అనుష్క శర్మ తల్లిగా గొప్ప త్యాగాలు చేసింది ‘నేను ఎదుర్కొన్న సమస్యలు సమస్యలే కాదనిపిస్తోంది’ : విరాట్అనుష్క శర్మ తల్లిగా గొప్ప త్యాగాలు చేసింది

విరాట్ కోహ్లి ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో  తన భార్య, నటి అయిన అనుష్క శర్మ గురించి మాట్లాడాడు. రబ్ నే బనా ది జోడి, పికె, బ్యాండ్ బాజా బారాత్, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కీ వంటి చిత్రాలకు పేరుగాంచిన అనుష్క.. షారూఖ్ ఖాన్, కత్రినాలతో కలిసి 2018 చిత్రం జీరోలో చివరిసారిగా పెద్ద తెరపై కనిపించింది. ఆమె తన సోదరుడు కర్నేష్ శర్మ నిర్మించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఖలా (2022)లో అతిధి […]

Share:

విరాట్ కోహ్లి ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో  తన భార్య, నటి అయిన అనుష్క శర్మ గురించి మాట్లాడాడు. రబ్ నే బనా ది జోడి, పికె, బ్యాండ్ బాజా బారాత్, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కీ వంటి చిత్రాలకు పేరుగాంచిన అనుష్క.. షారూఖ్ ఖాన్, కత్రినాలతో కలిసి 2018 చిత్రం జీరోలో చివరిసారిగా పెద్ద తెరపై కనిపించింది. ఆమె తన సోదరుడు కర్నేష్ శర్మ నిర్మించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఖలా (2022)లో అతిధి పాత్రలో కనిపించింది. ఘోడే పే సవార్ అనే పాటలో ఆమె కనిపించింది. కూతురు వామిక పుట్టిన తర్వాత అనుష్క తన మొదటి ప్రాజెక్ట్ అయిన చక్దా ఎక్స్‌ప్రెస్‌లో నటించనుంది. ఈ సినిమా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. 

‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ పోడ్‌కాస్ట్

అనుష్క భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా ఒక పోడ్ కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క గురించి ఇలా అన్నాడు. గత రెండేళ్లలో తల్లిగా తను ఎన్నో ‘పెద్ద పెద్ద త్యాగాలు’ చేసిందన్నాడు విరాట్. అనుష్క తన జీవితాన్ని ఎలా నడిపిస్తుందో చూస్తుంటే ‘నేను ఎదుర్కొన్న సమస్యలు సమస్యలే కాదనిపిస్తోంది’ అని అర్థమైందని క్రికెటర్ చెప్పాడు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత అనుష్క, విరాట్ 2017లో ఇటలీలో  అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.  జనవరి 2021లో.. వామికా కోహ్లి వారి జీవితాలలోకి ప్రవేశించింది. తన భార్య, కుమార్తెతో గత రెండేళ్ల గురించి మాట్లాడుతూ విరాట్ ఇలా అన్నాడు. ‘నిజంగా జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, మన పరిస్థితి ఎలా ఉన్నా  కుటుంబం మనల్ని ప్రేమిస్తుంది’ అని చెప్పాడు.

భార్య అనుష్క శర్మపై విరాట్ కోహ్లీ ప్రశంసలు

“గత రెండేళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. మాకు పాప పుట్టింది. ఒక తల్లిగా.. ఆమె చేసిన త్యాగం చాలా పెద్దది. ఆమెను చూస్తుంటే, నేను ఎదుర్కొన్న సమస్యలు అసలు సమస్యలే కావని గ్రహించాను. అంచనాల మేరకు ఆందోళన చెందుతూ, మీ కుటుంబం మిమ్మల్ని ప్రేమిస్తున్నంత కాలం, మనకి ఏమీ పెద్ద పెద్ద కోరికలు ఉండవు. ఎందుకంటే ఎవరికైనా అదే మొదటి అవసరం” అని ఇటీవలి తన RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) పోడ్‌కాస్ట్ సందర్భంగా విరాట్  చెప్పాడు. విరాట్ ఇంకా మాట్లాడుతూ.. అనుష్క తనకు ఎలా స్ఫూర్తినిస్తుందో చెప్పాడు. అతను ఇలా అన్నాడు, “ప్రేరణ కావలసి వచ్చినప్పుడు, మనకది ఇంటి నుండే మొదలవుతుంది. అనుష్క నాకు సహజంగానే చాలా ప్రేరణనిచ్చింది. నాకు జీవితం పట్ల పూర్తిగా భిన్నమైన దృక్పథం ఉండేది. కానీ ఒక వ్యక్తితో ప్రేమలో పడినప్పుడు, మనలో కూడా ఆ మార్పులను ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తాము. జీవితం పట్ల ఆమె దృక్పథం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ దృక్పథమే నన్ను నేను మంచిగా మార్చుకోవాలని, పరిస్థితులను మరింతగా అంగీకరించమని నన్ను ప్రోత్సహించింది” అని అన్నాడు.

ఈ సంవత్సరం మొదట్లో ఒక ఇంటర్వ్యూలో.. విరాట్ తన కెరీర్‌లో విశ్రాంతి సమయంలో నిరాశకు గురయ్యానని, ‘పిచ్చివాడిలా’ ఉన్నానని అంగీకరించాడు. దీనివల్ల తన భార్య అనుష్కకి, ఇంకా తనవారికి ఎంతో బాధ కలిగించిందని అన్నాడు. విరాట్ bcci.tv కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్‌తో ఇలా అన్నాడు, “నా విషయంలో నేను చాలా నిరాశ చెంది ఉన్నాను. నాకు చాలా అయోమయంగా ఉండేది. ఇది నా భార్య అనుష్క శర్మ, నా సన్నిహితులకు, అభిమానులకు ఎంతో బాధ కలిగించింది. ఇబ్బంది పెట్టింది. కాబట్టి నేను బాధ్యత వహించాల్సి వచ్చింది, మరోలా ఆలోచించవలసి వచ్చింది అని పేర్కొన్నాడు.