అల్లు అర్జున్‌ డైలీ రోటిన్‌ ఇదే

దేశంలోని ఫస్ట్ ఇండియన్ యాక్టర్‌‌ను ఇన్‌స్టాగ్రామ్‌ టీమ్‌ వీడియో ఇంటర్వ్యూ చేసింది. అది ఎవరో కాదు ఐకాన్‌ స్టార్‌‌ అల్లు అర్జున్. తన డైలీ రోటిన్‌ గురించి ఈ వీడియోలో చూపించారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు.  ఐకాన్‌ స్టార్‌‌ అల్లు అర్జున్‌ తన ఫ్యాన్స్ కోసం అదిరియే సర్‌‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన డైలీ రోటిన్‌ గురించి ఓ వీడియో షూట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు. అందులో పుష్ప2 సినిమా లోకేషన్ కూడా చూపించారు. […]

Share:

దేశంలోని ఫస్ట్ ఇండియన్ యాక్టర్‌‌ను ఇన్‌స్టాగ్రామ్‌ టీమ్‌ వీడియో ఇంటర్వ్యూ చేసింది. అది ఎవరో కాదు ఐకాన్‌ స్టార్‌‌ అల్లు అర్జున్. తన డైలీ రోటిన్‌ గురించి ఈ వీడియోలో చూపించారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. 

ఐకాన్‌ స్టార్‌‌ అల్లు అర్జున్‌ తన ఫ్యాన్స్ కోసం అదిరియే సర్‌‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన డైలీ రోటిన్‌ గురించి ఓ వీడియో షూట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు. అందులో పుష్ప2 సినిమా లోకేషన్ కూడా చూపించారు. ఈ వీడియో షూట్‌ చేసింది ఇన్‌స్టా గ్రామ్‌ టీమ్‌. అలాగే, ప్రపంచంలోనే అత్యధికంగా వాడే ఇన్‌స్టాగ్రామ్‌.. తన @instaram అకౌంట్‌లో అల్లు అర్జున్‌ డైలీ రోటిన్‌ వీడియోను పంచుకుంది. కారులో ఇంటి నుంచి తన ఆఫీసుకు, అక్కడి నుంచి షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లే వరకు ఉన్న వీడియోలో ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌ స్పాట్‌కు కూడా ఇన్‌స్టా టీమ్‌ను తీసుకెళ్లాడు. 

అభిమానుల ప్రేమను వివరించడ కష్టం..

‘‘ఇతర దేశాల్లో కంటే ఇండియాలో అభిమానులు చాలా భిన్నంగా ఉంటారు. వాళ్ల పరేమను వివరించడం కష్టం. పుష్ప2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నా కోసం ఎంతో మంది అభిమానులు వచ్చారు. వీళ్ల ప్రేమ నన్ను సరిహద్దులను అధిగమించేలా చేస్తోంది. నన్ను చూసి వాళ్లు గర్వపడేలా ఉంటాను. పుష్ప2 నా 20వ సినిమా. ఇందులో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే అది ‘పుష్పరాజ్‌’ పాత్రే. అతడు దేనికీ వెనకడుగు వేయడు” అని అల్లు అర్జున్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇందులో సుకుమార్‌‌ వాయిస్‌ కూడా వినిపించింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో నుంచి స్క్రిప్ట్‌ పేపర్‌‌ స్క్రీన్‌ షాట్‌ తీసి వైరల్‌ చేస్తున్నారు. 

అంతకుముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో సర్‌‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి అభిమానులంతా ఆ పోస్ట్ ఏమీ అయ్యుంటుందని ఆసక్తిగా ఎదురుచూశారు.

ఇదిలా ఉండగా, మొదటిసారి ఇన్‌స్టాగ్రాం టీమ్‌.. ఇలా ఓ నటుడి ఇంటికి వచ్చి, స్పెషల్‌గా వీడియో షూట్‌ చేయడం, అతనితో పాటు ఉండటం, సినిమా సెట్‌కు వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ ఈమ్‌లో బన్ని మాట్లాడిన మాటలు, చూపించిన విజువల్స్ అన్నీ కూడా వైరల్‌ అవుతున్నాయి. ఇందులో బన్నీ తన ఇంటిని చూపించాడు. తన అలవాట్లను, దిన చర్యను పంచుకున్నాడు. ఇక, పుష్ప2 సెట్‌లోకి కూడా ఇన్‌స్టా టీమ్‌ను తీసుకొచ్చాడు. 

ఉదయాన్నే లేచి అల్లు అర్జున్‌ తన ఇంట్లోని గార్డెన్‌, స్మిమ్మింగ్‌ పూల్‌ ఏరియాలో ఇలా చిల్‌ అవుతాడట. తర్వాత కాఫీ తాగుతాడట. ఇక సెట్స్‌ కు వెళ్లే దారిలో మధ్యాహ్నం ఒంటి గంట అయితే, రోజూ పిల్లలకు వీడియో కాల్ చేసి మాట్లాడుతాడట. సెట్‌లోకి ఇలా వెళ్తాను అంటూ రామోజీ ఫిల్మ్‌ సిటీలోకి తీసుకొచ్చాడు. అక్కడ తన అభిమానులను చూపించాడు. 

కరోనా తర్వాత థియేటర్లకు రప్పించిన సినిమా…

2021లో విడుదలైన పుష్ప–ది రైజ్‌ బాక్సాఫీస్‌ వద్ద చారిత్రాత్మక విజయం సాధించింది. కరోనా పాండమిక్‌ తర్వాత ప్రేక్షకులను తిరిగి థియేటర్‌‌లకు రప్పించిన చిత్రం. ఈ మూవీ తన ఐకానిక్‌ డైలాగ్స్‌, కథాంశం, మ్యూజిక్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలు రీల్స్‌ తో సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. అల్లు అర్జున్‌ పుష్ప రాజ్‌ పాత్ర భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రియమైన పాత్రలలో ఒకటిగా మారింది.