Amitabh Bachchan: కూతురికి కోట్లు విలువ చేసే బంగ్లాను గిఫ్ట్గా ఇచ్చిన అమితాబ్

కూతురికి బిగ్ బీ సూపర్ గిఫ్ట్

Courtesy: Twitter

Share:

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి (Industry) అడుగుపెట్టి.. బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నటనకు వయసుతో సంబంధం లేదని ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నాడు. 80 ఏళ్లు దాటిన వరుస సినిమాలతోపాటు.. రియాల్టీ షోలతో(Reality show) బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి షోకు(Kaun Banega Crorepati Show) హోస్టింగ్ చేస్తున్నారు.

ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అమితాబ్(Amitabh Bachchan).. ఫ్యామిలీకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరికితే కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. కుమారుడు అభిషేక్ బచ్చన్(Amitabh Bachchan), కూతురు శ్వేతా బచ్చన్‌(Shweta Bachchan)  అంటే బిగ్ బీకి(Big B) అమితమైన ప్రేమ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పిల్లల బాగోగులను తనే చూసుకుంటారు. ఇంట్లో జరిగే ప్రతి వేడుకను తన కూతురు, కుమారుడుతో కలిసి జరుపుకుంటారు. అయితే తాజాగా అమితాబ్(Amitabh Bachchan) తన కూతురికి కోట్లు విలువ చేసే భవనాన్ని బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.

కొడుకుతో పాటు కూతురు శ్వేతా బచ్చన్‌పై కూడా అమితాబ్‌కి(Amitabh Bachchan) ఎనలేని ప్రేమ. పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా.. ఇప్పటికీ ఆమెకు ఆర్థికంగా ఆదుకుంటూనే ఉంటాడు. తాజాగా తన కూతురుకి ఖరీదైన బహుమతిని అందించి, తండ్రి ప్రేమను చాటుకున్నాడు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లా ‘ప్రతీక్ష’ను(Prathiksha) కూతురు శ్వేతా బచ్చన్‌కు(Shweta Bachchan) గిఫ్ట్‌గా అందించారు. దీని విలువల దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 

ముంబైలోని అత్యంత ఖరీదైన జై జుహు ప్రాంతంలో గల బంగ్లా పేరు ప్రతీక్ష(Prathiksha). ఇక, ముంబయిలోని పలు ప్రాంతాల్లో అమితాబ్‌ బచ్చన్‌కు(Amitabh Bachchan) మూడు బంగ్లాలు ఉన్నాయి. అమితాబ్ నటుడిగా తెరంగేట్రం చేసిన రోజుల్లో తల్లిదండ్రులతో కలిసి జూహులో ఉన్న ప్రతీక్షా (Prathiksha)బంగ్లాలోనే ఉన్నారు. దీని గురించి గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ప్రతీక్షా బంగ్లా అంటే మాకు ఎంతో ఇష్టం. ఆ ఇంటితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ ఇంటికి పేరు పెట్టింది మా నాన్నే. ఆయన రచనల్లోనూ మా ఇంటి పేరుని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి’’ అని అన్నారు. ఇదే నివాసంలో ఐశ్వర్యరాయ్‌ - అభిషేక్‌ బచ్చన్‌(Aishwarya Rai - Abhishek Bachchan) వివాహం జరిగింది. 

ఈ ప్రతీక్ష భవనంలో రెండు ప్లాట్స్ ఉండగా..ఒకటి 890.47 చదరపు మీటర్లు కాగా..మరొకటి 674 చదరపు మీటర్లు. ఉందని సమాచారం. అమితాబ్ తన కుమార్తెకు బహుమతిగా నవంబర్ 9 న ఈ బంగ్లాను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్..టాక్ ఆఫ్ ది బాలీవుడ్గా మారింది. అంతేకాదు..ఇదే బంగ్లాలో 2007 లో బిగ్ బి కుమారుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) మ్యారేజ్ జరిగింది. ప్రస్తుతం అమితాబ్‌ ఫ్యామిలీ జుహులో ఉన్న జల్సా బంగ్లాలో నివసిస్తోంది.

ఇదే కాకుండా అమితాబ్ కుటుంబానికి జల్సా, జనక్ (Jalsa, Janak) అనే భవనాలు ఉన్నాయి. ఈ రెండు ఇళ్ల విలువ కోట్లలో ఉంది. బిగ్ బికి ఇష్టమైన జల్సా ఇల్లు జుహులోని జెడబ్ల్యు మారియట్ సమీపంలోని రెండు అంతస్తుల ఆస్తి. దీని విలువ రూ.100-120 కోట్లు ఉంటుందని సమాచారం. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), జయ బచ్చన్ వివాహం 1973లో వివాహం చేసుకున్నారు. వీరికి శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్. శ్వేతా బచ్చన్ నిఖిల్ నందాను పెళ్లాడగా, ఐశ్వర్యరాయ్‌ని అభిషేక్ బచ్చన్‌గా వివాహం చేసుకున్నారు.