వివాదానికి దారి తీసిన మలయాళ నటుడి వ్యాఖ్య‌లు

53వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం తిరువనంతపురంలోని నిశాగంధి ఆడిటోరియంలో గురువారం, సెప్టెంబర్ 14న జరిగింది. 2022లో ఉత్తమ మలయాళ చిత్రాలకు అవార్డులు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో నటుడు అలెన్సియర్ లే లోపెజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వాక్యాలు ప్రస్తుతం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. ఆయన ఏమని మాట్లాడారు:  ఇటీవల కేరళలో జరిగిన రాష్ట్ర చలనచిత్ర అవార్డు అవార్డుల ప్రధానోత్సవంలో, నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ […]

Share:

53వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం తిరువనంతపురంలోని నిశాగంధి ఆడిటోరియంలో గురువారం, సెప్టెంబర్ 14న జరిగింది. 2022లో ఉత్తమ మలయాళ చిత్రాలకు అవార్డులు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో నటుడు అలెన్సియర్ లే లోపెజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వాక్యాలు ప్రస్తుతం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది.

ఆయన ఏమని మాట్లాడారు: 

ఇటీవల కేరళలో జరిగిన రాష్ట్ర చలనచిత్ర అవార్డు అవార్డుల ప్రధానోత్సవంలో, నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేడిని పుట్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆయన చేసిన వాక్యాలకు స్పందిస్తూ చాలామంది నేటిజన్లు కామెంట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక నటుడు అయ్యుండి ఇలాంటి వాక్యాలు ఎలా చేయగలిగాడని కామెంట్లు పెడుతున్నారు. ఆడవారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, ఆడవారిని కించపరిచేలా.. మాట్లాడినందుకు ఆ నటుడు అవార్డుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సన్నీ వేన్ మరియు అనన్య నటించిన అప్పన్‌లో ఇట్టిచాన్ పాత్రలో తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డుతో నటుడుని సత్కరించడం జరిగింది, ట్రోఫీని అందుకున్న తర్వాత తన ప్రసంగంలో మాట్లాడుతూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు నటుడు.

అలెన్సియర్ లే లోపెజ్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా మాట్లాడిన వాక్యాలు, అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పుకోవాలి. అలెన్సియర్ తన ప్రసంగంలో, తీసుకున్న అవార్డుకు సంబంధించి మాట్లాడుతూ, తమకు ఆడవారి ప్రతిమను అందిస్తూ టెంప్ట్ చెయ్యొద్దు అంటూ, అంతేకాకుండా మగవారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మగవారి ప్రతిమను అందిస్తే బాగుంటుందని మాట్లాడటం జరిగింది. అయితే ప్రస్తుతం జూరీ అవార్డుని అందుకున్న నటుడు.. ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు, అంతే కాకుండా ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుండి గౌరవనీయమైన బహుమతిని అందుకున్నారు.

అలెన్సియర్ లే లోపెజ్ మగవారి ప్రతిమ లో ఉన్న అవార్డును అందుకున్న ఏ రోజున తన పూర్తిగా నటనను ఆపేస్తానని కూడా వెల్లడించాడు.  అలెన్సియర్ ప్రసంగం సందర్భంగా ఇలాంటి వాక్యాల చేసినప్పటి నుండి ఇంటర్నెట్ దద్దరిల్లుతోంది.  ‘అలెన్సియర్ (ఆడవారి విగ్రహం అవార్డుగా ఇవ్వడం పై) చేసిన ఈ అవమానకరమైన మరియు అభ్యంతరకరమైన ప్రసంగం తర్వాత, అతని పనితీరు నాణ్యతతో సంబంధం లేకుండా ప్రభుత్వం/జ్యూరీ అతనికి ఇచ్చిన ఈ అవార్డును వెనక్కి తీసుకోవాలి అంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఇదివరకు సంఘటనలకు అతను పశ్చాత్తాప పడట్లేదు అంటూ, దానికి నిదర్శనమే ఈరోజు జరిగిన ప్రసంగమని.. చాలామంది కామెంట్లు పెడుతున్నారు

ఈ వివాదంపై అలెన్సియర్ లే లోపెజ్ స్పందించారు:

అతని అభ్యంతరకరమైన ప్రసంగం తర్వాత, చాలా మంది నటుడి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు, అయితే అలెన్సియర్ అతను చెప్పినదానికి క్షమాపణ చెప్పనని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. తాను మహిళలపై ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని కూడా అతను పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్య తాను అప్పటికప్పుడు చేసిన వ్యాఖ్య కాదని, దానికి బదులు చెప్పేందుకు సిద్ధమని అలెన్సియర్ అభిప్రాయపడ్డారు. క్షమాపణలు చెప్పకపోవడానికి అలెన్సియర్ చెప్పిన కారణం కూడా చాలా విమర్శలకు దారితీస్తోందని చెప్పుకోవాలి.

ఇదే మొదటిసారి కాదు:

అలెన్సియర్ ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన కేరళ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్‌లో, లూసిఫర్ నటుడు తన ప్రసంగం చేస్తున్నప్పుడు మోహన్‌లాల్‌ను కాల్చి చంపుతారని వాక్యాలు చేసినందుకు… నటుడు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేయబడ్డాడు. మొహలాల్ ప్రసంగం సమయంలో, అలెన్సియర్ తన చేతులతో నటుడిపై తుపాకీ గురిపెట్టినట్లు సైగ చేయడం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.