ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌పై ఫైర్ అయిన అమీషా ప‌టేల్

గ‌ద్ద‌ర్‌ 2 ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, కనీసం ఆ ప్రొడక్షన్ లో పని చేస్తున్న టెక్నీషియన్స్ కూడా పే చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా మంది అందులో పని చేస్తున్న వాళ్ళని పట్టే పట్టించుకోలేదు. చాలా వరకు ఫుడ్ ఆర్డర్ చేసిన బిల్స్ కూడా పే చేయలేదు అంటూ అమిషా పటేల్, అనిల్ శర్మ ప్రొడక్షన్స్ మీద ఫైర్ అయ్యారు. ట్విట్టర్లో వెల్లడి:  ట్విట్టర్ వేదికగా అమీషా పటేల్ అనిల్ శర్మ ప్రొడక్షన్స్ మీద తన ఫైర్ చూపించారు. […]

Share:

గ‌ద్ద‌ర్‌ 2 ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, కనీసం ఆ ప్రొడక్షన్ లో పని చేస్తున్న టెక్నీషియన్స్ కూడా పే చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా మంది అందులో పని చేస్తున్న వాళ్ళని పట్టే పట్టించుకోలేదు. చాలా వరకు ఫుడ్ ఆర్డర్ చేసిన బిల్స్ కూడా పే చేయలేదు అంటూ అమిషా పటేల్, అనిల్ శర్మ ప్రొడక్షన్స్ మీద ఫైర్ అయ్యారు.

ట్విట్టర్లో వెల్లడి: 

ట్విట్టర్ వేదికగా అమీషా పటేల్ అనిల్ శర్మ ప్రొడక్షన్స్ మీద తన ఫైర్ చూపించారు. నిజానికి గ‌ద్ద‌ర్‌ 2 ప్రొడక్షన్ జరిగే సమయంలో అసలు అందులో పని చేసే వారికి కనీస వసతులు కల్పించలేదని, పనిచేస్తున్న టెక్నీషియన్స్ కి కనీసం పే కూడా చేయలేదు. అయితే వెంటనే జీ స్టూడియోస్ వారు బరిలోకి దిగి, గ‌ద్ద‌ర్‌ 2 ప్రొడక్షన్ కి సంబంధించి పెండింగ్ ఉన్న బిల్స్ పే చేసినట్లు అమీషా పటేల్ చెప్పారు.

గ‌ద్ద‌ర్‌ 2:

నటి అమీషా పటేల్ గ‌ద్ద‌ర్‌ 2లో సకీనా పాత్ర నటిస్తున్నట్లు ఇప్పటికే తెలుసు, సన్నీ డియోల్ తారా సింగ్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అభిమానుల కోసం చిన్న క్లూ రిలీజ్ చేశారు. అయితే మూవీ ప్రొడక్షన్ సమయంలో సెట్ లో జరిగిన పద్ధతుల గురించి అమీషా పటేల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎవరిని పట్టించుకోని అనిల్ శర్మ ప్రొడక్షన్ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు అమీషా పటేల్. తర్వాత జీ స్టూడియోస్‌లో అడుగుపెట్టి, టీమ్‌కి సంబంధించిన విషయాలను మళ్లీ తిరిగి నార్మల్ స్టేజ్ కి తీసుకువచ్చినందుకు జి స్టూడియోస్ వారికి థాంక్స్ చెప్పారు అమీషా పటేల్.

అయితే గ‌ద్ద‌ర్‌ 2 షూటింగ్ సమయంలో కూడా చాలామందిని పట్టించుకోలేదు. అసలు ప్రొడక్షన్ కి సంబంధించి టెక్నీషియన్స్ కు బిల్ పే చేయలేదు. చాలామంది క్రూ మెంబెర్స్ కి పూర్తిగా నిరాశకి గురయ్యారు. ముఖ్యంగా ఫుడ్ అలాగే ఇతర విషయాలకు సంబంధించిన బిల్స్ కూడా పే చేయలేదు. మూవీలో యాక్ట్ చేస్తున్నా నటీనటులకు టైం కి కార్లు పంపించడంలో కూడా ప్రొడక్షన్ టీం పూర్తిగా ఫెయిల్ అయిందని అమీషా పటేల్ లో పేర్కొన్నారు. 

జి స్టూడియోస్ కి థాంక్స్: 

అనిల్ శర్మ ప్రొడక్షన్ సంబంధించి చాలా అవకతవకలు జరిగాయి. నిజానికి ప్రొడక్షన్ లో మంచి విషయాలు అనేవి కనిపించలేదు. చాలామంది గ్రూప్ మెంబర్స్ ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాకుండా టెక్నీషియన్స్కి పే కూడా చేయలేదు. తర్వాత ఈ విషయంలో జి స్టూడియోస్ వారు కలగజేసుకొని ప్రొడక్షన్స్ లో జరిగిన అవకతవకలను మళ్లీ సరి చేయడం జరిగింది. అందుకే, అమీషా పటేల్ ప్రొడక్షన్ టీం అసమర్ధతను బయట పెట్టేందుకు తను ట్విట్టర్ వేదికగా చేసుకుంది. అంతేకాకుండా అన్నిటిని సరి చేస్తున్న జి స్టూడియోస్ వారికి ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పుకున్నారు అమీషా పటేల్.

గ‌ద్ద‌ర్‌ 2 అనేది 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథా చిత్రానికి సీక్వెల్. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్ మరియు లవ్ సిన్హా కూడా ఉన్నారు. గ‌ద్ద‌ర్‌ 2కి పోటీగా వస్తున్న మరో సినిమా అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2.