్కడి స్థానిక హీరోలు, స్థానిక డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పుట్టుకొచ్చారు. మా హీరో గొప్ప అంటే.. కాదు, మా హీరో గొప్ప అని హీరోల అభిమానులు […]

Share:

సినిమా స్టార్స్ చెప్పారని చాలా మంది చాలా అలవాట్లను మానేశారు. అంతే కాకుండా వారిని చూసి కొత్తగా అలవాట్లను కూడా నేర్చుకున్నారు. ఈ విశాల దేశంలో ఒక్కటని కాదు అనేక రకాల ఇండస్ట్రీలు ఉన్నాయి. చాలా రాష్ట్రాలకు ప్రత్యేక భాషలు ఉండడం మూలాన అక్కడి స్థానిక భాషలో సినిమాలు తీయడం ఎక్కువైంది. 

అక్కడి స్థానిక హీరోలు, స్థానిక డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పుట్టుకొచ్చారు. మా హీరో గొప్ప అంటే.. కాదు, మా హీరో గొప్ప అని హీరోల అభిమానులు కొట్టుకోవడం ఇది వరకే మన దేశంలో చాలా జరిగాయి. హీరోలు అంతా కలిసే ఉంటున్నా కానీ.. వారి అభిమానుల మధ్య కోల్డ్ వార్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇది ఒక్కోసారి గొడవలకు దారి తీస్తుంది.

ఇక ఇండియాలో తమ అభిమాన స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఉండే సందడి అంతా ఇంతా కాదు.. కొంత మందైతే ఏకంగా వారి ఆస్తులను అమ్మేసి మరీ.. హీరో సినిమాకు థియేటర్లను ముస్తాబు చేస్తుంటారు. చాలా మంది హీరోలు ఉన్న మన దేశంలో.. అసలు టాప్ హీరో ఎవరనేది మాత్రం అంతు చిక్కదు. ఎవరి అభిమానిని అడిగితే తమ ఆరాధ్య హీరోనే టాప్ హీరో అని చెబుతూ ఉంటారు. మరి టాప్ హీరోలెవరని ఓ సారి లుక్కేస్తే..

లెక్కలేనన్ని ఇండస్ట్రీలు

మన ఇండియాలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇంకా అనేక ఇతర భాషలలో చలనచిత్రాలను నిర్మిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ప్రత్యేక పేర్లతో ఇండస్ట్రీలు ఉన్నాయి. తెలుగు సినిమాలు తీసే చోట టాలీవుడ్ అని, హిందీ సినిమాలను తీసే వారిని బాలీవుడ్ జనాలని.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇన్ని రోజులు  దేశంలోని చాలా పరిశ్రమలు పెద్ద సినిమాలు తీయడం లేదని అనుకునే వారు. కానీ కొన్ని రోజుల నుంచి ఆ ట్రెండ్ మారింది. అన్ని ఇండస్ట్రీల వారు పెద్ద సినిమాలను తీస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల స్టామినా పెరిగింది. ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులు ఈ ఇండస్ట్రీలలో ఉన్నారు. కానీ అటువంటి తరుణంలో అసలు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ ఎవరనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. రికార్డులు, ఫ్యాన్ బేస్​ను బట్టి టాప్ నటుల జాబితాను మీకందిస్తున్నాం. ఇది ఏ హీరోను తక్కువ చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. గమనించగలరు.

అమితాబ్ బచ్చన్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అమితాబ్ ఒక ఐకాన్… అతడి కమాండింగ్ ఉనికి, శక్తివంతమైన నటనా నైపుణ్యాలను రీచ్ చేయడం, బీట్ చేయడం ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. ఇప్పటికే ఈ స్టార్ 200కు పైగా సినిమాల్లో నటించాడు. ఎన్నో చిత్రాలకు ఆయన తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

రజనీకాంత్

తమిళ చిత్ర పరిశ్రమలో ఇతనొక సూపర్ స్టార్. ఈ స్టార్​కు కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా వరల్డ్​వైడ్​గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. ఇంకా చురుగ్గా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే..  ఆఫీసులకు, స్కూళ్లకు సెలవులు ఇచ్చిన రోజులను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. 

మోహన్​లాల్

మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ నటుడు మోహన్ లాల్. దృశ్యం, పులిమురుగన్ వంటి చిత్రాలలో.. తన నటనకు అతను అనేక అవార్డులను గెలుచుకున్నాడు. మోహన్​లాల్​కు ఉన్న ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. కేరళలో అతడి సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ జోషే వేరు.

కమల్​హాసన్

కమల్ హాసన్ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 200కి పైగా చిత్రాలలో నటించిన లెజెండరీ నటుడు. ఇతడిలోని డిఫరెంట్ యాంగిల్స్​ విమర్శకుల నోళ్లకు తాళం వేస్తాయి. ఇప్పటికే ఈ హీరో అనేక అవార్డులను గెలుచుకున్నాడు.

మమ్ముట్టి

మమ్ముట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. మతిలుకల్, ఒరు వడక్కన్ వీరగాథ వంటి చిత్రాలలో తనంటే ఏంటో అందరికి చాటి చెప్పాడు. ఉత్తమ నటుడిగా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా అతను హీరోగా అనేక అవార్డులను గెలుచుకున్నాడు.

విజయ్ ​సేతుపతి

ఇక విజయ్​ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఏదో చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విజయ్.. నేడు పాన్ ఇండియా స్టార్​గా ఎదిగాడంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న విజయ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు విజయ్ నటిస్తున్న సినిమా అంటే ఆ హైప్ వేరే లెవల్​లో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

కేవలం వీరు మాత్రమే కాకుండా మన ఇండియన్ ఇండస్ట్రీలో అనేక మంది స్టార్ హీరోలు ఉన్నారు. కేవలం వీరు మాత్రమే కాకుండా ప్రత్యేక ప్రదర్శనలు చేసే వారు అనేకం. వీరిని మాత్రమే చెప్పి.. వేరే హీరోల గురించి ప్రస్తావించలేదంటే వారి అభిమానులను తక్కువ చేద్దామని మా ఉద్దేశం కాదని గమనించగలరు.