బోరున విలపించిన అనసూయ

టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ అనసూయ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అమ్మడు హాట్ నెస్ కు పెట్టింది పేరు. అమ్మడు ఏదైనా పోస్ట్ చేసిందంటే చాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అది మంచికే చెడుకో కానీ వైరల్ కావడం మాత్రం పక్కా. అంతటి గ్రేట్ నెస్ అనసూయ సొంతం. అమ్మడు ఏం చేసినా కానీ నెటిజన్లు మాత్రం తెగ రియాక్ట్ అవుతుంటారు. ఆంటీ అంటూ మొదలైన రచ్చ ఆ మధ్య అనసూయ […]

Share:

టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ అనసూయ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అమ్మడు హాట్ నెస్ కు పెట్టింది పేరు. అమ్మడు ఏదైనా పోస్ట్ చేసిందంటే చాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అది మంచికే చెడుకో కానీ వైరల్ కావడం మాత్రం పక్కా. అంతటి గ్రేట్ నెస్ అనసూయ సొంతం. అమ్మడు ఏం చేసినా కానీ నెటిజన్లు మాత్రం తెగ రియాక్ట్ అవుతుంటారు.

ఆంటీ అంటూ మొదలైన రచ్చ

ఆ మధ్య అనసూయ సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టింది. ఈ పోస్టుకు కొంత మంది ఆకతాయి నెటిజన్లు ఆంటీ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అమ్మడు ఒక్కసారిగా సీరియస్ అయింది. నన్ను ఆంటీ అంటారా అంటూ వారిని గట్టిగా ప్రశ్నించింది. కానీ ఆ వివాదానికి అక్కడితో పుల్ స్టాప్ పడలేదు. అమ్మడు ఏది పోస్ట్ చేసినా కానీ ట్రోల్ చేసే వారు ఎక్కువయ్యారు. ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తూ ఆమెను ఒక ట్రోలింగ్ పీస్ గా మార్చేశారు. అయినా కానీ అమ్మడు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ లు ఇచ్చింది. తనను సోషల్ మీడియాలో కొంత మంది వేధిస్తున్నారంటూ అప్పట్లో ఈ బ్యూటీ కేస్ కూడా ఫైల్ చేసింది. అయినా కానీ ట్రోలర్లు వెనకడుగు వేయలేదు. ఆ విషయంలో కూడా ఆమెను ట్రోల్ చేశారు. దీంతో చేసేదేం లేక ట్రోలింగ్ ను ఈ బ్యూటీ లైట్ తీసుకోవడం మొదలుపెట్టేసింది. 

ఉన్నట్టుండి ఏడ్చేసిన అను

యాంకర్ అనసూయకు ట్రోలింగ్ కొత్త కాదు. ఈ హాట్ యాంకర్ చాలా స్ట్రాంగ్ అని అంతా అనుకున్నారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నా కానీ ఆమెను ట్రోలర్స్ ఆడుకునే వారు. ఇక ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోలు షేర్ చేసినా లేక హాట్ కామెంట్స్ చేసినా పరిస్థితులు ఇంకా వేరేగా ఉండేవి. ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా కానీ అనసూయ మాత్రం వెనక్కు తగ్గలేదు. వారందరికీ గట్టిగా కౌంటర్ ఇస్తూనే తన సోషల్ మీడియా జర్నీని కంటిన్యూ చేసింది. సడెన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ అనసూయ ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాలో ఏడుస్తు్న వీడియోను పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు #ItsOkaytoBeNotOkay అని ఆమె ట్యాగ్ చేశారు. దీంతో అంతా అనుకు ఏమైందో అంటూ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. కానీ కొంత మంది ట్రోలర్స్ మాత్రం కూడా ఈ వీడియోతో కూడా అనసూయను ట్రోల్ చేయడం గమనార్హం. ఈ క్రైయింగ్ వీడియో ను పోస్ట్ చేసిన కొద్ది సేపటి తర్వాత తాను క్షేమంగానే ఉన్నట్లు అనసూయ క్లారిటీ ఇచ్చారు. తన గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని తెలియజేశారు. 

ఎప్పుడూ నవ్వులే కానీ సడెన్ గా ఏమైంది.. 

ఇన్ స్టాలో ఎప్పుడు నవ్వులను గురించి షేర్ చేసే యాంకర్ అనసూయ ఒక్కసారిగా ఏడుస్తూ ఉన్న వీడియోను షేర్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు యాంకర్ అనసూయకు ఏమైందని ఎంక్వైరీలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలా వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తోందని ఆరా తీశారు. 

నేను ఏడిచింది అందుకు కాదు

తర్వాత అనసూయ తన ఏడుపు వీడియో గురించి క్లారిటీ ఇచ్చింది. తాను ఏడ్చింది సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల కాదని క్లారిటీ ఇచ్చింది. అంతే కాక తనను ట్రోల్ చేసిన వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో అనసూయ ఏడుస్తుందని ట్రోల్ చేసినవారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనసూయ రిప్లై చూసి ఖంగుతిన్నారు.