కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో అమీ జాక్స‌న్ వెకేష‌న్

అమీ జాక్సన్ తన బాయ్ఫ్రెండ్తో జంట భారతదేశానికి ఆహ్లాదకరంగా చూడ్డానికి వచ్చినప్పుడు, తన ప్రియుడు ఎడ్ వెస్ట్‌విక్ తో పాటు ఇతర స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలను అమీ జాక్స‌న్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అమీ జాక్సన్ మీకు గుర్తుందా? ఈమె ఒక ఇంగ్లీష్ నటి, మోడల్, కొన్ని ఇండియన్ చిత్రాలలో, ప్రధానంగా తమిళ, హిందీ చిత్రాలలో, హీరోయిన్ గా చేసింది. మాజీ మిస్ టీన్ వరల్డ్ కూడా. ఆమె 2017లో వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ […]

Share:

అమీ జాక్సన్ తన బాయ్ఫ్రెండ్తో జంట భారతదేశానికి ఆహ్లాదకరంగా చూడ్డానికి వచ్చినప్పుడు, తన ప్రియుడు ఎడ్ వెస్ట్‌విక్ తో పాటు ఇతర స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలను అమీ జాక్స‌న్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అమీ జాక్సన్ మీకు గుర్తుందా? ఈమె ఒక ఇంగ్లీష్ నటి, మోడల్, కొన్ని ఇండియన్ చిత్రాలలో, ప్రధానంగా తమిళ, హిందీ చిత్రాలలో, హీరోయిన్ గా చేసింది. మాజీ మిస్ టీన్ వరల్డ్ కూడా. ఆమె 2017లో వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ ప్రొడక్షన్ డిసి కామిక్స్ సూపర్‌గర్ల్‌తో ఇమ్రా ఆర్డీన్ గర్ల్‌గా USలో అరంగేట్రం చేసింది. 

తరువాత (2010)లో “మద్రాసపట్టణం” అనే తమిళ సినిమాలో కనిపించి, (2015)లో యాక్షన్ చిత్రం సింగ్ ఈజ్ బ్లింగ్ లో సారా పాటలో అలరించి, (2018)లో ఏకంగా రజినీకాంత్ చిత్రం రోబో 2.0 లో “నీలా”గా కనిపించింది. 15 సంవత్సరాల వయస్సులో, UKలో తన మోడలింగ్ కెరీర్ని ప్రారంభించి, మన తెలుగు సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కనిపించింది. రామ్ చరణ్ చేసిన “ఎవడు” సినిమా లో కీర్తి ఉండే ఉంటుంది. అందులో ఇంకా శంకర్ దర్శకత్వం లో వచ్చిన విక్రమ్ “ఐ” సినిమాలోనూ కనపడింది. చివరిగా ప్రభుదేవా తమ్మన్న నటించిన హార్రర్ “అభినేత్రి” లో కనిపించింది.

గాసిప్ గర్ల్‌ గురించి కామెంట్స్: 

తరువాత కొద్ది రోజుల క్రితమే అమీ జాక్సన్ ముంబై విమానాశ్రయంలో కనిపించింది. కొంతకాలం తర్వాత ఆమె మన దేశానికి తిరిగి వచ్చింది. అయితే ఈసారి ఈ నటి ఒంటరిగా భారతదేశాన్ని సందర్శించడానికి రాలేదండోయ్, తనకు మరీ కావలసిన వారిలో ఒకరితో కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్శనలో తన బాయ్ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్ ని కూడా ఆమెతో తీసుకు వచ్చింది. వీళ్ళు ఇద్దరు ఇతర స్నేహితులతో భారతదేశ పర్యటన సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది అమీ. ఈ జంటని గేట్‌వే ఆఫ్ ఇండియా ముందు చూడచ్చు. అంతేకాకుండా రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నట్టు కనిపించారు. ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్‌విక్ ఒక హాలీవుడ్ నటుడు, సంగీతకారుడు, గాసిప్ గర్ల్‌లో చక్ బాస్ పాత్రతో పాటు వైట్ గోల్డ్ అనే టీవీ సిరీస్‌లో విన్సెంట్ స్వాన్ పాత్రకు బాగా పేరు తెచ్చుకున్న నటుడు ఇతగాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాక అమీ మరియు ఎడ్ అభిమానుల నుండి, ముఖ్యంగా వారి భారతీయ అభిమానుల నుండి కామెంట్స్ తెగ వస్తున్నాయి. చాలా మంది అభిమానులు తమ కామెంట్స్ లో ఎడ్ నటించిన “గాసిప్ గర్ల్‌”ని ప్రస్తావించారు.

కామెంట్ల వర్షం: 

ఎడ్ భారత దేశానికి వచ్చినందుకు అభిమానులు పొంగిపోయారు. ఒక అభిమాని హాలీవుడ్ నటుడుని చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అతనిని చూడదని చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్ చేసాడు. గాసిప్ గర్ల్ అభిమానులు ఈ సిరీస్‌పై ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఎడ్‌ని గాసిప్ గర్ల్‌లో “చక్ బాస్” అనే పేరుతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మరొ అభిమాని, “చక్ & బ్లెయిర్ టేకోవర్ ఇండియా” అని మరొకరు “ఈ సంవత్సరం నా పుట్టినరోజు థీమ్… గాసిప్ గర్ల్స్ @edwestwick ఇండియాకి రావడమే” అని రాసాడు. ఎడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ప్రస్తుతం తీసుకున్నా ఫొటోస్ పోస్ట్ చేశాడు. ఈ జంట కి ఈ పర్యటన ఆనందంగా తమ అభిమానుల ప్రేమవర్షంలో ఆయిగా విహరించాలని కోరుకుందాం.