షూటింగ్స్‌కి ఏపీ బెస్ట్ అంటున్న ప్రొడ్యూస‌ర్లు

ఒక సినిమా తీయాలంటే అందులో హీరోకి, హీరోయిన్ లకి, సైడ్ యాక్టర్స్ కి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి లొకేషన్ కి ఖర్చు పెట్టేందుకు ప్రొడ్యూసర్లు తమ జేబు కాళీ చేసుకోవాల్సిందే. అయితే తెలంగాణలో షూటింగ్ చేయాలంటే తప్పకుండా 10 నుంచి 35 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటున్నారు ప్రొడ్యూస‌ర్లు.  ఆంధ్రప్రదేశ్ బెస్ట్:  ప్రొడ్యూసర్లు తమ జేబులో నుంచి సుమారు 30 లక్షల వరకు లోకేషన్ ఫీజు కోసం కట్టాల్సి వస్తుంది అంట. తెలంగాణలో […]

Share:

ఒక సినిమా తీయాలంటే అందులో హీరోకి, హీరోయిన్ లకి, సైడ్ యాక్టర్స్ కి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి లొకేషన్ కి ఖర్చు పెట్టేందుకు ప్రొడ్యూసర్లు తమ జేబు కాళీ చేసుకోవాల్సిందే. అయితే తెలంగాణలో షూటింగ్ చేయాలంటే తప్పకుండా 10 నుంచి 35 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటున్నారు ప్రొడ్యూస‌ర్లు. 

ఆంధ్రప్రదేశ్ బెస్ట్: 

ప్రొడ్యూసర్లు తమ జేబులో నుంచి సుమారు 30 లక్షల వరకు లోకేషన్ ఫీజు కోసం కట్టాల్సి వస్తుంది అంట. తెలంగాణలో చాలా ప్రాంతాలలో షూటింగ్ చేయాలంటే ఒక్కో లోకేషన్ కి 15 వేల నుంచి 30 వేల వరకు చార్జ్ చేస్తున్నారు. అందుకే ప్రొడ్యూసర్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపు షూటింగ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ కోసం లొకేషన్ ఫీజు చాలా తక్కువ ఉంటుందని, అందుకే ప్రొడ్యూసర్లు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మొత్తంలో షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

పర్మిషన్స్ కూడా ఈజీ: 

ప్రొడ్యూసర్ తేజ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో షూటింగ్ చేయాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అంతేకాకుండా పర్మిషన్ ఇచ్చేందుకు కొన్ని కొన్ని సార్లు నిరాకరిస్తున్న క్రమం కూడా కనిపిస్తుందని డైరెక్టర్-ప్రొడ్యూసర్ అయిన తేజ మాట్లాడారు. అంతేకాకుండా షూటింగ్ చేసేందుకు అనువైన ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయని, అయితే లొకేషన్ ప్లీజ్ విషయానికి వచ్చినప్పటికీ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం చాలా బెటర్ అని చెప్పుకొచ్చారు తేజ. 

అహింస అనే మూవీ షూటింగ్ కూడా తాము ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు తేజ. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలలో పార్క్స్ లో, ఫ్లైఓవర్, కొన్ని వీధులలో, హాస్పిటల్స్ దగ్గర, డామ్స్ దగ్గర, హైవేస్ దగ్గర షూటింగ్ చేసేందుకు కేవలం వెయ్యి రూపాయల డాక్యుమెంట్ ఛార్జ్ పే చేస్తే చాలని, అందుకే ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్స్ చేయడం సులభమన, అదేవిధంగా ఖర్చు లేని పద్ధతి. తెలంగాణ ప్రాంతాల్లో షూటింగ్ చేయాలంటే సుమారు 15 నుంచి 35 లక్షల వరకు పక్కన పెట్టాలి అని, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేస్తే మన 35 లక్షలు సేవ్ అవుతాయి అంటూ ప్రొడ్యూసర్ తేజ మాట్లాడారు. ఇక చిన్న బడ్జెట్ సినిమాలో అయితే తప్పకుండా ఆంధ్ర ప్రదేశ్ లో తీసుకుంటే డబ్బు చాలా ఆదా అవుతుంది అని చాలామంది ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. 

సెక్యూరిటీ కష్టాలు: 

తెలంగాణలో షూటింగ్ జరిగే ప్రదేశాలలో తమకు షూటింగ్ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పర్మిషన్ అందుకున్నప్పటికీ, అక్కడ ఉండే లోకల్ పోలీస్ వారు సరైన ప్రొటెక్షన్ అందించడంలో ఫెయిల్ అవుతూ ఉంటారని, అంతేకాకుండా షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఆరుగురు కానిస్టేబుల్లు కంపల్సరిగా ఉండాల్సిన ప్లేస్ లో కేవలం ఇద్దరు కానిస్టేబుల్స్ ని పంపిస్తూ ఉంటారని తెలంగాణ రాష్ట్రం గురించి, లోకల్ పోలీసు వారి గురించి మాట్లాడారు ప్రొడ్యూసర్ తేజ. అయితే ఇటువంటి క్రమంలోనే పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్ల లైఫ్ రిస్క్ లో పడేసినట్లు అవుతుందంటూ, ఒకవేళ పెద్ద హీరోలు షూటింగ్ కోసం వచ్చినప్పుడు తమను చూసేందుకు పెద్ద మొత్తంలో జనాలు గుమ్మిగూడినప్పుడు కేవలం ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ లను పంపించడం, తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ విషయంలో ఎంత ఘోరంగా ఉందో చూడొచ్చు అన్నారు తేజ. 

తెలంగాణకు చెందిన నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షూట్ కోసం ఉచితంగా లొకేషన్లు ఇస్తోందని, కాకపోతే వేరే ప్రాంతాల నుంచి, సినిమాలో నటించే నటీనటులను ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లేందుకే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని.. మరోవైపు, చిన్న మరియు మధ్యతరహా సినిమాలు తీసే వారికి కూడా అందుబాటులో ఉండేలా రాష్ట్రంలో లొకేషన్ ఛార్జీలను తగ్గించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని అందరూ కలిసి అభ్యర్థించాలి అంటూ మాట్లాడారు.