అనుష్క శెట్టి సెకండ్ ఇన్నింగ్స్..!

ప్రముఖ నటి అందాల తార అలనాటి హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు యోగా టీచర్గా పని చేసేవారు. అయితే నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. వచ్చిన ఆనతి కాలంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మంచి కలరు.. ఫిగర్ మెయింటైన్ చేయడమే కాదు మంచి హైట్ చూడగానే మైమరిపించే అందంతో అందరిని ఆకట్టుకుంది.  ఆ క్షణంలోనే ఎంతోమంది […]

Share:

ప్రముఖ నటి అందాల తార అలనాటి హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు యోగా టీచర్గా పని చేసేవారు. అయితే నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. వచ్చిన ఆనతి కాలంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మంచి కలరు.. ఫిగర్ మెయింటైన్ చేయడమే కాదు మంచి హైట్ చూడగానే మైమరిపించే అందంతో అందరిని ఆకట్టుకుంది.  ఆ క్షణంలోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అనుష్క.. మరెంతోమంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది.

అంతేకాదు బిల్లా వంటి చిత్రాలలో పూర్తిస్థాయిలో బికినీ ధరించి అందరిని ఆకట్టుకున్న ఈమె గ్లామర్ షోలు చేయడమే కాకుండా.. అరుంధతి వంటి సినిమాలలో జేజమ్మ పాత్రలో నటించి అందరిని భయపెట్టేసింది. ఇక మరొకవైపు బాహుబలి లాంటి చిత్రాలలో మహారాణి క్యారెక్టర్ లో నటించి రాజసం ఉట్టిపడేలా తన నటనతో గంభీరమైన శరీర దారుఢ్యంతో అందరినీ అలరించిన అనుష్క.. స్టార్ హీరోయిన్గా, పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకుంది. అయితే అవకాశాలు ఎక్కువగా వస్తాయని అనుకుంది కానీ కథల ఎంపిక విషయంలో తడబాటు పడింది . ఆ తర్వాత భాగమతి,  నిశ్శబ్దం వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకే పరిమితం కావాల్సి వచ్చింది.  అప్పట్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన అనుష్క వేదం సినిమాలో వేశ్య క్యారెక్టర్ కూడా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె సైజ్ జీరో సినిమాల్లో ఊహించని విధంగా బరువు పెరిగి ఆ తర్వాత అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడింది.

ఇక ఇప్పటివరకు మళ్ళీ తనదైన శైలిలో మునుపటి వైభోగాన్ని పొందే లాగా ఒక అవకాశాన్ని కూడా అందుకోలేకపోయింది అనుష్క. ఇ తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కథల ఎంపిక విషయంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మునుపటి  పూర్వ వైభవం పొందాలి అంటే కథల ఎంపిక విషయంలో అనుష్క చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.  లేకపోతే ఈమె సినీ కెరియర్ ముగిసినట్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . 

మరొకవైపు అనుష్క ప్రభాస్,  రవితేజ వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది.. కాబట్టి ఇప్పుడు ఆ హీరోలు మళ్ళీ ఈమెను తమ సినిమాలలో పెట్టుకునే అవకాశం లేదు.  ఇక కొత్త హీరోయిన్లు వస్తున్న నేపథ్యంలో ఈమెకు కుర్ర హీరోలు కూడా అవకాశం ఇవ్వడం అసాధ్యమే.. మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అనుష్క ఏ విధంగా సినిమా కథలను ఎంచుకుంటుంది లేక  లేడీ ఓరియంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపుతుందా  అనేది మరింత ప్రశ్నార్థకంగా మారింది. మరి ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకొని సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే ఆమె ఎటువైపు తన సినిమా కెరియర్ ను  ప్లాన్ చేసుకున్నా సరే.. సక్సెస్ పొందే దిశగా అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.