ప్రభాస్ ని చాలెంజ్ చేసిన అనుష్క

ప్రభాస్ మంచి ఫుడి అని మనకు తెలుసు. తనకి వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల వంటకాలు నచ్చుతాయి. తన సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు అందులో నటించే వాళ్లకు కూడా ప్రభాస్ స్పెషల్ గా టిఫిన్ బాక్స్ తెప్పించి వడ్డిస్తుంటాడు. ప్రభాస్ తన అఫెక్షన్ ఈ విధంగా చూపిస్తాడు. రీసెంట్గా ఫేవరెట్ డిష్ గురించి చెప్పమని అనుష్క చేసిన ఛాలెంజ్ కి ప్రభాస్ స్పందించి తన ఫేవరెట్ డిష్ ప్రాన్స్ (రొయ్యలు) పులావ్ అని తెలియజేశాడు. […]

Share:

ప్రభాస్ మంచి ఫుడి అని మనకు తెలుసు. తనకి వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల వంటకాలు నచ్చుతాయి. తన సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు అందులో నటించే వాళ్లకు కూడా ప్రభాస్ స్పెషల్ గా టిఫిన్ బాక్స్ తెప్పించి వడ్డిస్తుంటాడు. ప్రభాస్ తన అఫెక్షన్ ఈ విధంగా చూపిస్తాడు. రీసెంట్గా ఫేవరెట్ డిష్ గురించి చెప్పమని అనుష్క చేసిన ఛాలెంజ్ కి ప్రభాస్ స్పందించి తన ఫేవరెట్ డిష్ ప్రాన్స్ (రొయ్యలు) పులావ్ అని తెలియజేశాడు.

ప్రాన్స్  (రొయ్యలు) అంటే నాకు చాలా ఇష్టం: ప్రభాస్

అనుష్క తను రీసెంట్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్ లో భాగంగా తన ఫేవరెట్ డిష్ గురించి చెప్పాలని ప్రభాస్ ని ఛాలెంజ్ చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లో అనుష్క చెఫ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే తను ప్రభాస్ ని ఛాలెంజ్ చేయగా ప్రభాస్ స్పందించి నాకు  ప్రాన్స్ (రొయ్యలు) పులావ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. తను రామ్ చరణ్ ని కూడా ఈ ఛాలెంజ్ లో నామినేట్ చేశాడు.

ప్రాన్స్  (రొయ్యలు) పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం:

ప్రాన్స్ (రొయ్యలు) ని పసుపు నీళ్లలో కలిపి బాగా కడగాలి. తర్వాత పాన్ లో రెడ్ చిల్లీస్, జిలకర, కరివేపాకు, ప్రాన్స్  (రొయ్యలు) వేసి ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ పేస్ట్ వేయాలి, టమాటాలు, పచ్చిమిర్చిలు ఉప్పు, కారం వేయాలి. వాటిని ఫ్రై చేసి తర్వాత వాటర్ యాడ్ చేయాలి. దాంట్లో వాటర్ అంతా బయటికి వెళ్లాక కర్రీని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ లో ఆయిల్లో ఆనియన్స్, జీడిపప్పు, రైస్ వేసి బాగా ఉడికించాలి. దీంట్లో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి పౌడర్, అల్లం పేస్ట్, మసాలా వేసి బాగా కుక్ చేయాలి. బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ప్రాన్స్  (రొయ్యలు) కర్రీని వేయాలి. ఒక గ్లాసు రైస్ కి రెండు గ్లాసుల నీళ్లు వేసి 30 నిమిషాలు ఉడికిస్తే ప్రాన్స్  (రొయ్యలు) పులావ్ రెడీ.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కి బాగా సపోర్ట్ చేస్తున్న ప్రభాస్:

ప్రభాస్ అనుష్క నటిస్తున్న ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ప్రభాస్ తన సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. ఇది దాదాపు 5 సంవత్సరాల తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా. ప్రభాస్ అనుష్క మంచి ఫ్రెండ్స్. వాళ్ల మీద టాలీవుడ్లో రూమర్స్ కూడా ఉన్నాయి. వాళ్లు ఇంతకుముందు కలిసిన నటించిన మిర్చి, బిల్లా, బాహుబలి వాళ్లకు మంచి క్రేజ్ ని అందించాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ తో పోటీ పడుతుండడం విశేషం.

అనుష్క ఇకపై స్పీడ్ గా సినిమాలు చేయాలని కోరుకుందాం. ఈ సెప్టెంబర్ 7వ తేదీన జవాన్ తో ఈ సినిమాకు గట్టి పోటీ ఉంటుంది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని మనం కోరుకుందాం. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నవీన్ పొలిశెట్టి కూడా నటించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు తర్వాత తను నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.