Ileana D'Cruz: నేను సింగిల్‌ పేరెంట్ కాదు.. ఇలియానా పోస్ట్‌ వైరల్‌

తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఇలియానా

Courtesy: Twitter

Share:

Ileana DCruz: ప్రముఖ నటి ఇలియానా (Ileana DCruz) ఇటీవలే తల్లైన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు కోవా ఫీనిక్స్‌ డోలన్‌ (Koa Pheonix Dolan) అని పేరు పెట్టి అభిమానులకు పరిచయం చేసింది. అయితే బాబు తండ్రి ఎవరు అన్న విషయం మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది. తాజాగా ఆ సస్పెన్స్‌కు ఈ గోవా బ్యూటీ తెరదించింది. తన లైఫ్‌ పార్ట్నర్‌ (Partner) ఎవరో ఎట్టకేలకు అభిమానులకు పరిచయం చేసేసింది. 

గోవా బ్యూటీ ఇలియానా(Ileana D'Cruz) తల్లై రెండు నెలలు పూర్తయింది. తరచూ తన బిడ్డకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా  ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’(Ask Me Anything) సెషన్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘మీరు మీ బిడ్డను ఒంటరిగా ఎలా పెంచుతున్నారు..?’ అంటూ ప్రశ్నించారు. దీనికి నటి స్పందిస్తూ.. ‘నేను సింగిల్‌ పేరెంట్‌ కాదు’ (not a single parent) అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన పార్ట్నర్‌ ఫొటోను షేర్‌ చేసింది. గతంలో ఇలియానా ‘డేట్‌ నైట్‌’(Date Night) అంటూ లవ్‌ సింబల్‌ను జత చేసి ఓ వ్యక్తితో ఉన్న ఫొటోను ఇన్‌స్టావేదికగా షేర్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఫొటోలో ఉన్న వ్యక్తే తన పార్ట్నర్‌ అని తాజాగా స్పష్టతనిచ్చింది. దీంతో ఇలియానా(Ileana DCruz) బిడ్డకు తండ్రి ఎవరన్న ప్రశ్నకు.. సమాధానం దొరికినట్లైంది.

ఇలియానా తాను ప్రెగ్నెంట్‌(Pragnent) అంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్‌ మీడియా(Social Media) ద్వారా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ మేరకు బేబీ బంప్‌ (Baby bump) ఫొటోలను కూడా పంచుకుంది. అయితే, తన పార్ట్నర్‌ ఎవరో మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాయ్‍ఫ్రెండ్‍తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. తాను కష్టంలో ఉన్న సమయంలో అతడు తోడుగా నిలిచాడని సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది. అయితే, బాయ్‌ ఫ్రెండ్‌ పేరు మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. మిచల్‌ డోలన్‌ (Michael Dolan) అనే వ్యక్తిని ఇలియానా పెళ్లి చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా తన పార్ట్నర్‌ ఫొటో షేర్‌ చేసిందే తప్ప.. పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియా(Social Media) వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది. త్వరలోనే మళ్లీ తెరపై సందడి చేస్తానని చెప్పింది. గత ఏడాది ఇదే రోజుల్లో నేను గర్భం దాల్చాను. తల్లి కాబోతున్నానని తెలిసిన ఆ క్షణాలు భావోద్వేగంతో కూడుకున్నవి. నా బేబీ కోవా ఫీనిక్స్‌ డోలన్‌ను(Koa Pheonix Dolan) హత్తుకున్నప్పుడు..అ అనుభూతి నాకు తెలుస్తుంది. కానీ దానిని మాటల్లో వర్ణించలేను. ప్రెగ్నెంట్‌ అయిన నాటి నుంచి డెలీవరి అయ్యేవరకూ అమ్మ నా పక్కనే ఉన్నారు. అందుకు నేను ఎంతో సంతోషంగా ఫీలయ్యా. తొలిసారి బాబుని చూసిన క్షణాలు ఎంతో అపురూపమైనవి’’ అని చెప్పారు. మీ బిడ్డ విషయంలో కాకుండా మరే విషయంలో మీరు సంతోషంగా ఉన్నారు అని అడగగా ఇలియానా బేబీ డాడీ విషయంలో’ అని తెలిపింది.

దేవదాస్‌(Devadas) సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ.. 2018లో వచ్చిన రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ (Amar Akbar Antony)చివరిసారిగా తెలుగుతెరపై కనిపింది. ఇక బాలీవుడ్‌లో2021లో అభిషేక్‌ బచ్చన్‌ నటించిన బిగ్‌బుల్‌లో కనిపించింది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆశ్వాదిస్తోంది.