Anushka: అటువంటి రోల్స్ కోసం చూస్తున్న అనుష్క

చిరంజీవితో సినిమాలో కూడా అమ్మడికే చాన్స్

Courtesy: twitter

Share:

Anushka:ఒకప్పుడు తెలుగు తెరను (Tollywood) ఏలిన హీరోయిన్లలో అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా ఉంటారు. అమ్మడు చాలా రోజుల పాటు తెలుగులో టాప్ హీరోయిన్ (Top Heroine) గా చలామణి అయింది. ఈ స్టార్ (Star) ఆ స్టార్ అనే తేడా లేకుండా వరుస పెట్టి అందరితో సినిమాలు చేసేసింది. కేవలం గ్లామర్ రోల్స్ (Glamour Roles) మాత్రమే కాకుండా హీరోయిన్ సెంట్రిక్ పాత్రలలో కూడా మెరిసింది. హీరోయిన్ సెంట్రిక్ పాత్రలు అంటే ఒకప్పుడు అనుష్కనే అందరికీ గుర్తుకు వచ్చేది. అలా హీరోయిన్ సెంట్రక్ పాత్రలకు అనుష్క పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది. అందుకోసమే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి తమ సినిమాల్లో యాక్ట్ చేపించుకునేందుకు దర్శక నిర్మాతలు (Directors) క్యూ కట్టేవారు. 

జీరోను చేసిన ‘సైజ్ జీరో’

ఇలా మూడు హిట్లు.. ఆరు సక్సెస్ మీట్లు అంటూ సాఫీగా సాగుతున్న అనుష్క శెట్టి (Anushka Shetty) జీవితాన్ని సైజ్ జీరో (Size Zero) మూవీ అతలాకుతలం చేసింది. ఈ మూవీ హిట్ (Hit) అయిందా లేదా అనేది అలా పక్కన పెడితే ఈ మూవీ కోసం వెయిట్ పెరిగిన అనుష్క (Anushka) ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ (Weight) తగ్గడం లేదు. దీంతో అమ్మడికి సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఒకటి రెండు సినిమాల్లో అనుష్కను (Anushka) చూసి ఆడియన్స్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా పెదవి విరిచారు. దీంతోనే అనుష్క (Anushka)ను తీసుకోవడం పక్కన పెట్టేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వెయిట్ తగ్గేందుకు స్వీటీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి సక్సెస్ కాలేదు. ఓవర్ వెయిట్ అలాగే ఉండడంతో ఈ బ్యూటీ సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది. ఇక సినిమాల సంగతి అలా పక్కన పెట్టి.. వెయిట్ తగ్గించుకునే పనిలో పడింది. ఇక ఈ గ్యాప్ లో అనేక మంది హీరోయిన్లు టాలీవుడ్ (Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు వారు వచ్చీ రావడంతోనే హిట్లను తమ ఖాతాల్లో (Account) వేసుకుని రెమ్యూనరేషన్లు అమాంతం పెంచేశారు. కానీ అనుష్క మాత్రం తన ఓవర్ వెయిట్ తగ్గించుకునే పనిలోనే బిజీగా గడిపింది. 

చివరాకరికి.. 

చాలా రోజుల పాటు ప్రయత్నాలు చేసిన అనుష్క శెట్టి (Anushka Shetty) ఎట్టకేలకు తన వెయిట్ ను కాస్త తగ్గించుకుంది. వెయిట్ అయితే తగ్గించుకుంది కానీ అప్పటి అనుష్క శెట్టిలా (Anushka Shetty) లేదని చాలా మంది కామెంట్ చేశారు. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. 

అటువంటి పాత్రల కోసం చూస్తున్న స్వీటీ

అనుష్క శెట్టి (Anushka Shetty) లేడీ సెంట్రిక్ పాత్రలకు పెట్టింది పేరు. ఎంతటి పాత్రనైనా అనుష్క ఇట్టే చేసేస్తుందనే టాక్ ఉంది. ఆమె అరుంధతి, భాగమతి వంటి హిట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. అరుధంతి మూవీ గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అవుతుంది. అది అప్పట్లో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ (Trend Setter) గా నిలిచింది. అనేక రోజుల పాటు అరుంధతి ఫీవర్ కంటిన్యూ అయింది. ఈ మూవీ ఇండస్ట్రీని ఊపేసింది. ఇక ఈ మూవీ తర్వాత అనుష్క వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కేవలం లేడీ సెంట్రిక్ పాత్రలే కాకుండా గ్లామర్ రోల్స్ కు కూడా డైరెక్టర్లు అనుష్క చుట్టే తిరిగేవారు. అనతి కాలంలోనే అమ్మడు టాప్ చెయిర్ కు చాలా దగ్గరైంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ సైజ్ జీరో సినిమాకు చేసిన మిస్టేక్ వల్ల అనుష్క కెరియర్ డల్ అయిపోయింది. ఇక ఆ మూవీ తర్వాత రెండు మూడు మూవీస్ చేసినా అనుష్క (Anushka) చాలా లావుగాఉందని అంతా కామెంట్ చేశారు. ఇక దీంతో తర్వాతి సినిమాలకు దర్శక నిర్మాతలు అనుష్కను తీసుకోవడం మానేశారు. 

భాగమతికి సీక్వెల్ ప్లాన్

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన భాగమతి సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. అనుష్క మెయిన్ రోల్ లో నటించిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కు అనౌన్స్ చేశారు.చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి మూవీ చేసినా కానీ తనలో ఈజ్ ఏ మాత్రం తగ్గలేదని సినిమా చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో స్వీటీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు. .ఇక ఇప్పుడు అనుష్క లేడీ సెంట్రిక్ క్యారెక్టర్ల కోసం మాత్రమే కాకుండా టాప్ హీరోల సరసన నటించేందుకు కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మన టాలీవుడ్ లో అనేక మంది సీనియర్ హీరోయిన్లకు హీరోయిన్ల కొరత వేధిస్తోంది. ఇక సీనియర్ స్టార్ హీరోలకు అనుష్క చక్కగా సూట్ అవుతుందని అంతా కామెంట్ చేస్తున్నారు. మెగా స్టార్ త్వరలో వశిష్టతో చేయబోయే మెగా 156 మూవీలో కూడా అనుష్కను తీసుకోవాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే మెగా స్టార్ మూవీలో ఈ బ్యూటీ చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బింబిసార వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ వశిష్ట మంచి ఫామ్ లో ఉన్నాడు.