Animal: ఫ్యాన్సీ ధరకు అమ్ముడు పోయిన యానిమల్ రైట్స్

బాలీవుడ్ (Bollywood) మూవీ యానిమల్ (animal) తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుకోని ధరలకు అమ్ముడు పోయింది. యానిమల్ రైట్స్  (Animal Rights) చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక బాలీవుడ్ (Bollywood)  మూవీకి ఇంత డిమాండా అని ఆశ్చర్యపోతున్నారు. యానిమల్ రైట్స్ (Animal Rights) కోసం చాలా మంది నిర్మాతలు పోటీ పడ్డట్లు సమాచారం. చివరికి ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ మూవీకి దాదాపు రూ. 15 కోట్లు పలికినట్లు తెలుస్తోంది . ఈ ధరను […]

Share:

బాలీవుడ్ (Bollywood) మూవీ యానిమల్ (animal) తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుకోని ధరలకు అమ్ముడు పోయింది. యానిమల్ రైట్స్  (Animal Rights) చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక బాలీవుడ్ (Bollywood)  మూవీకి ఇంత డిమాండా అని ఆశ్చర్యపోతున్నారు. యానిమల్ రైట్స్ (Animal Rights) కోసం చాలా మంది నిర్మాతలు పోటీ పడ్డట్లు సమాచారం. చివరికి ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ మూవీకి దాదాపు రూ. 15 కోట్లు పలికినట్లు తెలుస్తోంది . ఈ ధరను గురించి తెలిసి అందరూ షాకయ్యారు. యానిమల్ రైట్స్ (Animal Rights) ఇంతలా పోతాయని ఎవరూ ఊహించలేదు. అది స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా కాదు. అదో బాలీవుడ్ (Bollywood) సినిమా. అయినా కానీ యానిమల్ రైట్స్ (Animal Rights) చూస్తే మాత్రం ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. 

కారణం అదేనా

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన యానిమల్ మూవీ రైట్స్ (Animal Rights) తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డులను సెట్ చేశాయి. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు ధరకు ఈ మూవీ రైట్స్ (Animal Rights) అమ్ముడయ్యాయి. ఈ మూవీలో రణ్ బీర్ సనసన నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) నటిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి (Arjun Reddy) వంటి కల్ట్ మూవీని తెరకెక్కించిన మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy) తెరకెక్కిస్తున్నారు. ఇటు హీరోయిన్ తో పాటు అటు దర్శకుడు కూడా మంచి ఊపు మీద ఉండడంతో యానిమల్ (Animal Rights) సినిమాకు ఈ స్థాయిలో ధర పలికిందని అంతా చర్చించుకుంటున్నారు. ఇక అర్జున్ రెడ్డి మూవీ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో చూసిన నిర్మాతలు ఆ దర్శకుడి నుంచి వచ్చిన మరో కల్ట్ (Cult) మూవీ యానిమల్ ను రికార్డు స్థాయి ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

కబీర్ సింగ్ కూడా కారణమేనా

అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమా కేవలం ఏదో అలా వచ్చిన హిట్ కాదని తనలో స్టఫ్ కు అర్జున్ రెడ్డి కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అని సందీప్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ (Kabir Singh) ను తెరకెక్కించాడు. ఆ మూవీ అక్కడ కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. సందీప్ సత్తా ఏంటో ఇండస్ట్రీ (Industry) ఈ రెండు మూవీలతో చూసింది. అందుకోసమే అతడి నుంచి వస్తున్న సినిమాకు రికార్డు స్థాయి ధర పెట్టి హక్కులను దక్కించుకునేందుకు నిర్మాతలు పోటీ పడ్డారు. అంతే కాకుండా ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన్న హీరోయిన్ గా నటించడం కూడా ఈ రికార్డు స్థాయి ధరకు ఒక కారణం అని అంతా చర్చించుకుంటున్నారు. అసలే రష్మిక పుష్ప వంటి హిట్ తో మాంచి జోరు మీదుంది. అంతే కాకుండా అమ్మడు హీరోయిన్ అంటే తెలుగు నాట టికెట్లు తెగడం ఖాయం. ఈ రెండు కారణాలతోనే బాలీవుడ్ మూవీ అయినా కానీ యానిమల్ కు రికార్డు స్థాయి ధర వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఎగబడ్డ బయ్యర్లు

బాలీవుడ్ మూవీ యానిమల్ (Animal Rights) కోసం తెలుగు రాష్ట్రాల బయ్యర్లు పోటీ పడ్డారు. ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం సౌత్‌ లో కూడా చాలా హైప్‌ ని క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్లు కూడా ఈ సినిమాకు ఇంత ధర చెల్లించేందుకు కారణం అయ్యాయి. అంతే కాకుండా ప్రస్తుత రోజుల్లో తెలుగు నాట బాలీవుడ్ సినిమాలు మంచి సత్తా చాటుతున్నాయి. అందుకోసమే ఈ మూవీ కూడా రికార్డు స్థాయి ధరను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకున్న బయ్యర్లు ఈ మూవీ కోసం పోటీ పడి మరీ దక్కించుకున్నట్లు సమాచారం. 

అర్జున్ రెడ్డిని రిపీట్ చేసిన డైరెక్టర్

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీలో కూడా అర్జున్ రెడ్డిని గుర్తు చేశాడు. రష్మిక తో హీరో హాట్ లిప్ కిస్ (LipKiss) చేస్తాడు. అర్జున్ రెడ్డి మూవీలో బైక్ మీద లిప్ కిస్ (LipKiss) చేస్తే.. ఈ మూవీలో ఏకంగా ప్రైవేట్ జెట్ లోనే హీరో హీరోయిన్ ల మధ్య లిప్ కిస్ (LipKiss) సీన్ ను దర్శకుడు ప్లాన్ చేశాడు. రిలీజ్ అయిన ఇందుకు సంబంధించిన సాంగ్ ఫుల్ పాపులర్ అయింది. అంతే కాకుండా అర్జున్ రెడ్డి సినిమాలో హీరోకు ఎటువంటి కోపం ఉంటుందో యానిమల్ సినిమాలో కూడా హీరోను అలాగే ప్రజెంట్ చేశాడు. ఇటీవల రిలీజ్ అయిన సెకండ్ లిరికల్ లో హీరో చేతుకు కట్టు కట్టుకునే యాగంలో పాల్గొంటాడు. ఇవన్నీ సీన్స్ చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమాను మరోమారు డైరెక్టర్ ఇందులో కూడా వాడినట్లు కనిపిస్తోంది. ఈ అన్ని కారణాల వల్ల యానిమల్ మూవీకి రికార్డు స్థాయిలో ధర పలికింది.