టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు నిద్ర లేకుండా చేస్తున్న OTT దిగ్గజాలు

టాలీవుడ్ సినిమాల డిజిటల్ రైట్స్ రేట్లను తగ్గించాలని అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి సినిమా ప్రొడ్యూసర్లు చాలా ఆందోళన చెందుతున్నారు. సినిమాల రేట్లు తగ్గించనున్న ఓటీటీ సంస్థలు..!: అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థలు టాలీవుడ్ వల్ల సంవత్సరానికి ₹250 నుంచి 300 కోట్లు సంపాదిస్తున్నాయి. కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు సినిమా డిజిటల్ రైట్స్ రేట్లు కాస్త తగ్గించాలని  చూస్తున్నారు దానికి కారణం ఈ మధ్య వాళ్లు తీసుకున్న […]

Share:

టాలీవుడ్ సినిమాల డిజిటల్ రైట్స్ రేట్లను తగ్గించాలని అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి సినిమా ప్రొడ్యూసర్లు చాలా ఆందోళన చెందుతున్నారు.

సినిమాల రేట్లు తగ్గించనున్న ఓటీటీ సంస్థలు..!:

అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థలు టాలీవుడ్ వల్ల సంవత్సరానికి ₹250 నుంచి 300 కోట్లు సంపాదిస్తున్నాయి. కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు సినిమా డిజిటల్ రైట్స్ రేట్లు కాస్త తగ్గించాలని  చూస్తున్నారు దానికి కారణం ఈ మధ్య వాళ్లు తీసుకున్న కొన్ని సినిమాలు వాళ్లకు భారీ లాస్ లను తీసుకొచ్చాయి. అందుకే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓటీటీల వల్ల భారీ సినిమాల మీద కాస్త భారం తగ్గుతుంది. సినిమాకు ఎంత ఖర్చైనా డిజిటల్ రైట్స్ రూపంలో సినిమా రిలీజ్ అవ్వకముందే ఎంతో కొంత డబ్బులు తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయంతో చాలామంది ప్రొడ్యూసర్లు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కారణంగానే భారీ లాస్ ల నుండి బయట పడుతున్నారు. ఇప్పుడు ఓటీటీ సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. అభిషేక్ నామ అనే నిర్మాత ఈ విషయం గురించి స్పందిస్తూ ఓటీటీ సంస్థలు ఈ నిర్ణయం పై తిరిగి ఆలోచిస్తే బాగుంటుంది అని అన్నాడు.

కేవలం రెండు సినిమాల వల్లే ఇలా జరిగిందని ఒక టాప్ డైరెక్టర్ అన్నాడు. ముందుగా ఆ సినిమాలు బాగా ఆడతాయని పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేశారు. డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్మారు తర్వాత వాటికి ఆశించినంత డబ్బు రాలేదు అందుకే ఇలా అయింది. ప్రతి సినిమా పుష్ప, త్రిబుల్ ఆర్ లాగా ఆడవు కదా అని అన్నారు. ఒక సినిమాకు అయితే మరీ ఘోరంగా 30 కోట్లు పెట్టి అమ్మితే ఆరు కోట్లు కూడా రికవరీ అవ్వలేదు అందుకే ఓటీటీ వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

కొన్ని టాప్ ఫిలిమ్స్ కి కూడా ఆశించినంత రేటింగ్ రావట్లేదని తను అన్నాడు.

తెలుగు సినిమా పరిస్థితి ఏంటి?:

ఒకప్పుడు మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు. చాలావరకు రొటీన్ సినిమాలే వస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే మరీ దారుణంగా స్టోరీ కూడా సరిగ్గా లేకుండా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలను యూత్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కంటెంట్ అనేది మిస్ అవుతుంది. సినిమాలో కంటెంట్ లేకుండా అలా పడితే అలా సినిమా తీయడం వల్ల మన తెలుగు సినిమా మార్కెట్ పడిపోతుంది. మార్కెట్ పడిపోతే ఆటోమేటిక్గా డిజిటల్ వ్యూవర్షిప్ తగ్గుతుంది. అందుకే చాలావరకు భారీ ధరకు అమ్ముడైన సినిమాలకు కూడా వ్యూవర్స్ ఉండట్లేదు. మన తెలుగు సినిమాలలో కంటెంట్ మారితే ఆటోమెటిగ్గా డిజిటల్ రైట్స్ రేట్లు  కూడా పెరుగుతాయి. అప్పుడు ప్రొడ్యూసర్లకు లాస్ అనేది ఉండదు. ఇంకా కొత్తగా కంటెంట్ తో వచ్చే డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడం వల్ల సినిమాలో కొత్తదనం పెరుగుతుంది. సినిమా ఫ్రెష్ గా ఉంటే ఆటోమేటిగ్గా హిట్ అవుతుంది. ఇంకా దీనికి రివర్స్ కూడా భారీగా ఉంటారు. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్లు కొత్తదనాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. 

మన దర్శకులు నిర్మాతలు కొత్తదనం మీద ఫోకస్ చేసి మనకు మంచి కంటెంట్ ఇస్తారని ఆశిద్దాం. అలా చేస్తే మన డిజిటల్ రైట్స్ రేట్లు కూడా మళ్లీ పెరుగుతాయి. అప్పుడు ప్రొడ్యూసర్లకు ఏ బాధ ఉండదు. మనవాళ్లు దీని మీద ఫోకస్ పెట్టాలని కోరుకుందాం.