Ananya Panday: అందుకే సోషల్ మీడియాలో ఉండట్లేదు అంటున్న అనన్య

కాఫీ విత్ కరణ్ షోలో, కార్తీక్ గురించి అనన్య..

Courtesy: Twitter

Share:

Ananya Panday: లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అనన్య పాండే (Ananya Panday) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హిట్ కొట్టలేనప్పటికీ, అనన్య పాండే (Ananya Panday)కి మాత్రం ఆఫర్ల వర్షాన్ని కురిపించింది. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియా (Social Media)లో యాక్టివ్ గా ఉండకపోవడానికి గల కారణాలు వెల్లడించింది అనన్య పాండే (Ananya Panday), అవేంటో చూసేద్దాం రండి.

నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది: 

ఎప్పుడు సోషల్ మీడియా (Social Media)లో యాక్టివ్ గా ఉండే అనన్య పాండే (Ananya Panday) ఇటీవల చాలా సార్లు సోషల్ మీడియా (Social Media) పెద్దగా ఉపయోగించట్లేదు కనిపిస్తోంది. అయితే తన పర్సనల్ లైఫ్ మీద నెగెటివిటీ ప్రభావం కారణంగానే తను సోషల్ మీడియా (Social Media)లో యాక్టివ్ గా ఉన్నట్లేనట్లు అనన్య పాండే (Ananya Panday) వెల్లడించింది. సోషల్ మీడియా (Social Media)లో కనిపించే కొన్ని పోస్టుల కారణంగా తనలోని భావోద్వేగాలు ఒక రకంగా మారుతున్నాయని తన పర్సనల్ లైఫ్ మీద నెగెటివిటీ ప్రభావం చాలాగానే చూపిస్తుందంటూ అనన్య పాండే (Ananya Panday) వెల్లడించింది. యువతరం మీద సోషల్ మీడియా (Social Media) ప్రభావం చాలా వరకు కనిపిస్తోందని.. ఇది ఎంతవరకు వెళ్తుందో అర్థం కావట్లేదని కూడా చెప్పుకొచ్చింది అనన్య పాండే (Ananya Panday). అంతేకాకుండా ప్రస్తుతం యువత సోషల్ మీడియా (Social Media)లో ఉంటూ ఎంతగా నెగెటివిటీకి లోనవుతున్నారో కూడా ఆమె గుర్తు చేస్తుంది. అదేవిధంగా, గత సంవత్సరం కృతి సనన్ దీవాలి పార్టీలో, ఆదిత్య రాయితో అనన్య పాండే (Ananya Panday)  కలిసి కనిపించినప్పటి నుంచి వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని ఊహాగానాలు బయటపడుతున్నాయి. అంతేకాకుండా మాల్దీసులో అనన్య పాండే (Ananya Panday) 25వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో కూడా ఆదిత్య కనిపించడం నేటిజనులకు తమ రిలేషన్షిప్ మీద మరిన్ని అపోహలు కలిగించేలా చేశాయి.

కాఫీ విత్ కరణ్ షోలో: 

సారా అలీ ఖాన్ (Sara), కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) మళ్లీ కలిసిపోయారేమో అనే రెడ్డిట్ ప్లాట్ఫారం ద్వారా అనిపించినప్పటికీ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) మాట్లాడిన మాటలు మరోలా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) ఎపిసోడ్‌లో, కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, సారా (Sara) మరియు అనన్య పాండే (Ananya Panday) అతని గురించి చర్చించినందుకు కార్తీక్ నిజానికి కొంచెం అప్సెట్ అయినట్లు కూడా కనిపిస్తోంది.

ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కార్తీక్ తన వ్యక్తిగత జీవితాన్ని గురించి అడగడం అయితే జరిగింది. ముఖ్యంగా కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show)‌లో అతని పేరు ప్రస్తావించడానికి సంబంధించి కార్తిక ఆర్యన్ మాట్లాడాడు. అంతేకాకుండా అతను పరోక్షంగా మీడియా మేత కూడా ఒక రకంగా కోప్పడ్డాడు. తనకు తెలియకుండానే తన వ్యక్తిగత విషయాల్లో హైలెట్ అవడం గురించి మాట్లాడాడు. అంతే కాకుండా తన గురించి కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) షో లో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, తన గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది అని కూడా ప్రస్తావించాడు. 

కరణ్ జోహార్ సారా (Sara) మరియు అనన్య పాండే (Ananya Panday)లను కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) గురించి నేరుగా అడిగారు. వారు ఒకప్పుడు ఒకే వ్యక్తితో డేటింగ్ చేసినందున, ఒకరితో ఒకరు స్నేహంగా ఉండటం సులభం కాదు కదా అని అడిగారు. సారా (Sara) ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుంది, అదేవిధంగా సాధారణంగా డేటింగ్, బ్రేకప్‌ల గురించి మాట్లాడింది. ఏది ఏమైనప్పటికీ తమకి తెలియకుండా తమ గురించి బహిరంగంగా మాట్లాడినందుకు కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరకంగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. 

అనన్య పాండే సినిమాలు: 

అనన్య పాండే (Ananya Panday), సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్‌లతో కలిసి ఖో గయే హమ్ కహాన్‌లో కనిపించనుంది. దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కిస్తున్న సైబర్ క్రైమ్-థ్రిల్లర్ చిత్రంలో కూడా అనన్య పాండే (Ananya Panday) కనిపించనుంది.