శ్రీలీలతో సినిమా చేస్తానంటున్న మోక్ష‌జ్ఞ‌

శ్రీలీల పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఆమెకు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల జరిగిన భగవంత్ కేసరి ఈవెంట్ లో మాట్లాడిన బాలకృష్ణ, శ్రీలీల గురించి, మోక్ష‌జ్ఞ‌ గురించి మాట్లాడటం జరిగింది.  శ్రీలీలతో సినిమా తీయనున్న మోక్ష‌జ్ఞ‌!:  బాలకృష్ణ […]

Share:

శ్రీలీల పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఆమెకు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల జరిగిన భగవంత్ కేసరి ఈవెంట్ లో మాట్లాడిన బాలకృష్ణ, శ్రీలీల గురించి, మోక్ష‌జ్ఞ‌ గురించి మాట్లాడటం జరిగింది. 

శ్రీలీలతో సినిమా తీయనున్న మోక్ష‌జ్ఞ‌!: 

బాలకృష్ణ మాట తీరు ఎప్పుడూ చమత్కారంగా అనిపిస్తుంది. ఇటీవల శ్రీలీల, మోక్షజ్ఞ గురించి ఒక ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడటం జరిగింది. బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరిలో, బాలకృష్ణ కూతురిగా శ్రీలీలా నటించిందని, సినిమా జరుగుతున్న సమయం అంతా కూడా తనని చిచ్చా, చిచ్చా అంటూ శ్రీలీలా పిలిచిందని మరొకసారి గుర్తు చేశాడు బాలకృష్ణ. అయితే తప్పకుండా తన రాబోయే తరువాత చిత్రంలో తప్పకుండా తన పక్కన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుందని వెల్లడించాడు. అయితే ఈ విషయం గురించి తన ఇంట్లో మోక్షజ్ఞ అలాగే తన భార్యతో మాట్లాడినప్పుడు, మోక్షాజ్ఞ తన నిర్ణయాన్ని సమర్థించకపోగా, తనే స్వయంగా శ్రీలీలతో సినిమా తీయాలి అనుకుంటున్నట్లు చెప్పాడని, మోక్షజ్ఞ, శ్రీలీల ఒకే వయసువారు కాబట్టి తమ జంట చాలా బాగుంటుందని, మోక్షజ్ఞ చెప్పినట్లు బాలకృష్ణ వెల్లడించాడు. 

ఇంతకుముందు, ‘భోలా శంకర్’లో తోబుట్టువుల పాత్రలో నటించిన చిరంజీవి, కీర్తి సురేష్, తర్వాత తదుపరి చిత్రంలో ఆమె ప్రేమికురాలిగా నటించాలనుకుంటున్నట్లు చిరంజీవి ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో 60-ప్లస్ స్టార్లు తమ సినిమాల చుట్టూ హైప్‌ని ప్రేరేపించడానికి, వారి అభిమానులు మరియు సోషల్ మీడియా నుండి దృష్టిని ఆకర్షించేవంటి ప్రకటనలు చేస్తున్నారు, అయినప్పటికీ కొన్ని ట్రోల్స్ కూడా నడుస్తూనే ఉన్నాయి. 

భగవంత్ కేసరిలో ప్రత్యేక ఆకర్షణ శ్రీలీల:

ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గడియారంతో పోటీపడుతూ షూటింగ్స్ లో బిజీగా ఉంది అని చెప్పుకోవాలి. తెలుగు మాట్లాడే అమ్మాయి కావడం కూడా ఆమె కెరీర్‌కు కొంత ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మరియు ఇతరుల కంటే ఎక్కువ సినిమాలు, యంగ్ స్టార్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. ఆమె పవన్ కళ్యాణ్‌తో మరో మెగా బక్స్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా చేస్తోంది. వచ్చిన కొద్ది కాలంలోనే తన నటనతో, అందంతో, అభినయంతో పెద్ద పెద్ద హీరోల పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసింది శ్రీలీల. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే భారీ అంచనాల మధ్యలో వస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఛాన్స్ కొట్టేసింది హీరోయిన్ శ్రీలీల.

శ్రీలీల, వైష్ణవ్ తేజ్‌తో ‘అధికేశవ’ నవంబర్ 20న, ఆ తర్వాత నితిన్‌తో చేసిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అన్నింటికీ మించి వచ్చే జనవరిలో రాబోతున్న మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ అనే పెద్ద ప్రాజెక్ట్, శ్రీలీల చేతిలో ఉంది. ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత శ్రీలీల జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. దర్శకనిర్మాతలు ఆఫర్‌లతో ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. యువ సంచలనం శ్రీలీల ఖచ్చితంగా టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె సినిమాలు, రాబోయే ఐదు నెలలలో వరుసగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 15న విడుదల అయిన రామ్ పోతినేని-బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘స్కంద’లో శ్రీలీల కనిపించి అందర్నీ ఆకర్షించింది. ఆమె నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’లో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.