Amala Paul: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌..

హీరోయిన్ అమ‌లాపాల్(Amala Paul) త్వ‌ర‌లోనే ప్రియుడు జ‌గ‌త్ దేశాయ్‌(Jagat Desai)తో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ది. అమ‌లాపాల్‌కు జ‌గ‌త్ దేశాయ్ సినిమా స్టైల్‌లో ప్ర‌పోజ్ చేశాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్(Viral) అవుతోంది.  తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ భామ అమలా పాల్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘బెజవాడ'(Bejawada) సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆమె పరిచయం అయ్యారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘నాయక్’,(Nayak) ఐకాన్ స్టార్ అల్లు […]

Share:

హీరోయిన్ అమ‌లాపాల్(Amala Paul) త్వ‌ర‌లోనే ప్రియుడు జ‌గ‌త్ దేశాయ్‌(Jagat Desai)తో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ది. అమ‌లాపాల్‌కు జ‌గ‌త్ దేశాయ్ సినిమా స్టైల్‌లో ప్ర‌పోజ్ చేశాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్(Viral) అవుతోంది. 

తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ భామ అమలా పాల్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘బెజవాడ'(Bejawada) సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆమె పరిచయం అయ్యారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘నాయక్’,(Nayak) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో'(Iddarammayilatho) చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఇప్పుడీ అందాల భామ ప్రస్తావన ఎందుకు అంటే… రెండో పెళ్లికి ఆమె రెడీ అయ్యారు. 

అమలా పాల్ బర్త్ డే సందర్భంగా ఒక పబ్బులో సెలబ్రేట్ చేసిన జగత్ దేశాయ్ (Jagat Desai)… ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచారు. అందుకు అమలా పాల్ సంతోషంగా ఓకే చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు జగత్ దేశాయ్. ”నా రాణి ‘ఎస్’ చెప్పింది. పెళ్లి గంటలు మోగుతున్నాయి. హ్యాపీ బర్త్ డే మై లవ్” అని ఆయన పేర్కొన్నారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. 2009లో వచ్చిన మలయాళ చిత్రం నీలతామరతో అమలాపాల్‌(Amala paul) సినీ కెరీర్‌ మొదలయ్యింది. 2010లో వచ్చిన తమిళ సినిమా మైనాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంది.

జగత్ దేశాయ్ ఎవరు?

ఎవరీ జగత్ దేశాయ్? (Jagat Desai)అమలను పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం అయ్యింది. అతడి గురించి ఆరాలు తీయడం మొదలు పెట్టారు. జగత్ దేశాయ్ ప్రొఫైల్ చూస్తే… సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తిగా కనిపించడం లేదు. అమలా పాల్ ఫోటో తప్ప గతంలో పరిశ్రమ ప్రముఖుల ఫోటోలు ఏవీ లేవు. అయితే… తొమ్మిది వారాల క్రితం అమలాతో సన్నిహితంగా దిగిన ఫోటో షేర్ చేసిన జగత్ దేశాయ్… లవ్ సింబల్ ఎమోజీ జోడించారు. వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితమే ప్రేమ చిగురించినట్లు అర్థం అవుతోంది. 

మూడేళ్ళకు విజయ్, అమలా పాల్ విడాకులు

కథానాయికగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన మూడు సంవత్సరాలకు అమలా పాల్(Amala Paul) వివాహం చేసుకున్నారు. విక్రమ్ ‘నాన్న’ (తమిళంలో ‘దైవ తిరుమగల్’)లో ఆమె నటించారు. ఆ సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు దర్శకుడు ఏఎల్ విజయ్(AL Vijay), అమలా పాల్ ప్రేమలో పడ్డారు. వాళ్లిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే… మూడేళ్లకు విడాకులు తీసుకున్నారు. సినిమాల్లో నటించవద్దని అత్తమామలు కండిషన్స్ పెట్టడంతో ఏఎల్ విజయ్ నుంచి అమలా పాల్ విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. 

అమలా పాల్ రెండో వివాహాం మీద ఎన్నెన్నో రూమర్లు, ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ మధ్య రెండో వివాహాం అంటూ కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. అదో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. బోల్డ్ బ్యూటీ అమలా పాల్(Amala paul) ప్రస్తుతం సింగిల్‌గానే ఉంది. దర్శకుడు విజయ్‌తో వివాహాం, విడాకుల తరువాత ఒంటరిగానే ఉంటూ వచ్చింది. మధ్యలో పంజాబి సింగర్‌తో రిలేషన్ అంటూ రూమర్లు వచ్చాయి. ఇద్దరికీ పెళ్లి అయిపోయిందంటూ ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ ఓ ప్రకటన కోసం చేసిన ఫోటో షూట్ అని ఆ తరువాత మళ్లీ వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలన్నీ కూడా అమల్ పాల్, సదరు సింగర్ ఖాతాల నుంచి మాయం అయిపోయాయి. ఆ తరువాత సింగర్‌తో అమల్ పాల్ రిలేషన్ చెడిందని, అందుకే ఫోటోలన్నీ మాయం అయ్యాయనే రూమర్లు వచ్చాయి.

వైవాహిక బంధం నుంచి వైదొలిగిన తర్వాత అమలా పాల్ మరో పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఓ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన మమ్ముట్టి ‘క్రిస్టోఫర్'(christopher)లో అమలా పాల్ నటించారు. హిందీలో అజయ్ దేవగణ్ ‘భోళా'(Bhola) (కార్తీ ఖైదీ రీమేక్)లో ప్రత్యేక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం రెండు మలయాళ సినిమాల్లో అమలా పాల్ నటిస్తున్నారు.