అమితా బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా కల్కి అప్డేట్

కల్కీ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి, రీసెంట్గా చిత్ర యూనిట్ సినిమాకి సంభందించి లీగల్ కాపీరైట్ నోటీస్ జారీ చేశారు. ఎందుకంటే చాలామంది కూడా ఇటీవల కాలంలో కాపీరైట్స్ ఉల్లంఘన చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అందుకే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంటే అక్టోబర్ 11న అమితాబచ్చన్ పుట్టినరోజు సందర్భంగా, కల్కి సినిమాలో నటిస్తున్న ఆయన ఫస్ట్ లుక్ రివిల్ చేశారు సినిమా బృందం.  అమితాబచ్చన్ లుక్ రివీల్:  బిగ్ బి అమితాబచ్చన్, […]

Share:

కల్కీ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి, రీసెంట్గా చిత్ర యూనిట్ సినిమాకి సంభందించి లీగల్ కాపీరైట్ నోటీస్ జారీ చేశారు. ఎందుకంటే చాలామంది కూడా ఇటీవల కాలంలో కాపీరైట్స్ ఉల్లంఘన చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అందుకే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంటే అక్టోబర్ 11న అమితాబచ్చన్ పుట్టినరోజు సందర్భంగా, కల్కి సినిమాలో నటిస్తున్న ఆయన ఫస్ట్ లుక్ రివిల్ చేశారు సినిమా బృందం. 

అమితాబచ్చన్ లుక్ రివీల్: 

బిగ్ బి అమితాబచ్చన్, షోలే సినిమా యాక్టర్, తన పుట్టినరోజు సందర్భంగా కల్కి సినిమాలోని అమితాబచ్చన్ పోషిస్తున్న ముఖ్య పాత్ర యొక్క ఫస్ట్ లుక్ రివెంజ్ చేశారో చిత్ర బృందం. కల్కి సినిమాలో గొప్ప యాక్టర్ అయిన అమితాబచ్చన్ నటిస్తున్నందుకు చిత్ర బృందం చాలా సంతోషిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఫోటో షేర్ చేశారు. 

కల్కి సినిమా అప్డేట్స్: 

ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా పేరు కల్కీ, ఈ సినిమాని నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు, ఇందులో దీపికా పదుకొనే కథానాయక. రీసెంట్ గా ఈ సినిమా మేకర్స్ కాపీ రైట్ నోటీస్ జారీ చేశారు. దీని ప్రకారం ఈ సినిమా స్టిల్స్, సీన్స్, మ్యూజిక్, ఫుటేజ్ దేన్ని వాడినా కానీ లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి వాళ్ళు నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఇంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. ఈ సినిమా క్లిప్స్ ని ఎవరు షేర్ చేసినా వాళ్లపై కేసులు పెడతామని వైజయంతి వారు హెచ్చరించారు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది వైజయంతి మూవీసే. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమాను అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని థియేటర్లో ఎవరు షూట్ చేసినా వాళ్ల మీద కేసులు పెడతామని వైజయంతి వాళ్ళు హెచ్చరించారు.

కల్కీ అనే సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ప్రాజెక్టు కే. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబచ్చన్ లాంటి టాప్ స్టార్లు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని సాన్డిగో కామిక్ కాన్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తను ఇంతకుముందు వడా చెన్నై మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు డైలాగులు సాయి మాధవ్ బుర్రా అందించాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది.

అమితా బచ్చన్, ప్రభాస్ తదుపరి చిత్రాలు: 

అమితాబ్ బచ్చన్ తదుపరి చిత్రం గణపత్‌లో కనిపించనున్నారు, ఇందులో టైగర్ ష్రాఫ్ మరియు కృతి సనన్ ప్రధాన పాత్రలలో నటించారు. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా, TJ జ్ఞానవేల్‌తో రజనీకాంత్ రాబోయే చిత్రంలో అమితాబచ్చన్ కూడా ఒక భాగం, ఈ సినిమాకు గాని టెంపరరీగా తలైవర్ 170 అని పేరు పెట్టారు. 

ప్రభాస్ తదుపరిచిత్రం సలార్ పార్ట్ వన్ రిలీజ్ కి రెడీగా ఉంది. దీనికి కే జి ఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇది కాకుండా ప్రభాస్ రాజా డీలక్స్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. రాజా డీలక్స్ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రాజా డీలక్స్ సినిమా హారర్ జానర్ లో వస్తుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ ఇవి కాకుండా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నాడు.