Anil Ravipudi: అనిల్ రావిపూడి రూట్ మార్చాడా?

అనిల్ రావిపూడి(Anil Ravipudi) అంటేనే కామెడీ చిత్రాలు తీసి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. అయితే అతని రూటు మార్చి ఇప్పుడు యాక్షన్ అడ్వెంచర్ లోకి దిగాడు అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ(Balakrishna)తో భగవంత్ కేసరి(Bhagavanth Kesari)తో తను యాక్షన్ సీన్లను కూడా అవలీలగా చిత్రీకరించగలను అంటూ నిరూపించుకోవాలనుకుంటున్నాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).  అనిల్ రావిపూడి రూట్ మార్చాడా?:  కామెడీ చిత్రాలు, యాక్షన్ చిత్రాలను కూడా తన శైలిలో తీయగలను అంటూ అనిల్ భగవంత్(Anil Ravipudi) కేసరిని సినిమాతో […]

Share:

అనిల్ రావిపూడి(Anil Ravipudi) అంటేనే కామెడీ చిత్రాలు తీసి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. అయితే అతని రూటు మార్చి ఇప్పుడు యాక్షన్ అడ్వెంచర్ లోకి దిగాడు అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ(Balakrishna)తో భగవంత్ కేసరి(Bhagavanth Kesari)తో తను యాక్షన్ సీన్లను కూడా అవలీలగా చిత్రీకరించగలను అంటూ నిరూపించుకోవాలనుకుంటున్నాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). 

అనిల్ రావిపూడి రూట్ మార్చాడా?: 

కామెడీ చిత్రాలు, యాక్షన్ చిత్రాలను కూడా తన శైలిలో తీయగలను అంటూ అనిల్ భగవంత్(Anil Ravipudi) కేసరిని సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) చిత్రీకరించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబు చేత నవ్వులు పూయించి ముఖ్యంగా ట్రైన్ సీన్ తో అందరి అభిమానాన్ని దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం హీరో, హీరోయిన్లు కూడా ట్రెండ్ మార్చి యాక్షన్ చిత్రాలు ఎక్కువగా తీసేందుకు మక్కువ చూపిస్తున్నారు అని గ్రహించిన అనిల్(Anil Ravipudi) తన రూటును కూడా మార్చి, తన వైపు నుంచి యాక్షన్ చిత్రాన్ని తీసి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాడు. వివి వినాయక్, బోయపాటి శ్రీను, వంటి యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో చేరాలని ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. 

భగవంత్ కేసరి ట్రైలర్: 

నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలలో కనిపించే ఎనర్జీ, డాన్స్, డైలాగ్స్, ముఖ్యంగా ఫైట్ సీన్స్ చూసేందుకు చాలామంది మక్కువ చూపిస్తూ ఉంటారు. బాలకృష్ణ(Balakrishna) సినిమాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ వచ్చేసింది. 

ట్రైలర్‌లో చూస్తే, ఈ చిత్రం యాక్షన్-ప్యాక్డ్ రైడ్‌గా ఉండబోతోంది, ఎందుకంటే NBK ఈ సినిమాలో ప్రత్యేకమైన ఫైట్ సీన్స్ ఉండేలా చూసినట్లు తెలుస్తోంది. సినిమాలో విలన్ గా ఉన్న అర్జున్ రాంపాల్ నటుడిని ఎదిరిస్తూ కొన్ని వైలెన్స్ డైలాగ్స్ చెప్తున్నా బాలకృష్ణ(Balakrishna) సన్నివేశాలు ట్రైలర్ లో కనిపించాయి. కాజల్ అగర్వాల్ పాత్ర కేవలం స్టార్‌ని హైప్ చేయడానికి మాత్రమే ప్రోమో వీడియోలో కనిపించినట్లు అనిపిస్తుంది. 

అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల(Srileela) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో హిందీ సినిమాల్లో ప్రధానంగా కనిపించిన అర్జున్ రాంపాల్ టాలీవుడ్ అరంగేట్రం ఇది. రాహుల్ సంఘ్వీ పాత్రలో అర్జున్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం S థమన్ అందించారు. ఈ సినిమా అక్టోబర్ 19 న సినిమాల్లో విడుదల అవుతుంది, రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావుతో తలపడడానికి వచ్చేస్తుంది, టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల అవుతుంది. 

భగవంత్ కేసరిలో ప్రత్యేక ఆకర్షణ శ్రీలీల:

శ్రీలీల(Srileela) పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఆమెకు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల(Srileela) తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గడియారంతో పోటీపడుతూ షూటింగ్స్ లో బిజీగా ఉంది అని చెప్పుకోవాలి. తెలుగు మాట్లాడే అమ్మాయి కావడం కూడా ఆమె కెరీర్‌కు కొంత ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మరియు ఇతరుల కంటే ఎక్కువ సినిమాలు, యంగ్ స్టార్ శ్రీలీల(Srileela) చేతిలో ఉన్నాయి. 

యువ సంచలనం శ్రీలీల(Sreeleela) ఖచ్చితంగా టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె సినిమాలు, రాబోయే ఐదు నెలలలో వరుసగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 15న విడుదల అయిన రామ్ పోతినేని-బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘స్కంద’లో శ్రీలీల(Srileela) కనిపించి అందర్నీ ఆకర్షించింది. ఆమె నందమూరి బాలకృష్ణ(Balakrishna) ‘భగవంత్ కేసరి(Bhagavanth Kesari)’లో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.