RC16కి ఏఆర్ రెహమాన్

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు  శంకర్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే…  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది..   ఈ నేపథ్యంలోనే చరణ్ నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెరిగింది..  రామ్ చరణ్ తన 16 వ సినిమాను  ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాను కమిట్ అయిన […]

Share:

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు  శంకర్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే…  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది..   ఈ నేపథ్యంలోనే చరణ్ నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెరిగింది..

 రామ్ చరణ్ తన 16 వ సినిమాను  ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా నవంబర్‌లో మొదలుకానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన బయో పిక్‌గా వస్తుందని ఓ రూమర్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. ఈ సినిమా అసలు ఎలాంటి బయో పిక్ కాదని, ఎవరి జీవితంతో కూడా సంబంధం లేదని.. పూర్తిగా ఓ కల్పిత కథ అని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. 

అయితే ఇందులో  ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతానికి  దర్శకత్వం వహించనుండగా.. ఇందులో నటించబోయే నటులు, టెక్నీషియన్స్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి . 

నిజానికి, యువ దర్శకుడు బుచ్చిబాబు ప్రముఖ తెలుగు మ్యూజిక్  డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో పెద్ద మ్యూజికల్ హిట్ చిత్రం ‘ఉప్పెన’ చేసారు . ఆ సినిమాలోని “నీ కళ్ళు నీలి సముద్రం’, ‘సంద్రం లోన నీరంతా’ మరియు ‘ధక్ ధక్ ధక్’ వంటి పాటలు ఈ ప్రేమకథలోని మూడ్ మరియు సిట్యుయేషన్‌లను సొగసైన రీతిలో చిత్రీకరించి మ్యూజికల్ చార్ట్‌లలో నిలిచాయి. బుచ్చిబాబు డిఎస్‌పికి మంచి స్నేహితుడు మరియు అతను టాలీవుడ్‌లోని అతిపెద్ద స్టార్‌లలో ఒకరైన రామ్ చరణ్‌తో తన రెండవ సినిమా కోసం DSP గురించి కూడా అలోచించి  చర్చలను ప్రారంభించాడు, కానీ విషయాలు కొంచెం మారాయి అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి 

తన కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్న రామ్ చరణ్, హిందీ మరియు తమిళంలో రోజురోజుకు పెరుగుతున్న అభిమానుల ఫాలోయింగ్‌తో, పాన్-ఇండియా అప్పీల్  కలిగి ఉన్న ఏఆర్ రెహమాన్ అయితే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. 

 రామ్ చరణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు  శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ సినిమా  నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌లో రామ్ చరణ్ స్టైలీష్‌గా ఉన్నారు. ఓ స్పోర్ట్స్ బైక్‌పై కూర్చోని ఉన్న రామ్ చరణ్ షేడ్స్ ధరించాడు. మొత్తానికి లుక్ సూపర్ స్టైలీష్‌గా ఉంది. టీమ్ హ్యాపీ బర్త్ డే చెబుతూ ఈపోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అది అలా ఉంటే RC15 వచ్చే సంవత్సరం సమ్మర్‌లో థియేట్రికల్ రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 21, 2024ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. .. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. 

టీమ్ ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తుందట. ఈ పాటకు దాదాపుగా 5 కోట్లపైగా ఖర్చు చేస్తున్నాట. అయితే ఈ పాట కోసం రామ్ చరణ్ చేసిన 80 సెకన్ల డాన్స్ సినిమాకు హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది. సింగిల్ టేక్‌లో రామ్ చరణ్ అదరగొట్టేశారనీ.. చరణ్ డాన్స్‌కు శంకర్ ఫిదా అయ్యారని, థియేటర్స్‌లో ఈ మూమెంట్ కన్నుల పండగగా ఉండనుందని తెలుస్తోంది.

అయితే RC16 చిత్రం విషయానికి కి వస్తే  చరణ్‌కు  జోడీగా జాన్వీ కపూర్ నటించనుందని, విలన్‌గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కనిపించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..