Anupam Kher: కీరవాణి తండ్రి నుంచి ఆశీస్సులు తీసుకున్న అనుపమ్

Anupam Kher: పాన్ ఇండియా(Pan India) సినిమాల పుణ్యాన ఒక ఇండస్ట్రీ నటులు ఓ ఇండస్ట్రీకి వారికి దగ్గర అవుతున్నారు. అలా మన తెలుగు చిత్రసీమకు దగ్గరయిన బాలీవుడ్ నటుల్లో అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఒకరు. పాన్ ఇండియా చిత్రాలు కార్తికేయ-2 మరియు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు చిత్రాలతో అనుపమ్ తన నటనేంటో తెలుగు వారికి కూడా రుచి చూపించారు. అనుపమ్ ఖేర్(Anupam Kher) కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. అతడు […]

Share:

Anupam Kher: పాన్ ఇండియా(Pan India) సినిమాల పుణ్యాన ఒక ఇండస్ట్రీ నటులు ఓ ఇండస్ట్రీకి వారికి దగ్గర అవుతున్నారు. అలా మన తెలుగు చిత్రసీమకు దగ్గరయిన బాలీవుడ్ నటుల్లో అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఒకరు. పాన్ ఇండియా చిత్రాలు కార్తికేయ-2 మరియు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు చిత్రాలతో అనుపమ్ తన నటనేంటో తెలుగు వారికి కూడా రుచి చూపించారు. అనుపమ్ ఖేర్(Anupam Kher) కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. అతడు బాలీవుడ్ లో ఉన్న లెజండరీ నటుల్లో ఒకరు. కానీ ఇప్పడిప్పుడే ఈ లెజండరీ తెలుగు వారికి దగ్గర అవుతున్నాడు. ఇన్ని రోజులు పాన్ ఇండియా(Pan India) సినిమాల ద్వారానే తెలుగు వారికి దగ్గర అయిన ఈ యాక్టర్ రానున్న రోజుల్లో డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేసేందుకు సన్నాహకాలు చేసుకుంటున్నట్లు వినికిడి. అందులో భాగంగానే తెలుగు వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.  వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకుల్లో రిజిస్టర్ అవ్వడానికి చూస్తున్నారు. 

కీరవాణి తండ్రితో.. 

తెలుగు సినిమాలో (Telugu Cinema) తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాల్లో రాజమౌలి కుటుంబం ఒక్కటి. రాజమౌలి కుటుంబానికి చెందిన వారే మ్యూజిక్ డైరెక్టర్ (Music Director) కీరవాణి. అటువంటి కీరవాణి తండ్రి ఆశీస్సులను ఏస్ యాక్టర్ అనుపమ్ ఖేర్ తీసుకోవడం అంటే మాటలు కాదని పలువురు సినీ ప్రియులు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత కీరవాణి గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. అంతకు ముందు కూడా కీరవాణి (Keeravani) అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కానీ ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ (Oscar) ను గెలుచుకున్నాడో అప్పటి నుంచి కీరవాణి లెవల్ పూర్తిగా మారిపోయింది. ఆయన కేవలం తెలుగు ప్రేక్షకులకే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అటువంటి కీరవాణి తండ్రి ఇంటికి పాన్ ఇండియా యాక్టర్ అనుపమ్ ఖేర్ వెళ్లారు. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా నివాసాన్ని అనుపమ్ ఖేర్ (Anupam Kher) సందర్శించారు. శివ శక్తి దత్తా వృత్తి రీత్యా రచయిత మరియు దర్శకుడు. అతని ఇల్లు అన్ని హిందూ దేవుళ్ల ఆయిల్ పెయింటింగ్‌ లతో నిండి ఉంటుంది. అది చూసి అనుపమ్ ఖేర్ ఆశ్చర్యపోయాడు. శివ శక్తి దత్తా స్వయంగా వాటిని చిత్రించాడు మరియు వాటిని బాగా లామినేట్ చేసి తన నివాస గోడలపై అమర్చారు. అనుపమ్ ఖేర్ శివ శక్తి దత్తా నివాసాన్ని సందర్శించడం ఒక స్వచ్ఛమైన ఆశీర్వాదంగా పేర్కొన్నాడు.

ఆశీర్వచనాలు తీసుకున్న అనుపమ్.. 

శివశక్తి దత్తా ఇంటికి వెళ్లిన అనుపమ్ (Anupam Kher) అతడి వద్ద నుంచి ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. అతడి నుంచి ఆశీస్సులు తీసుకోవడం మాత్రమే కాదు. అతడు చాలా గొప్పవాడు అని కీర్తిస్తూ సోషల్ మీడియా ఎక్స్ (ఒకప్పటి ట్విటర్) లో పోస్టు పెట్టారు. ఈ పోస్టు చూసిన అనేక మంది వావ్ ఇట్స్ రియల్లీ గ్రేట్ అని అనుపమ్ ఖేర్ ను మెచ్చుకుంటున్నారు. శివ శక్తి దత్తా ఇల్లు నిజానికి గుడిలా ఉందని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఇలా తాను శివశక్తి దత్తా ఆశీస్సులు తీసుకోవడం చాలా బాగుందని అనుపమ్ తెలిపారు. అతడి ఇల్లు మొత్తం దేవుళ్ల పటాలతో నిండిపోయిందని పేర్కొన్నాడు. 

ఆ సినిమాతో కూడా.. 

అనుపమ్ ఖేర్ (Anupam Kher) అని చెప్పగానే అందరికీ కార్తికేయ-2, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలే గుర్తుకు వస్తాయి. కానీ అనుపమ్ ఖేర్(Anupam Kher) ‘కశ్మీర్ ఫైల్స్’ (Kashmir Files) అనే చిత్రంతో కూడా తెలుగు వారిని పలకరించాడు. చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ మూవీలో కూడా అనుపమ్ ఖేర్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతోనే అనుపమ్ (Anupam Kher) కు పాన్ ఇండియా (Pan India) మూవీస్ లో అవకాశాలు రావడం ఎక్కువ అయింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అనుపమ్ మార్కెట్ బాగా పెరిగింది. వెంటనే ఆయనకు కార్తికేయ-2, టైగర్ నాగేశ్వర రావు వంటి తెలుగు పాన్ ఇండియా చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు కేవలం పాన్ ఇండియా (Pan India) చిత్రాలు చేయడం మాత్రమే కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసేందుకు అనుపమ్ (Anupam Kher) ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.