రెమ్యూనరేషన్ పెంచేసిన అనుష్క

రెమ్యూనరేషన్…. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం. హీరోలైనా కానీ హీరోయిన్లయినా కానీ ఒక్క హిట్ పడిందంటే చాలు రెమ్యూనరేషన్లను అమాంతం పెంచేస్తారు. ఇప్పుడు ఇక పాన్ ఇండియా చిత్రాల జోరు మొదలయింది. పాన్ ఇండియా చిత్రాల వల్ల మన స్టార్స్ మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో నిర్మాతకు తప్పనిసరిగా డబ్బులు వస్తాయని భావిస్తున్న సదరు స్టార్స్ రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేస్తున్నారు. చాలా సందర్భాల్లో నిర్మాతలు వారు చెప్పిన రేట్లకు ఒప్పుకుని సినిమాలు తీస్తున్నారు.  సీక్వెల్స్ […]

Share:

రెమ్యూనరేషన్…. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం. హీరోలైనా కానీ హీరోయిన్లయినా కానీ ఒక్క హిట్ పడిందంటే చాలు రెమ్యూనరేషన్లను అమాంతం పెంచేస్తారు. ఇప్పుడు ఇక పాన్ ఇండియా చిత్రాల జోరు మొదలయింది. పాన్ ఇండియా చిత్రాల వల్ల మన స్టార్స్ మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో నిర్మాతకు తప్పనిసరిగా డబ్బులు వస్తాయని భావిస్తున్న సదరు స్టార్స్ రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేస్తున్నారు. చాలా సందర్భాల్లో నిర్మాతలు వారు చెప్పిన రేట్లకు ఒప్పుకుని సినిమాలు తీస్తున్నారు. 

సీక్వెల్స్ అయితే మరీ ఘోరం

ఏదైనా ఒక మూవీ మొదటి పార్ట్ వచ్చిన తర్వాత రెండో పార్ట్ ను తెరకెక్కిస్తే ఆ మూవీకి స్టార్లు తీసుకునే రెమ్యూనరేషన్ తెలిసి నిర్మాతలు, ప్రేక్షకులు గుండెలు పట్టుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే ఎవరైనా సరే సెకండ్ పార్ట్ మీద దృష్టి పెడతారు. ఫస్ట్ పార్ట్ హిట్ కనుక ఇక సెకండ్ పార్ట్ కు హీరోలను మార్చే సాహసం ఎలాగూ చేయలేరు. దీంతో మన స్టార్లు అమాంతం తమ రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారు. ఇష్టం వచ్చిన విధంగా ప్రొడ్యూసర్ల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. 

మార్కు చూపెట్టిన స్వీటీ

టాలీవుడ్ ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క. అనుష్క శెట్టి అందం, ఆమె హైట్ ఒక రకంగా ఉండేవని కుర్రకారు అనేవారు. అప్పట్లో ప్రభాస్ తో నటించిన బిల్లా సినిమాలో అమ్మడు బికినీ సూట్ వేసింది. ఆ సినిమాలో అమ్మడు అందాల ఆరబోత ఒక లెవల్ అసలు. దీంతో అనుష్కకు ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. అనేక మంది స్టార్ హీరోలతో అనుష్క జత కట్టింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేసులో కూడా అనుష్క నిలబడింది. కానీ ఆ తర్వాత మాత్రం అనుష్క ఫేడ్ ఔట్ అయిపోయింది. నేటి తరం హీరోయిన్లతో పోటీ పడలేక వెనక్కు పడిపోయింది. ఓ టాలీవుడ్ హీరోకు అనుష్క కరెక్ట్ మ్యాచ్ అని వారిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇక చాలా రోజుల పాటు సినిమాకు దూరంగా ఉన్న బ్యూటీ అనుష్క యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ‘‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’’ సినిమా ద్వారా అలరించనున్నారు. ఈ మూవీ చేసేందుకు అనుష్క భారీ మొత్తంలో వసూలు చేసిందని టాక్ వినిపిస్తోంది. 

వామ్మో స్వీటీ అంత తీసుకుందా..

యంగ్ హీరోతో మూవీ కోసం అనుష్క ఏకంగా రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ టైంలో హిట్స్ అలా పక్కన పెడితే అసలు అనుష్క చేసిన సినిమాలే లేవు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఘోరంగా వసూలు చేసింది. సైజ్ జీరో మూవీ తర్వాత అనుష్క ఘోరంగా లావు పెరిగిపోయిందనే ట్రోల్స్ వచ్చాయి. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ప్రయోగం చేసిన స్వీటీ తర్వాత బరువు తగ్గేందుకు ఎంత ప్రయత్నించినా కానీ బరువు తగ్గట్లేదని వార్తలు వచ్చాయి. ఈ మధ్య మూవీలు చేయని స్వీటీ కోసం యూవీ క్రియేషన్స్ వారు ఇంత చెల్లించడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఈ మూవీలో ‘‘జాతి రత్నాలు’’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన నవీన్ పొలిశెట్టి హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ మూవీ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇటీవలే విడుదలయిన మూవీ ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఫన్ హ్యూమర్ కలిసి ఉండేలా ట్రైలర్ ను కట్ చేశారు. 

జవాన్ తో పోటీ

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించిన జవాన్ మూవీతో కలిసి అనుష్క-నవీన్ ల మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మరి జవాన్ మూవీని తట్టుకుని ఎలా నిలబడుతుందో చూడాలి. మొదట ఒక డేట్ అనుకున్నా కానీ అది కుదరకపోవడంతో మేకర్స్ ఈ మూవీని సెప్టెంబర్ 7కు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్ మీద స్వీటీ కనిపించనుండడంతో ఆమె అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మరో మారు స్వీటీ తన మ్యాజిక్ చూపెడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో మాత్రం స్వీటీ చాలా నాజూగ్గా క్యూట్ గా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది.. నిర్మాతలు అనుష్కకు ఇచ్చిన మొత్తానికి గిట్టుబాటు అయిందా? లేదా? అని..