తెలంగాణ యాసను నేర్చుకుంటున్న బాల‌కృష్ణ‌

ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఏదో ఒక మాండలికంలో సినిమాలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ తెగ అట్రాక్ట్ అవుతున్నారు. కొన్ని రోజుల కింది వరకు క్యారెక్టర్ ఎక్కడ రన్ అయినా కానీ వారు పత్రికా భాషనే ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం అలా లేదు. మూవీ తెలంగాణ విలేజెస్ లో నడిస్తే తెలంగాణ మాండలికాన్ని అలా కాకుండా ఆంధ్ర విలేజెస్ లో నడిస్తే ఆంధ్ర మాండలికాన్ని మరియు సీమ గ్రామాల్లో సినిమా నడిస్తే సీమ మాండలికాన్ని మన హీరోలు […]

Share:

ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఏదో ఒక మాండలికంలో సినిమాలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ తెగ అట్రాక్ట్ అవుతున్నారు. కొన్ని రోజుల కింది వరకు క్యారెక్టర్ ఎక్కడ రన్ అయినా కానీ వారు పత్రికా భాషనే ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం అలా లేదు. మూవీ తెలంగాణ విలేజెస్ లో నడిస్తే తెలంగాణ మాండలికాన్ని అలా కాకుండా ఆంధ్ర విలేజెస్ లో నడిస్తే ఆంధ్ర మాండలికాన్ని మరియు సీమ గ్రామాల్లో సినిమా నడిస్తే సీమ మాండలికాన్ని మన హీరోలు వాడుతున్నారు. ఆయా మాండలికాలను నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ట్రైనర్లను కూడా నియమించుకుంటున్నారు. దీంతో వారు మాట్లాడే మాండలికం స్టైల్ ను చూసి ఆ హీరో అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఖుష్ అవుతున్నారు. 

కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల దాక

ఏదో కుర్ర హీరోలు ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నారంటే లైట్ తీసుకోవచ్చు. కానీ కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల దాక ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ హిట్లు కొడుతున్నారు. దీంతో మూవీని చూసే ఆడియన్స్ కూడా థ్రిల్ ఫీలవుతున్నారు. ఏదో కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ నడుస్తుంటే అక్కడ వచ్చే క్యారెక్టర్లు అక్కడి మాండలికాన్ని కాకుండా వేరే మాండలికం మాట్లాడితే ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యే చాన్స్ లేదని గ్రహించిన మన దర్శక నిర్మాతలు అక్కడి లోకల్ మాండలికాన్నే నటీనటుల చేత పలికిస్తున్నారు. కొంత మంది హీరోలైతే ఆ మాండలికం సరిగ్గా పలకడం రాకపోతే అక్కడ మాండలికంలో ట్రైనర్లు పెట్టుకుని మరీ నేర్చుకుంటున్నారు. తమ మూవీని చూసే అభిమానులకు థ్రిల్ అందిస్తున్నారు. 

స్కంధ కూడా తెలంగాణ యాసలోనే 

యంగ్ హీరో పోతినేని రామ్ నటించిన రీసెంట్ మూవీ స్కంధ. ఈ మూవీ కోసం రామ్ ప్రత్యేకించి తెలంగాణ మాండలికాన్ని నేర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే రామ్ క్యారెక్టర్ తెలంగాణ యాసలోనే మాట్లాడుతుందని తెలుస్తుంది. దీని కోసమే అతడు తెలంగాణ మాండలికాన్ని ప్రత్యేకించి నేర్చుకున్నాడట. కేవలం ఈ మూవీలో అని మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా మూవీల్లో ఈ లోకల్ లాంగ్వేజ్ ఫ్లేవర్ ను ఉపయోగించారు. ఈ ట్రిక్ ఉపయోగించి డైరెక్టర్లు హిట్లు కూడా కొట్టారు. 

అవును తెలంగాణ యాసలోనే మాట్లాడతా

రామ్ హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా కలిసి నటిస్తున్న రీసెంట్ మూవీ స్కంధ. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మధ్యే చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. తెలంగాణ మాండలికం కోసం రామ్ తో తాను పోటీపడుతున్నానని పేర్కొన్నాడు. తదుపరి చిత్రం “భగవంత్ కేసరి”లో స్వచ్ఛమైన తెలంగాణ యాసలో తన క్యారెక్టర్ మాట్లాడుతుందని తెలిపాడు. రామ్ హీరోగా వచ్చిన పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ మూవీలో కూడా తెలంగాణ యాసే. కాబట్టి రామ్ కు ఈ యాస మీద కొంత గ్రిప్ ఉంది. అయితే బాలకృష్ణ మాత్రం ఈ యాసను  ఫుల్ రోల్ కోసం ఉపయోగించడం ఇదే మొదటి సారి. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్ 2’లో కూడా ఇదే తరహా భాష ఉండనుందని సమాచారం. ఇక ‘భగవంత్ కేసరి’ టీజర్‌లో బాలకృష్ణ పలికిన ‘శానా ఏండ్లు యాదుంటది’ డైలాగ్ ఒక రేంజ్ లో పేలింది. టీజర్ లో ఉన్న ఈ ఒక్క డైలాగ్ కాకుండా బాలకృష్ణ పలికిన మొత్తం డైలాగ్స్ కూడా తెలంగాణ యాసలోనే ఉండడం విశేషం. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే 25+ మిలియన్స్ రియల్ టైమ్ వ్యూస్ తో యూ ట్యూబ్ దుమ్ముదులిపింది. 

అదే ట్రై చేస్తున్నాడా.. ?

నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఆంధ్రప్రదేశ్ లో మాంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఈ నటుడు ఇప్పుడు తెలంగాణ ఫ్యాన్స్ ను ఎక్కువగా ఖుషీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ పీరియాడికల్ మూవీ రుద్రంగి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన బాలయ్య అక్కడ కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడాడు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరో విశ్వక్ సేన్ మూవీ ఫంక్షన్ కోసం వచ్చిన ఈ హీరో విశ్వక్ సేన్ మాట్లాడినట్లు తెలంగాణ యాసలో మాట్లాడేందుకు ట్రై చేశాడు. తన తదుపరి మూవీ తెలంగాణ యాసలో ఉంటుందని ఇలా చేస్తున్నాడో లేక తెలంగాణ ప్రాంత ఆడియన్స్ ను మెప్పించేందుకు ఇలా చేస్తున్నాడో విషయం ఏమై ఉంటుందో అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.