మెగా ఫోన్ పట్టనున్న చిరు మూవీ నిర్మాత

చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఒక్క ఏరియాలో అని కాకుండా రిలీజైన ప్రతి చోటా ఈ మూవీ ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో ఈ మూవీని నిర్మించిన నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా అతడు అంతకు ముందు అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీకి కూడా ప్రొడ్యూస్ చేశాడు. అఖిల్ సరసన ఈ మూవీలో సాక్షి వైద్య […]

Share:

చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఒక్క ఏరియాలో అని కాకుండా రిలీజైన ప్రతి చోటా ఈ మూవీ ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో ఈ మూవీని నిర్మించిన నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా అతడు అంతకు ముందు అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీకి కూడా ప్రొడ్యూస్ చేశాడు. అఖిల్ సరసన ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా అందాలు ఒలకబోసింది. టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించినా కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది. భారీ డిజాస్టర్ గా మిగిలి నిర్మాతకు తీవ్ర నష్టం కలిగించింది. కేవలం నిర్మాతకు మాత్రమే కాకుండా మూవీని కొన్ని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కూడా తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇక ఆ తర్వాత అతడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆ ప్రొడ్యూసర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మెహర్ రమేష్ కు అలవాటే… 

భోళా శంకర్ మూవీ ప్లాప్ అయిందంటే ఎవరూ పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. కారణం ఆ మూవీ దర్శకుడు మెహర్ రమేష్ కు ప్లాపులివ్వడం పరిపాటే. ఆయన ఇప్పటి వరకు టాప్ స్టార్లతో తీసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. దీంతో భోళా శంకర్ కూడా ఆ లిస్టులో చేరిపోయిందని చాలా మంది సరిపెట్టుకున్నారు. వెంకటేశ్ వంటి ఫ్యామిలీ హీరోతో అతడు తీసిన షాడో మూవీ ఘోరంగా డిజాస్టర్ అయింది. అసలు ఫ్యామిలీ హీరో అయిన వెంకటేశ్ ను అలా ఊహించుకోవడం కష్టం. అంతలా అతడు వెంకీ గెటప్ ను మార్చేసి నానా రచ్చ చేశాడు. ఇక భోళా శంకర్ విషయానికి వస్తే ఈ మూవీ ఒరిజినల్ స్టోరీ కాదు. తమిళంలో హిట్ సాధించిన అజిత్ మూవీ వేదాళం కు ఇది రిమేక్. ఈ స్టోరీని తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేసిన డైరెక్టర్ మెగా స్టార్ తో ఈ మూవీని తెరకెక్కించాడు. 

జాతీయ నటి చేసినా కానీ

సావిత్రి మూవీతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి సురేష్ నటించినా కానీ ఈ మూవీ ప్లాప్ నుంచి తప్పించుకోలేదు. మెగా స్టార్ చిరంజీవి మిల్కీ బ్యూటీ తమన్నాతో వైరల్ స్టెప్పులేశాడు. అంతే కాకుండా తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను అనుసరించినా కానీ డిజిస్టర్ టాక్ నుంచి గట్టెక్కలేకపోయింది. ఇక ఈ మూవీలో మరో టాలీవుడ్ హీరో సుశాంత్ కూడా నటించాడు. ఇంత క్రూను సెలెక్ట్ చేసుకున్నా కానీ దర్శకుడు కథ, కథనం విషయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోయేసరికి మూవీ ఆడియన్స్ కు రుచించలేదు. ఈ మూవీ ప్లాప్ తో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట రీమేక్ స్టోరీలు చేయకూడని ఆయన నిర్ణయించుకున్నారట. దీంతో డైరెక్టర్ మెహర్ రమేష్ ను అంతా ట్రోల్ చేస్తున్నారు. దెబ్బకు మెగాస్టార్ ను మార్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మెగా ఫోన్ పట్టనున్న ప్రొడ్యూసర్

ఇక వరుసగా రెండు పెద్ద మూవీలు ప్లాప్ అయ్యేసరికి వీటిని ప్రొడ్యూస్ చేసిన అనిల్ సుంకర కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు ఇక మీదట మూవీలను డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. ప్రొడ్యూసర్ గా మారకముందు కూడా అనిల్ సుంకర్ మూవీని డైరెక్ట్ చేశాడు. అల్లరి నరేష్ హీరోగా యాక్షన్ 3D అనే మూవీని తెరకెక్కించాడు. కానీ అది అంతగా హిట్ కాలేదు. దీంతో అతడు డైరెక్షన్ మానేసి ప్రొడ్యూసర్ గా తన లక్ ను టెస్ట్ చేసుకున్నాడు. కానీ ప్రొడ్యూసర్ గా కూడా రెండు గట్టి దెబ్బలు తగిలే సరికి మనసు మార్చుకున్న అనిల్ ఇక మూవీలను డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. 

అదే పెద్ద రిలీఫ్

ఏజెంట్, భోళా శంకర్ వంటి డిజాస్టర్లతో సతమతం అవుతున్న అనిల్ సుంకరకు యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన కామెడీ థ్రిల్లర్ సామజవరగమన పెద్ద రిలీఫ్ ఇచ్చింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. బిగ్ మూవీస్ ఏజెంట్, భోళా శంకర్ నిరాశపర్చినా కానీ కామెడీ చిత్రం సామజవరగమన మాత్రం హిట్ సాధించింది. దీంతో కొంత మేర అయినా నష్టాలు తగ్గాయని టాక్. లేకపోతే నష్టాలు మరింత తీవ్ర స్థాయిలో ఉండేవట. అతడు సినిమాను తెరకెక్కిస్తాడని మాత్రమే ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. అతడు ఎటువంటి మూవీని తీస్తాడు. ఏ హీరోను సెలెక్ట్ చేసుకుంటాడు? అతడి మూవీని వేరే వారు ప్రొడ్యూస్ చేస్తారా? లేక ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకుంటాడా అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి తెలియవు. మరి చూడాలి… నిర్మాతగా భారీ డిజాస్టర్లను చవి చూసిన అనిల్ కు డైరెక్షన్ హిట్ ఇస్తుందో లేక ఇలాగే ప్లాప్స్ పలకరిస్తాయో…