అమీ జాక్సన్ కొత్త లుక్.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

అమీ జాక్సన్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తమిళ్ చిత్రం ఏం మాయ చేసావే అదే విధంగా ముఖ్యంగా రోబో వర్షన్ 2. విక్రమ్ సరసన ఐ సినిమాలో నటించి ప్రత్యేకమైన మన్ననలు అందుకుంది. అయితే ప్రస్తుతం నేటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ అమీ జాక్సన్ చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి కారణం ఆమె పోస్ట్..  ఆమె చేసిన పోస్ట్ ఏంటి?:  ఇటీవల, అమీ జాక్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన రీసెంట్ ఫోటోషూట్ లో నుండి తన కొన్ని ఫోటోలను షేర్ […]

Share:

అమీ జాక్సన్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తమిళ్ చిత్రం ఏం మాయ చేసావే అదే విధంగా ముఖ్యంగా రోబో వర్షన్ 2. విక్రమ్ సరసన ఐ సినిమాలో నటించి ప్రత్యేకమైన మన్ననలు అందుకుంది. అయితే ప్రస్తుతం నేటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ అమీ జాక్సన్ చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి కారణం ఆమె పోస్ట్.. 

ఆమె చేసిన పోస్ట్ ఏంటి?: 

ఇటీవల, అమీ జాక్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన రీసెంట్ ఫోటోషూట్ లో నుండి తన కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది, వెంటనే, నెటిజన్లు అమీపై కామెంట్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. నటి భిన్నంగా కనిపించిందని, ఆమెను సిలియన్ మర్ఫీతో పోలుస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అమీని ఎగతాళి చేసిన అనేక ట్రోల్స్, మీమ్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడం ప్రారంభించాయి. ఈ మీమ్‌లలో కొన్ని సరదాగా అనిపించినప్పటికీ, మరికొన్ని అగౌరవంగా ఉన్నాయి. నెటిజన్లు నటిపై అనవసరమైన దూషణలు చేస్తూ ఏడిపించడం మొదలుపెట్టారు. చాలా మంది నెటిజెన్స్ అమీ సిలియన్ మర్ఫీలాగా కనిపిస్తుందని ట్వీట్ చేశారు. అమీ జాక్సన్ ఈ మీమ్‌లపై ఇంకా స్పందించలేదు. అయితే అమీ జాక్సన్ నిజానికి తన మీద వస్తున్న ట్రోల్స్‌పై దృష్టి పెట్టడం మానేసినట్లు కనిపిస్తోంది.

కొందరు నటిపై వ్యక్తిగత కామెంట్స్ కూడా చేశారు. ఫోటో వైరల్‌గా మారడం పట్ల కొందరు ట్వీట్‌లు, తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, మరికొందరు ట్రోలింగ్‌లో చేరారు.

నేటిజన్స్ కామెంట్స్: 

అమీ జాక్సన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి, కొంతమందిని కామెంట్లు చేస్తూ.. అమీ జాక్సన్ నాకే ఇలా కనిపిస్తుందా లేకపోతే ప్రతి ఒక్కరికి అలానే కనిపిస్తోందా? అంటూ కామెంట్ పెట్టాడు.. మరొకరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అమీ జాక్సన్ పిక్చర్ అంటూ, సిలియన్ మర్ఫీ పక్కన అమీ జాక్సన్ ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఏది ఏమైనాప్పటికీ జాక్సన్ ఫోటో గురించి నేటిజన్లు నెగిటివ్గా కామెంట్ చేయడం మాత్రం చాలా మందికి నచ్చట్లేదు. 

అమీ జాక్సన్ సినిమాలు: 

అమీ జాక్సన్ AL విజయ్ మిషన్: చాప్టర్ 1 – అచ్చం ఎన్బతు ఇల్లయాయేతో సినిమాతో తిరిగి వస్తోంది అమీ జాక్సన్. 2010లో వచ్చిన హిస్టారికల్ రొమాన్స్ మద్రాసపట్నం చిత్రానికి దర్శకత్వం వహించిన AL విజయ్ దర్శకత్వం వహిస్తున్నందున, ఈ  సినిమా నిజంగా అమీకి ప్రత్యేకమైనది. మిషన్: చాప్టర్ 1 – అచ్చం ఎన్బతు ఇల్లయాయే సినిమాలో నిజానికి పూర్తి యాక్షన్ అవతార్‌లో అమీని చూపించబోతున్నారు.

ఇంటర్వ్యూలో, నటి తన రాబోతున్న సినిమా గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఆమె మాట్లాడుతూ, నిజానికి ఆ సినిమా స్క్రిప్ట్ చదవగానే స్క్రిప్ట్ తో ప్రేమలో పడ్డానంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇది విజయ్ సినిమా కాబట్టి ఇది తనకి ప్రత్యేకమైన సినిమా అని, అందుకే వెంటనే ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఆయన తన కోసం ఒక మంచి పాత్ర అందిస్తారని ఎప్పుడు కోరుకున్నట్లు చెప్పింది ఆమె. స్క్రిప్ట్ కూడా అదిరిపోయింది అని, ముఖ్యంగా సినిమాలో యాక్షన్‌కి చాలా స్కోప్ ఉంది, అంతేకాకుండా సినిమాలో ముఖ్యంగా నాలుగు ప్రధాన పాత్రల మధ్య కథ తిరుగుతుందని ఆమె పేర్కొంది. అమీ జాక్సన్, సినిమాలు ఎన్నుకోవడంలో ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆచితూచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో అమీ జాక్సన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా కనిపిస్తోంది.