టాలీవుడ్ లో సెగలు పుట్టిస్తున్న బాలీవుడ్ భామలు

బాలీవుడ్ భామలు ప్రస్తుతం టాలీవుడ్ లో సెగలు పుట్టించేందుకు సిద్ధమవతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడాలు ఉండేవి కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీస్ వచ్చాయో ఈ తేడాలు కూడా అప్పుడే కనుమరుగయ్యాయి. హీరోయిన్లయినా కానీ హీరోలైనా కానీ అనేక ఇండస్ట్రీల్లో సత్తా చాటుతూ ముందుకు వెళ్తున్నారు. ఇదే తోవలో కొంత మంది బాలీవుడ్ బ్యూటీలు మన టాలీవుడ్ ను టార్గెట్ చేశారు. మరి మనోళ్లు కూడా ఏం తక్కువ తినడం లేదు. ఇక్కడ హీరోయిన్లుగా […]

Share:

బాలీవుడ్ భామలు ప్రస్తుతం టాలీవుడ్ లో సెగలు పుట్టించేందుకు సిద్ధమవతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడాలు ఉండేవి కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీస్ వచ్చాయో ఈ తేడాలు కూడా అప్పుడే కనుమరుగయ్యాయి. హీరోయిన్లయినా కానీ హీరోలైనా కానీ అనేక ఇండస్ట్రీల్లో సత్తా చాటుతూ ముందుకు వెళ్తున్నారు. ఇదే తోవలో కొంత మంది బాలీవుడ్ బ్యూటీలు మన టాలీవుడ్ ను టార్గెట్ చేశారు. మరి మనోళ్లు కూడా ఏం తక్కువ తినడం లేదు. ఇక్కడ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన బ్యూటీలు బాలీవుడ్ లో చక్రం తిప్పేందుకు వెళ్తున్నారు. 

పాన్ ఇండియానే కారణమా… 

ఒకప్పుడు మూవీ అంటే ఏదో ఒక ఇండస్ట్రీకి చెందినదై ఉండేది. కానీ ప్రస్తుతం రోజులు మారిపోయాయి. బౌండరీలు చెరిగిపోవడంతో ఫిలిం మేకర్స్ పాన్ ఇండియా సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. అందుకోసమే ఒక్క ఇండస్ట్రీ వారినని కాకుండా అనేక ఇండస్ట్రీల వాళ్లని తీసుకుంటూ ఉన్నారు. ఒక్క ఇండస్ట్రీ వారిని మాత్రమే తీసుకుంటే మిగతా ఇండస్ర్టీలలో మూవీకి బజ్ రాదని భావిస్తూ ఇలా చేస్తున్నారని అనేక మంది కామెంట్ చేస్తున్నారు. రీజన్ ఏదైనా కానీ పాన్ ఇండియా రేంజ్ వల్ల మూవీలు ఇండస్ట్రీలు అనే తేడా లేకుండా సినిమా సైన్యం మొత్తం కదులుతోంది. 

ట్రెండింగ్ లో ఉన్న భామలు వీరే.. 

చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో సినిమాలు చేస్తున్నా కానీ వారందరికీ రాని క్రేజ్ కొంత మంది హీరోయిన్లు సొంతం చేసుకున్నారు. వారు ఎవరనేది ఓ లుక్కేస్తే… 

జాన్వీ కపూర్

అందాల తార శ్రీ దేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బీ టౌన్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం కొరటాల శివ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. దేవర మూవీ కూడా పాన్ ఇండియా సినిమానే కావడంతో మేకర్స్ ఈ అమ్మడు వైపు మొగ్గు చూపినట్లు పలువురు కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా అందాల తార శ్రీ దేవికి కూడా తెలుగులో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ మూవీలో జాన్వీని యాక్ట్ చేయించడం వల్ల వారంతా కూడా ఈ మూవీ లవర్స్ గా మారుతారని కూడా మేకర్స్ అంచనా వేసినట్లు పలువురు చెప్పుకుంటున్నారు.

అందాల దీపిక

ఇక తన అందం, అభినయంతో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపుతున్న దీపికా పదుకునే ప్రస్తుతం కల్కి మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా నాగ్ అశ్విన్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఫస్ట్ లుక్ ఒక రేంజ్ లో ఉంది. దీంతో ఈ మూవీ హిట్ కావడం పక్కా అని అంతా అనుకుంటున్నారు. 

కియారా

బాలీవుడ్ ను ఏలుతున్న కియారాకు తెలుగు సినిమాలు కొత్తేం కాదు. మహేశ్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను మూవీలో ఈ అమ్మడు వసుమతిగా నటించి కుర్రకారును ఫిదా చేసింది. ఆ తర్వాత వినయ విదేయ రామ లో చరణ్ కు జోడీగా నటించింది. కానీ ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కియారా ప్రస్తుతం చరణ్ తోనే గేమ్ చేంజర్ మూవీ చేస్తోంది. 

మరోమారు అలరించనున్న ‘సీత’

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న మృణాల్ ఠాకూర్ కూడా హాయ్ నాన్నా అనే పాన్ ఇండియా మూవీతో మరో మారు తెలుగులో సందడి చేయనుంది.