జవాన్ డైరెక్టర్ ని కలిసిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ ఇటీవల తన పుష్పా సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న సంతోషంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల అతను జవాన్ డైరెక్టర్ అట్లీని కలిసి చాలా గంటలు చర్చ కూడా జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో కొత్త సినిమా అప్డేట్ రాబోతోందా అంటూ సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.  అట్లీని కలిసిన అల్లు అర్జున్:  జవాన్ సినిమాతో హిట్ కొట్టిన అట్లీతో జతకట్టనున్నట్టు అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. […]

Share:

అల్లు అర్జున్ ఇటీవల తన పుష్పా సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న సంతోషంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల అతను జవాన్ డైరెక్టర్ అట్లీని కలిసి చాలా గంటలు చర్చ కూడా జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో కొత్త సినిమా అప్డేట్ రాబోతోందా అంటూ సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 

అట్లీని కలిసిన అల్లు అర్జున్: 

జవాన్ సినిమాతో హిట్ కొట్టిన అట్లీతో జతకట్టనున్నట్టు అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ ముంబైకి వెళ్లి జవాన్ సినిమా డైరెక్టర్ని కలిసిన తీరు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇద్దరు కలిసి చాలా గంటలు తమ కొత్త సినిమా ఐడియాస్ గురించి డిస్కస్ చేసుకున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. 

స్టైలిష్ అల్లు అర్జున్ తన నటనతో ఏ పాత్రలోనైనా చక్కగా ఇమిడిపోయే చక్కని నటుడు. జవాన్ సినిమాతో తన డైరెక్షన్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేటట్లు చేసిన అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అంటూ అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోయింది. 

అల్లు అర్జున్ పుష్ప-2: 

పుష్ప ది రైస్ తరువాత రాబోతున్న సెకండ్ పార్ట్ ‘పుష్ప 2: ది రూల్‌’, దీని టీసర్ కూడా ఈమధ్య వచ్చి ఈ సినిమా పైన మరింత అంచనాలు పెంచేస్తోంది. అయితే దాని తరువాత పెద్దగా దీని గురించి వార్తలు వినిపించలేదు. ఇటీవల చిరు లీక్స్ లాగా అల్లు అర్జున్ పుష్ప 2 లోని ఒక డైలాగ్ లీక్ చేసాడు.”పుష్ప అంటే ప్లావర్ అంకుంటివ్వా? కాదు ఫైయ్యారు!!” లాంటి డైలాగులు ఎన్నో మొదటి భాగం లో విన్నాము. బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని అందరం ఎదురుచూస్తున్నాము. అంచనాలు లెక్కించలేనంతగా ఉన్నాయి, సినిమా 2024 ఇండిపెండెన్స్ డే కి విడుదల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు, పైగా దేశం లో సౌంత్ లో నాలుగు భాషలు, హిందీ తో కలిపి ఐదు భాషల్లో వచ్చి కరోనా లోనే భారీ వసూళ్లు సాధించిన మొదటి సినిమా అయ్యింది పుష్ప ఫస్ట్ పార్ట్. రెండవ భాగం నుండి ఒక ప్రధాన డైలాగ్‌ను లీక్ చేసి ఇప్పుడు సినిమా అభిమానులలో మరింత ఉత్సాహాన్ని పెంచాడు ఐకాన్ స్టార్. 

ఆనంద్ దేవరకొండ నటించిన “బేబీ” సినిమా సక్సెస్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ అతిధి గా వచ్చి, టీం అందర్నీ పేరు పేరునా మెచ్చుకున్నాడు. ఇక అభిమానులు ఆగుతారా? పుష్ప అప్డేట్ ఏంటి అని అరిచినప్పుడు, “మీరు ఇలా అడుగుతారని ఇలా చిన్న ఈవెంట్ ప్లాన్ చేయించా” అని మొదట్లో తప్పించుకున్నా చివరికి ఐకాన్ స్టార్ తన రాబోయే చిత్రం పుష్ప 2: ది రూల్ గురించి కొంచెం స్నీక్ పీక్ ఇవ్వక తప్పలేదు. పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేయమని  అడగ్గా “నేను పుష్ప 2 గురించి మాట్లాడటానికి రాలేదు, కానీ నేను సినిమా నుండి ఒక లైన్ చెప్తాను” అని అన్నాడు.

అల్లు అర్జున్ పుట్టినరోజుకు ముందు, మేకర్స్ పుష్ప 2: ది రూల్ యొక్క ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ను విడుదల చేశారు. ప్రత్యేక టీజర్ అల్లు అర్జున్ పాపులర్ క్యారెక్టర్ ‘పుష్ప రాజ్’ని మళ్లీ కొత్త అవతార్ లో పరిచయం చేసింది. చీర, గాజులు అలంకరించుకున్న అవతార్‌లో పుష్పరాజ్  ఫస్ట్ లుక్ అప్పుడే అదిరిపోయింది. సీక్వెల్ పుష్ప 2: ది రూల్‌కి సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్ అనసూయ ముఖ్య పాత్రల్లో కొనసాగుతారు. ఈ చిత్రానికి సాంకేతిక విభాగంలో మిరోస్లా కుబా ఉండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమా త్వరలో విడుదల అయ్యి మంచి విజయం సాధించాలని, ఆలస్యం అయితే ఇలాంటి లీక్స్ మరిన్ని రావాలని కోరుకుందాం.