Baby Combination: మళ్లీ జోడిగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

బేబి కాంబినేషన్ (Baby Combination) మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)  మరోసారి కలిసి నటించనున్నారు. ఆ వివరాలు ఇవే. ఈ సంవత్సరం జులై నెలలో వచ్చిన ‘బేబి’ (Baby Movie) ఎంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను ‘బేబి’ సాధించింది. భారీ వసూళ్లతో పాటు గట్టి ఇంపాక్ట్ కూడా చూపించింది. ఓటీటీ రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు ‘బేబి’ కాంబినేషన్ […]

Share:

బేబి కాంబినేషన్ (Baby Combination) మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)  మరోసారి కలిసి నటించనున్నారు. ఆ వివరాలు ఇవే.

ఈ సంవత్సరం జులై నెలలో వచ్చిన ‘బేబి’ (Baby Movie) ఎంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను ‘బేబి’ సాధించింది. భారీ వసూళ్లతో పాటు గట్టి ఇంపాక్ట్ కూడా చూపించింది. ఓటీటీ రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు ‘బేబి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరో హీరోయిన్లుగా ‘బేబి’ నిర్మాత ఎస్‌కేన్, దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. కొత్త దర్శకుడు రవి నంబూరి(Ravi Namburi) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అలాగే, అమృత ప్రొడక్షన్స్(Amrita Productions) కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది.

2024 సమ్మర్ రేసులో…

వైష్ణవీ చైతన్య నటించే ఈ కొత్త ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకొంటున్నది. 2024 సమ్మర్‌ సీజన్‌లో ఈ సినిమా విడుదల కానున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. ‘బేబి’ సినిమా(Baby Movie)కు బ్లాక్‌ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్‌నే ఈ సినిమాకు కూడా స్వరాలు సమకూర్చనున్నారు.  అయితే, ఈ చిత్రానికి ఇంకా టైటిల్(Title) ఖరారు చేయలేదు. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

అయితే తాజాగా ఈ నయా సినిమాకు సంబంధించి ఓ ఫస్ట్ లుక్(First Look) పోస్టర్‌ను కూడా వెల్లడించింది. కన్నీరు పెట్టుకుంటున్న వైష్ణవి చైతన్యను ఆనంద్ దేవరకొండ ఓదారుస్తున్నట్టు పోస్టర్లో కనిపిస్తోంది. ఇది కూడా ఎమోషనల్ లవ్ స్టోరీ(Emotional Love Story)గా ఉండే అవకాశం ఉంది.

మరో వైపు, ఇటీవలే నిర్మాత ఎస్‌కేన్ తాను నిర్మించబోయే తర్వాతి చిత్రాల అప్‌డేట్స్ కూడా అందించారు. తన సొంత నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ పై ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నలుగురు దర్శకులతో కలిసి దిగిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. 

తను ఎంతగానో నమ్మిన స్నేహితులతో సినిమా జర్నీ అందంగా ఉంటుందని రాసుకొచ్చారు. వీళ్లతోనే తన తదుపరి నాలుగు సినిమాలు రూపొందించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఎస్‌కేన్ షేర్ చేసిన ఫోటోలో డైరెక్టర్ సాయి రాజేష్ తో పాటు ‘కలర్ ఫోటో’ మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్, సుమన్ పాతూరి, రవి నంబూరి ఉన్నారు. వీరిలో రవి నంబూరితో సినిమాను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు.

వీరిలో ‘కలర్ ఫోటో’ సినిమాతో సందీప్ రాజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసారో తెలిసిందే. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత రీసెంట్‌​గా సాయి రాజేష్ ‘బేబి’తో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ డెలివరీ చేశాడు. మరోసారి ఈ ఇద్దరు దర్శకులతో ఎస్‌కేఎన్ ఎలాంటి సినిమాలు తీయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

యువ దర్శకులను ప్రోత్సహిస్తూ వాళ్ల నుంచి కంటెంట్ ఉన్న కథలు, మంచి అవుట్ ఫుట్ ని ప్రేక్షకులకు అందించడంలో ఎస్‌కేఎన్ 100 శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరోవైపు ఎస్‌కేఎన్‌కి గీతా ఆర్ట్స్ సంస్థ ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, యువ నిర్మాత బన్నీ వాస్… ఎస్‌కేఎన్ నిర్మించబోయే సినిమాలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటారు. గతంలో ఎస్‌కేఎన్ నిర్మాతగా మారి ‘టాక్సీవాలా’ సినిమా నిర్మించడం వెనక అల్లు అరవింద్, బన్నీ వాస్  ప్రోత్సాహం కూడా ఉంది.