మోదీకి మద్దతుగా నిలిచిన కంగనా

ఇటీవల నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కంగనా రనౌత్ ఈ వీడియోపై స్పందించింది, సోషల్ మీడియాలో ఒక యూజర్ అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసిన వీడియో ప్రకారం, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాని మోదీని ఎగతాళి చేస్తున్నట్లు కనిపిస్తుంది.  దీటుగా స్పందించిన కంగనా:  కంగనా రనౌత్ మంగళవారం ట్విటర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచారు. టోస్టింగ్ చేసేటప్పుడు పెగ్ పట్టుకోవడం ఎలాగో తెలియక ఆయనను […]

Share:

ఇటీవల నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కంగనా రనౌత్ ఈ వీడియోపై స్పందించింది, సోషల్ మీడియాలో ఒక యూజర్ అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసిన వీడియో ప్రకారం, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాని మోదీని ఎగతాళి చేస్తున్నట్లు కనిపిస్తుంది. 

దీటుగా స్పందించిన కంగనా: 

కంగనా రనౌత్ మంగళవారం ట్విటర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచారు. టోస్టింగ్ చేసేటప్పుడు పెగ్ పట్టుకోవడం ఎలాగో తెలియక ఆయనను అవమానించిన వారిపై నిందించారు. ఇటీవల జరిగిన సమావేశంలో అమెరికా ప్రెసిడెంట్ ఏమి మాట్లాడుతున్నారో అర్థంకాక ప్రధాని మోదీ నవ్వారని ట్విట్టర్ లో కొంతమంది అవమానకరంగా మాట్లాడటంపై కంగనా తనదైన శైలిలో ప్రధాన మంత్రికి మద్దతుగా నిలిచారు.

కలియుగం నిజంగా ఒక మంచి మనిషి తలపై నాట్యం చేస్తుందని, అసలు మాంసాహారం ముట్టని వారు, ఎప్పుడూ ధూమపానం చేయని, మద్యం తీసుకొని వారు, అంత మంచి మనిషి పెగ్ పట్టుకుని తన చేతితో చూపించడం తెలియక అవమానానికి గురయ్యారని.. కంగనా మండిపడింది. అంతేకాకుండా, నిజానికి మద్యం మానవ వ్యవస్థకు హాని కలిగిస్తుందని వైద్యపరంగా/శాస్త్రీయంగా అన్ని విధాలుగా నిరూపించబడిందని.. కానీ ఇప్పుడు ఆ మద్యం కారణంగా మన ప్రధానమంత్రి ఎందుకు అవమానానికి గురవ్వాలి అని.. ఎందుకు ఆయన పట్ల హేళనగా ప్రవర్తిస్తున్నారని.. మన ప్రధాని తన అభిరుచులకు, ప్రమాణాలకు కింద ఉన్న విషయాల గురించి ఎందుకు బాధపడాలని కంగనా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థంకాక ప్రధాని మోదీ నవ్వుతున్నారని పేర్కొంటూ ఒక ఈవెంట్‌లోని చిన్న వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో కొందరు షేర్ చేసిన తర్వాత కంగనా ట్వీట్ బయటకి వచ్చింది. 

వైరల్ గా మారిన మోదీ వీడియో: 

ప్రస్తుతం వైరల్ గా మారినా మోదీ, జోబిడెన్ వీడియో చూసి చాలామంది హేళనగా కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ప్రతి ఈవెంట్ లో కూడా మన భారత ప్రధాన మంత్రి ఎందుకు నవ్వుతున్నారో తెలియట్లేదని, అయితే వారి భాష అర్థం కాక ఏం మాట్లాడాలో తెలియక నవ్వుతున్నారని కొంతమంది హేళనగా మాట్లాడారు, అయితే వీడియోలో చూపించిన విధంగా భారత దేశ ప్రధానమంత్రి మోదీని ఎడమ చేతితో మద్యం ఉన్న గ్లాస్ ను అందరి వైపు చూపించమని కోరగా, ప్రధానమంత్రి కి ఏం చేయాలో అర్థం కాక నవ్వుతున్నారని, అయితే అది గమనించిన అమెరికా అధ్యక్షుడు ఏం చేయాలో మరొకసారి వివరించగా, మోదీ నవ్వడాన్ని చూసి, తను జోక్ చేయట్లేదు నిజంగానే ఏం చేయాలో చెప్తున్నానని మరొకసారి జో బిడెన్ మాట్లాడడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది నరేంద్ర మోదీని హేళన చేస్తూ కామెంట్లు కూడా పెట్టారు. 

మోదీకి చాలాసార్లు మద్దతు తెలిపిన కంగనా: 

ఈ వీడియో విషయంలోనే కాకుండా, ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ చాలా మంది కామెంట్స్ చేయడాన్ని తిప్పి కొట్టారు కంగనా. అంతేకాకుండా మన దేశ ప్రధానమంత్రి నిజానికి భూ మండలం మీదే గర్వించదగ్గ మనిషి అంటూ కంగనా నరేంద్ర మోదీ పుట్టిన రోజు నాడు పోస్ట్ పెట్టారు. గత ఏడాది సెప్టెంబర్ 17న మోదీ 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మోదీ కంగనా ఇద్దరూ కనిపిస్తున్న ఒక ఫోటో షేర్ చేస్తూ, ఆమె మోదీని పొగుడుతూ సోషల్ మీడియాలో రాసుకోవచ్చారు.