Virat-Anushka: బేబీ బంప్‌తో కనిపించిన అనుష్క శర్మ..

Virat-Anushka: విరాట్ కోహ్లీ- అనుష్క‌శ‌ర్మ(Virat Kohli- Anushka Sharma) దంప‌తులు మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్నార‌నే వార్త గ‌త కొంత‌కాలంగా మీడియాలో వినిపిస్తోంది. సోష‌ల్‌మీడియాలో కూడా ఈ విష‌యంపై వార్త‌లు చాలానే వ‌చ్చాయి. అయితే, తాజాగా అనుష్క‌శ‌ర్మ బెంగుళూరులోని ఓ హోట‌ల్‌లో బేబీ బంప్‌(Baby Bump)తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో అనుష్క‌శ‌ర్మ(Anushka Sharma) మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ విష‌యంపై విరుష్క దంపతులు ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే, గ‌తంలో ముంబైలోని ఓ మెట‌ర్న‌టి […]

Share:

Virat-Anushka: విరాట్ కోహ్లీ- అనుష్క‌శ‌ర్మ(Virat Kohli- Anushka Sharma) దంప‌తులు మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్నార‌నే వార్త గ‌త కొంత‌కాలంగా మీడియాలో వినిపిస్తోంది. సోష‌ల్‌మీడియాలో కూడా ఈ విష‌యంపై వార్త‌లు చాలానే వ‌చ్చాయి. అయితే, తాజాగా అనుష్క‌శ‌ర్మ బెంగుళూరులోని ఓ హోట‌ల్‌లో బేబీ బంప్‌(Baby Bump)తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో అనుష్క‌శ‌ర్మ(Anushka Sharma) మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ విష‌యంపై విరుష్క దంపతులు ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

అయితే, గ‌తంలో ముంబైలోని ఓ మెట‌ర్న‌టి క్లినిక్(Maternity Clinic) బ‌య‌ట క‌నిపించిన వీరుష్క దంప‌తులు త‌మ ఫోటోల‌ను తీయొద్దంటూ మీడియాను రిక్వెస్ట్ చేసిన‌ట్లు తెలిసింది. త‌మ రెండ‌వ బిడ్డ గురించి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌కటిస్తామ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా త్వ‌ర‌లోనే  వన్డే వరల్డ్‌ కప్‌(Worldcup) పూర్తి అయిన తర్వాత ఈ విషయంపై విరాట్‌- అనుష్క దంపతులు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. వీరిద్దరికి 2021లో వామిక(Vamika) జన్మించిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం బెంగళూరు(Bangalore)లో ఉన్న ఈ జంటకు సంబంధించిన వీడియో వైరల్ అయిన వెంటనే, ఆమె ఇప్పటికే ‘ప్రెగ్నెన్సీ వాక్'(Pregnancy Walk) చేస్తున్నట్లు వారి అభిమానులు భావించారు. ఈ వైరల్ వీడియోలో, అనుష్క వారి విహారయాత్రలో విరాట్‌తో చేయి చేయిపట్టుకుని నడుస్తూ కనిపించింది. ఇందులో అనుష్క బెలూన్ స్లీవ్‌లతో వదులుగా ఉన్న నల్లటి దుస్తులు ధరించి బ్రైట్ ఫుల్ గా కనిపించింది. మరోవైపు, ఈ వైరల్ వీడియోలో విరాట్ కోహ్లీ గ్రే టీ-షర్ట్, లేత గోధుమరంగు రంగు ప్యాంట్‌లో కనిపించాడు.

నెటిజన్ల స్పందన ఈ వీడియో వైరల్(Viral) అయిన వెంటనే, నెటిజన్లు తమ అభిమాన సెలబ్రిటీ జంటను అభినందించడం ప్రారంభించారు. ”రెండో విరాట్ ఆన్ ది వే” అని ఓ యూజర్ అనగా.. ”ఎందుకు పుకార్లు? నిజంగానే ఆమె గర్భవతి. ఇది చాలా స్పష్టంగా ఉంది, కాదా? దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు!” అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ”ఈ అందమైన జంటకు అభినందనలు” అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. కొంతమంది ఈ వైరల్ వీడియోపై ప్రశ్నను లేవనెత్తారు. ఇది ‘పాత వీడియో’ అని వారించారు.  మరోవైపు విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌(World cup)లో బిజీగా ఉన్నాడు. అతను టోర్నమెంట్‌లో అత్యధిక రన్ స్కోరర్‌లలో ఒకడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అవుతాడని భావిస్తున్నారు. ఇప్పటికే సెమీఫైనల్‌(Semifinal)కు అర్హత సాధించిన టీమిండియా(Team india) న్యూజిలాండ్‌(New Zealand)తో తలపడనుంది.

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ(Virat Kohli- Anushka Sharma) 2017 లో ఎంతో ఘ‌నంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన నాలుగేళ్ల‌కు 2021 జనవరిలో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది అనుష్క‌శ‌ర్మ. విరాట్ కోహ్లి – అనుష్క జంట మొదటి సంతానం ఆడపిల్ల. వీరిద్ద‌రూ తమ కుమార్తెకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ పేర్లు కలిసేలా వామిక అనే పేరు పెట్టారు. ఇప్పుడు అనుష్క‌శ‌ర్మ‌రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైనట్లు స‌మాచారం. అయితే గతసారి మాదిరిగానే ఈసారి కూడా ఈ గుడ్ న్యూస్ ను కాస్తంత ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు మీడియా కోడై కూస్తుంది.

అయితే, అనుష్క మాత్రం ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల‌కు కాస్త దూరంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ఎక్కువ‌గా కూతురు వామిక‌(Vamika)కే త‌న స‌మ‌యం కేటాయిస్తున్నారు. కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ త‌మ గారాల ప‌ట్టి వామిక‌ను మీడియాకు(Media) దూరంగా ఉంచుతున్నారు. వామిక ముఖాన్ని చూపే ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు ఈ జంట‌. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విరుష్క దంపతులు తమ కుమార్తెకు సంబంధించి ఏ ఫోటోను ఇప్ప‌టివ‌ర‌కూ పోస్టు చేయ‌క‌పోవ‌డం విశేషం. ఇక, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అండర్ 19 కెప్టెన్ గా కెరీర్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాతలోకి వచ్చాడు. అతనిలోకి వచ్చి రాగానే కెప్టెన్ కూడా అయిపోయాడు. కెప్టెన్ గా అద్భుతమైన విజయాలు అందించిన విరాట్ కోహ్లీ… ప్రస్తుతం సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 పోరులో కూడా చాలా కష్టపడుతున్నాడు విరాట్ కోహ్లీ.