నన్ను చూసి చాలామంది ఈర్ష్య పడుతున్నారు: అమీషా పటేల్

అమీషా పటేల్ ఇటు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఒక కథానాయకి. కహో నా ప్యార్ హై, బద్రి, ఇలా ఎన్నో సినిమాల్లో మనల్ని అలరించింది. అయితే ఇప్పుడు అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.  అమీషా పటేల్ ఏమంటుంది:  అప్పట్లో 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ సరసన నటించిన అమీషా పటేల్ తరువాత చాలా సూపర్ హిట్ మూవీస్ లో కూడా నటించింది. అయితే […]

Share:

అమీషా పటేల్ ఇటు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఒక కథానాయకి. కహో నా ప్యార్ హై, బద్రి, ఇలా ఎన్నో సినిమాల్లో మనల్ని అలరించింది. అయితే ఇప్పుడు అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. 

అమీషా పటేల్ ఏమంటుంది: 

అప్పట్లో 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ సరసన నటించిన అమీషా పటేల్ తరువాత చాలా సూపర్ హిట్ మూవీస్ లో కూడా నటించింది. అయితే తనతో పాటు హీరోయిన్ల గా అప్పటప్పుడే ఎదుకుతున్న కరీనాకపూర్, అభిషేక్ బచ్చన్, ఈషా ఇలా ఎంతోమంది, తనకు వస్తున్న స్టార్ డం చూసి సహించలేకపోయారని ఇటీవల తను ప్రస్తావించారు. అంతేకాకుండా తను ఎదుగుతున్న విధానాన్ని చూసి చాలామంది ఈర్షతో తన సినిమాలో కూడా లాక్కున్నారని చెప్పుకొచ్చింది అమీషా పటేల్. 

ఇంటర్వ్యూలో బయటపడిన నిజం: 

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అమీషా తనను “స్నోబ్” అని పిలిచేవారట, ఎందుకంటే సెట్‌లో ఆమె ఇతరుల మీద విమర్శించేది కాదు. అంతేకాకుండా సైలెంట్ గా ఉండడం వల్ల ఆమెను అలా పిలిచేవారట. ఆమె మాట్లాడుతూ, “నేను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు, నాతో పాటు సినీ నటుల పిల్లలు లేదా నిర్మాతల పిల్లలు మాత్రమే అప్పట్లో ఎదుగుతూ ఉన్నారు, అందులో కొంతమంది కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, తుషార్ కపూర్, ఈషా డియోల్, ఫర్దీన్ ఖాన్, ఇంకా తదితరులు. నిజానికి వారు అందరికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే. అయితే నాకు ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. అదే విధంగా నేను ఎదుగుతున్న క్రమంలో చాలామంది నన్ను తొక్కేయాలని చూసారు. అంతేకాకుండా చాలామంది నన్ను స్నోబ్ అని పిలిచేవారు ఎందుకంటే నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. నాకు చదువుకోవడం అలవాటు కాబట్టి నేను సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడకుండా చదువుకునేదాన్ని.” 

దీనిపై అమీషా మాట్లాడుతూ, “తర్వాత విజయం తర్వాత విజయాన్ని చూడడం, హృతిక్ మరియు నేనూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవడం చూసి, గదర్ రావడం, ఆపై బద్రీ రావడం… అది తెలుగు, తమిళం, హిందీ లో కూడా హిట్ అయిపోవడం. దేవుడు దయగలవాడు, నాకు గాడ్‌ఫాదర్ లేడని ఆయనకు తెలుసు కాబట్టి అతను నాకు విజయవంతమైన చిత్రాలను ఇచ్చాడు. అయితే చాలా మంది ఇదంతా చూసి అసూయపడ్డారు అంతేకాదు నా నుంచి సినిమాలు కూడా చాలా లాక్కున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ సినిమా నేను సైన్ చేసినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాలో నేను నటించట్లేదని వేరే వారు నా ప్లేస్ లో తీసుకున్నట్లు నాకు తెలిసింది తర్వాత నుంచి మెల్లమెల్లగా సినిమాలన్నీ వాళ్లకే వెళ్లిపోయాయి.” 

“కానీ ఈ విషయాలన్నీ అప్పట్లో ఎవరికీ తెలిసేది కాదు ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పట్లో లేదు కదా. ఇప్పుడు సెట్స్ లో ఏం జరుగుతుందో ఏమిటో కూడా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా, ఇక్కడ ఏం జరిగినా అందరికీ తెలుస్తుంది.” అంటూ ఆమె చాలా విషయాలు పంచుకున్నారు.