రెమ్యూనరేషన్ పెంపుకు నిరాకరించిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులు బాగానే మందికి తెలుసు. చాలా రోజుల నుంచి తన దైన శైలితో ఇండస్ట్రీని ఏలుతున్న బాలయ్య తాజాగా తీసుకున్న డెసీషన్ వైరల్ అవుతోంది. ఎన్ని రోజుల నుంచి ఉన్నా కానీ పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్లగా నిలిచానా కానీ బాలయ్య మాత్రం రెమ్యూనరేషన్ పెంచడం లేదు. తనకు అఖండ, వీరసింహా రెడ్డి వంటి హిట్లు ఉన్నా కానీ బాలయ్య మాత్రం తన రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కువగా డిమాండ్ చేయలేదు. […]

Share:

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులు బాగానే మందికి తెలుసు. చాలా రోజుల నుంచి తన దైన శైలితో ఇండస్ట్రీని ఏలుతున్న బాలయ్య తాజాగా తీసుకున్న డెసీషన్ వైరల్ అవుతోంది. ఎన్ని రోజుల నుంచి ఉన్నా కానీ పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్లగా నిలిచానా కానీ బాలయ్య మాత్రం రెమ్యూనరేషన్ పెంచడం లేదు. తనకు అఖండ, వీరసింహా రెడ్డి వంటి హిట్లు ఉన్నా కానీ బాలయ్య మాత్రం తన రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కువగా డిమాండ్ చేయలేదు. తనకు హిట్లు ఉన్నా అంతే కాకుండా తన సినిమాలకు పెద్ద ఎత్తున మార్కెట్ జరిగినా కానీ బాలయ్య మాత్రం రెమ్యూనరేషన్ పెంపు మీద పెద్దగా ఆసక్తి కనబర్చలేదు… 

తొలిసారి 20 కోట్ల క్లబ్ లో

నందమూరి బాలయ్య ప్రస్తుతం కామెడీ చిత్రాల స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి తన కెరియర్ లో 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మూవీ యూనిట్ భగవంత్ కేసరి అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. ఈ మూవీ కోసం బాలయ్య మొదటి సారిగా రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఇన్ని రోజులు మూవీలకు 16-17 కోట్లు మాత్రమే తీసుకున్నాడని సమాచారం. భగవంత్ కేసరి మూవీలో బాలయ్య తో పాటు యంగ్ బ్యూటీ శ్రీలల కూడా నటిస్తోంది. బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… యంగ్ బ్యూటీ శ్రీ లీల బాలయ్య కూతురిగా కనిపించుందని ఫిలిం నగర్ టాక్. 

ఇలా హిట్ కొట్టగానే అలా

ఇండస్ట్రీలో ప్రస్తుతం అనేక మంది యంగ్ హీరోలు ఉన్నారు. వారు ఇలా హిట్ పడగానే తమ నెక్ట్స్ చిత్రానికి అలా రెమ్యూనరేషన్ పెంచేస్తారు. కానీ బాలయ్య మాత్రం అలా కాదు. తన ఖాతాలో అఖండ, వీర సింహా రెడ్డి వంటి సాలిడ్ హిట్స్ ఉన్నా కానీ ఆ మూవీలు నిర్మాతలకు లాభాల పంట పండించినా కానీ రెమ్యూనరేషన్ హైక్ చేయకపోవడం గమనార్హం. ఇటువంటి హీరోలు ఎంత మంది ఉంటారని ఈ విషయం తెలిసిన పలువురు అంటున్నారు. బాలయ్య నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు. యంగ్ హీరోలు బాలయ్యను చూసి గుణపాఠం నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు. 

పాన్ ఇండియా పదంతో మరీనూ… 

ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. అన్ని మూవీలను పాన్ ఇండియా అని చెప్పి వేర్వేరు లాంగ్వేజ్ లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో మూవీ మార్కెట్ పెరుగుతోంది. ఒక వేళ మూవీ హిట్ అయితే వెంటనే నెక్ట్స్ మూవీ నుంచి రెమ్యూనరేష్ హైక్ చేసేస్తున్నారు. పాన్ ఇండయా స్టార్ట్స్ అంటూ చలామణి అవుతున్నారు. నిర్మాతకు మూవీ లాభాలు తెచ్చిపెట్టిందా లేక డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ సేఫ్ అయ్యారా అనేది ఏ మాత్రం ఆలోచించకుండా కొందరు యంగ్ హీరోలు తమకు ఇష్టం వచ్చినట్లు రెమ్యూనరేషన్ పెంచుతూ పోతున్నారు. ఈ పోకడ ఇండస్ట్రీకి అంతగా మంచిది కాదని అనేక మంది చెబుతున్నారు. 

నేర్చుకోవాల్సిన పాఠం అదే… 

బాలకృష్ణ సినీ హీరో మాత్రమే కాదు ఆయన ఓ రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యే కూడా. ఆయన రెమ్యూనరేషన్ పెంచినా కానీ నిర్మాతలు చచ్చినట్లు ఆయనతో మూవీ తీస్తారు. కానీ బాలయ్య మాత్రం రెమ్యూనరేషన్ పెంచలేదు. ఆయన గత సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చినా కానీ రెమ్యూనరేషన్ పెంచేందుకు వెనకడుగు వేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు బాలయ్యను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు అంటున్నారు. అలా అయితేనే ఇండస్ట్రీ లాభాల బాట పడుతుందని చెబుతున్నారు.