అకీరా నందన్ అరంగేట్రం.. స్పందించిన రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు, చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా ఇప్పుడు తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నారు. ప్రస్తుతం అతను జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాలలో కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నారు. ఆయన కొడుకు  అకీరా నందన్ గురించి కూడా  అందరికి తెలిసిందే, టాలీవుడ్ దర్శకులు కె. రాఘవేంద్ర రావు గారు కొన్ని రోజుల క్రితం నార్వే వెళ్లారు అక్కడ నుంచి […]

Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు, చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా ఇప్పుడు తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నారు. ప్రస్తుతం అతను జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాలలో కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నారు. ఆయన కొడుకు  అకీరా నందన్ గురించి కూడా  అందరికి తెలిసిందే, టాలీవుడ్ దర్శకులు కె. రాఘవేంద్ర రావు గారు కొన్ని రోజుల క్రితం నార్వే వెళ్లారు అక్కడ నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోలో దర్శక ధీరుడు (K. రాఘవేంద్ర రావు గారు), అతని మనవడు అయిన కార్తికేయ మరియు అకిరా నందన్ ఉన్నారు. ఆ పోస్ట్ లో అకిరా స్టన్నింగ్ లుక్స్ మరియు ఒక హీరో కి ఉండాల్సిన కటౌట్ తో కనిపించారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తాన్ని ఒక్క ఊపు ఊపేస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. అతని కొడుకు అయిన అకీరానే  నెక్స్ట్ జనరేషన్ కి స్టార్ హీరో అని అభిమానులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. తరుచుగా టాలీవుడ్ లో స్టార్ హీరోలకి అభిమానులు వారి గుండెల్లో  గుడి కట్టేసుకుంటారు, వారి పిల్లలే తరువాతి హీరోలు అని అంచనాలు భారీగా పెంచుకుంటారు. మరి అకీరా సినిమాల్లో ఇప్పటి వరుకు కనీసం ఒక్క గెస్ట్ రోల్ కూడా చెయ్యలేదు. తను ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో అని అందరు ఎదురు చూస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ట్రెండ్ అయిన ఆ ఫోటో ఫ్యాన్స్ కి మరింత ఆత్రుతని పెంచింది అనడంలో అతిశయోక్తి లేదు. 

ఇప్పట్లో నటించే ఆలోచన లేదు

ఇదంతా ఇలా ఉండగా  అకీరా కి తల్లి అయిన రేణు దేశాయ్ గారికి ఇంస్టాగ్రామ్ లో ఎన్నో రోజుల నుంచి కొన్ని కామెంట్స్ కామన్ గా వస్తున్నాయట. ఆ కామెంట్స్ అన్నిటికి కలిపి ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. “మీ అందరికి ఒక విషయం చెప్పాలి, మా అబ్బాయి అయిన  అకీరా నందన్ కి ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు, మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నారన్న విషయం మాకు తెలుసు కానీ ప్రస్తుతం అది జరగని పని, మరి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవ్వరు ఊహించలేము కదా! ఒక వేళ తను సినిమాల్లోకీ రావాలి అనుకుంటే మొట్ట మొదట సంతోషించే వ్యక్తిని నేనె, ఆ సంతోషాన్ని అందరితో కన్నా ముందు షేర్ చేసుకునేది మీతోనే. దయచేసి ఇక తను ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసిన మూవీస్ లోకి ఎంట్రీ ఎప్పుడు? అని ప్రశ్నలు అడగడం మానెయ్యండి.” అని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ ఒక్క పోస్ట్ అకిరాని వెండితెర మీద చూడాలి అనుకున్న పవర్ స్టార్ అభిమానులందరికి ఎంతో నిరాశనిచ్చింది. 

“సెలబ్రిటీస్ వారి పిల్లలని ఎప్పుడు సినిమాల్లోకి వెళ్లొద్దు అని విమర్శించరు, వారి పిల్లలకి కూడా ఆ ఫీల్డ్ ఎలా ఉంటాదో పూర్తిగా తెలుసు. కానీ వాళ్ళకే సినిమాల్లో నటించాలి అనే ఇంటరెస్ట్ లేకపోతె వారి తల్లిదండ్రులు మాత్రం ఏమి చెయ్యగలరు. కానీ నటన అనేది వాళ్ళ రక్తంలోనే ఉంటుంది, చివరికి వాళ్ళు సినిమాల్లోకి రావలసిందే.” అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని చెబుతున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కు ఇప్పుడు సినిమాలలోకి వచ్చే ఆలోచన లేకపోయినా కూడా ఆసక్తి ఉంటే భవిష్యత్తులో మరో పవర్ స్టార్ అవుతారు అని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు.