Amala Paul Wedding: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలాపాల్..

Amala Paul Wedding: హీరోయిన్ అమలా పాల్(Amala Paul) వివాహం గ్రాండ్‍గా జరిగింది. బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‍(Jagat Desai)ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ – జగత్ వివాహం (నవంబర్ 5) కొచ్చిలో జరిగింది. ఇండస్ట్రీలో ఇటీవల చాలా మంది పెళ్లి చేసుకుంటారు. అలాగే కొందరు హీరోయిన్లు రెండో పెళ్లి(Second Marriage) కూడా చేసుకోవడం సర్వ సాధారణంగా మారింది. అయితే స్టార్ హీరోయిన్ అమలా పాల్(Amala Paul)  అదే లిస్టులోకి చేరిపోయింది. ఈ అమ్మడుకి ఇది […]

Share:

Amala Paul Wedding: హీరోయిన్ అమలా పాల్(Amala Paul) వివాహం గ్రాండ్‍గా జరిగింది. బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‍(Jagat Desai)ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ – జగత్ వివాహం (నవంబర్ 5) కొచ్చిలో జరిగింది.

ఇండస్ట్రీలో ఇటీవల చాలా మంది పెళ్లి చేసుకుంటారు. అలాగే కొందరు హీరోయిన్లు రెండో పెళ్లి(Second Marriage) కూడా చేసుకోవడం సర్వ సాధారణంగా మారింది. అయితే స్టార్ హీరోయిన్ అమలా పాల్(Amala Paul)  అదే లిస్టులోకి చేరిపోయింది. ఈ అమ్మడుకి ఇది వరకే పెళ్లి జరిగింది. భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిందని సమాచారం. ఇటీవల జగత్ దేశాయ్‌లో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే, పది రోజుల కిందట అమలాపాల్(Amala Paul)  పుట్టిన రోజున ఆమెకు ప్రపోజ్ చేశారు జగత్ దేశాయ్. ఈ ప్రపోజల్‍కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్(Viral) అయింది. జగత్‍కు అమలా ఓకే చెప్పారు. దీంతో వారి ఎంగేజ్‍మెంట్ జరిగింది. నేడు కొచ్చిలో అమలా పాల్ – జగత్ దేశాయ్ వివాహం జరిగింది. క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం(Christian traditions) వీరి పెళ్లి జరిగింది. జగత్‍ దేశాయ్‍తో తన వివాహానికి సంబంధించిన ఫొటోలను అమలాపాల్ ఇన్‍స్టాగ్రామ్‍(Instagram)లో పోస్ట్ చేశారు. లావెండర్ కలర్ డ్రెస్‍లను వధూవరులు ఇద్దరూ ధరించారు. టాప్, స్కర్ట్.. వాటికి మ్యాచ్ అయ్యే నెక్లెస్‍ను అమలా పాల్ ధరించారు. వైట్ డిజైనర్ కుర్తా పైజామాపై లావెండర్ దుపట్టాను జగత్ వేసుకున్నారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకున్న ఫొటోను అమలాపాల్ షేర్ చేశారు.

చాలా సంతోషంగా పెళ్లి వేడుక తర్వాత మెట్లు దిగుతున్న మరో ఫొటోను కూడా పోస్ట్ చేశారు అమలా. “మమ్మల్ని ఒకటి చేసిన ప్రేమను సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. నా దివ్యమైన పురుషుడిని వివాహం చేసుకున్నా. మీ ప్రేమ, ఆశీర్వాదాలను కోరుతున్నా” అని అమలా పాల్ రాసుకొచ్చారు. తమ పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను జగత్ దేశాయ్ కూడా షేర్ చేశారు. “రెండు హృదయాలు, ఒక విధి.. నా అద్భుతమైన అమ్మాయితో మిగిలిన జీవితమంతా చేతిలో చెయ్యేసి నడుస్తా” అని రాసుకొచ్చారు. ఈ ఫొటోల్లో అమలాపాల్‍ – జగత్ దేశాయ్ జంట అద్భుతంగా మెరిసింది.

రెండో పెళ్లి..

కథానాయికగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన మూడు సంవత్సరాలకు అమలా పాల్(Amala Paul) వివాహం చేసుకున్నారు. విక్రమ్ ‘నాన్న'(Nanna) (తమిళంలో ‘దైవ తిరుమగల్’)లో ఆమె నటించారు. ఆ సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు దర్శకుడు ఏఎల్ విజయ్(AL Vijay), అమలా పాల్ ప్రేమలో పడ్డారు. వాళ్లిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే… మూడేళ్లకు విడాకులు తీసుకున్నారు. సినిమాల్లో నటించవద్దని అత్తమామలు కండిషన్స్ పెట్టడంతో ఏఎల్ విజయ్ నుంచి అమలా పాల్(Amala Paul) విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అమలా పాల్ రెండో వివాహాం మీద ఎన్నెన్నో రూమర్లు, ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ మధ్య రెండో వివాహాం అంటూ కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. అదో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. 

దర్శకుడు విజయ్‌తో వివాహాం, విడాకుల తరువాత ఒంటరిగానే ఉంటూ వచ్చింది. మధ్యలో పంజాబి సింగర్‌తో రిలేషన్ అంటూ రూమర్లు వచ్చాయి. ఇద్దరికీ పెళ్లి అయిపోయిందంటూ ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ ఓ ప్రకటన కోసం చేసిన ఫోటో షూట్ అని ఆ తరువాత మళ్లీ వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలన్నీ కూడా అమల్ పాల్, సదరు సింగర్ ఖాతాల నుంచి మాయం అయిపోయాయి. ఆ తరువాత సింగర్‌తో అమల్ పాల్ రిలేషన్ చెడిందని, అందుకే ఫోటోలన్నీ మాయం అయ్యాయనే రూమర్లు వచ్చాయి. 

వైవాహిక బంధం నుంచి వైదొలిగిన తర్వాత అమలా పాల్ మరో పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఓ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన మమ్ముట్టి ‘క్రిస్టోఫర్'(christopher)లో అమలా పాల్ నటించారు. హిందీలో అజయ్ దేవగణ్ ‘భోళా'(Bhola) (కార్తీ ఖైదీ రీమేక్)లో ప్రత్యేక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం రెండు మలయాళ సినిమాల్లో అమలా పాల్ నటిస్తున్నారు.