Allu Arjun: డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్..

డేవిడ్ వార్నర్‌(David Warner)కు అల్లు అర్జున్(Allu Arjun) స్పెషల్ బర్త్ డే విషెస్(బర్త్ డే విషెస్) చెప్పాడు. క్రికెట్ ఫీల్డ్ లో తరచూ పుష్ప స్టైల్లో సెలబ్రేట్ చేసుకునే ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ తో బన్నీకి మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. డేవిడ్ భాయ్(David Bhai) అంటూ హైదరాబాదీలు ముద్దుగా పిలుచుకునే ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్‌(David Warner)కు తెలుగు నేలతో ఎంతో అనుబంధం ఉంది. ఐపీఎల్‌(IPL)లో చాలా ఏళ్లపాటు సన్‌రైజర్స్(Sunrisers) తరఫున ఆడిన వార్నర్.. హైదరాబాద్‌(Hyderabad)ను తన […]

Share:

డేవిడ్ వార్నర్‌(David Warner)కు అల్లు అర్జున్(Allu Arjun) స్పెషల్ బర్త్ డే విషెస్(బర్త్ డే విషెస్) చెప్పాడు. క్రికెట్ ఫీల్డ్ లో తరచూ పుష్ప స్టైల్లో సెలబ్రేట్ చేసుకునే ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ తో బన్నీకి మంచి రిలేషన్షిప్ ఏర్పడింది.

డేవిడ్ భాయ్(David Bhai) అంటూ హైదరాబాదీలు ముద్దుగా పిలుచుకునే ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్‌(David Warner)కు తెలుగు నేలతో ఎంతో అనుబంధం ఉంది. ఐపీఎల్‌(IPL)లో చాలా ఏళ్లపాటు సన్‌రైజర్స్(Sunrisers) తరఫున ఆడిన వార్నర్.. హైదరాబాద్‌(Hyderabad)ను తన రెండో ఇల్లుగా భావిస్తుంటాడు. తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ.. తెలుగు వారికి మరింత చేరువైన వార్నర్.. బుట్ట బొమ్మ పాటకు తన భార్యతో కలిసి వేసిన స్టెప్పులు అందర్నీ అలరించాయి. పుష్ప(Pushpa) రిలీజ్ అయ్యాక.. అల్లు అర్జున్‌(Allu Arjun)ను ఇమిటేట్ చేస్తూ తగ్గేదేలే అంటూ వార్నర్ చేసుకుంటున్న సంబరాలకు దేశం మొత్తం ఫిదా అయ్యింది.

ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్(David Warner) బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషెస్ తెలిపాడు. వార్నర్‌ను క్రికెట్ సూపర్ స్టార్‌(Cricket Super Star)గా అభివర్ణించిన బన్నీ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించాడు. నువ్వు కోరుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాంటూ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఆసీస్ క్రికెటర్‌కు విషెస్ తెలిపాడు. 

డేవిడ్ వార్నర్(David Warner), అల్లు అర్జున్‌(Allu Arjun)కు ఒకరి పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉంది. చాలా ఏళ్లపాటు ఐపీఎల్‌(IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. తన ఆటతోనే కాకుండా.. అల్లు అర్జున్, మహేశ్ బాబు తదితర టాలీవుడ్ హీరోల పాటలకు స్టెప్పులేస్తూ.. తెలుగు ప్రజలకు చేరువయ్యాడు. బుట్టబొమ్మ పాటకు వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి వేసిన స్టెప్పులు వైరల్(Viral) అయ్యాయి. పుష్ప రిలీజ్ అయ్యాక.. తగ్గేదేలే అంటూ.. అల్లు అర్జున్‌ ను వార్నర్ అనుకరించాడు. 

పుష్ప- ది రైజ్ పార్ట్ 1లో నటనకు గానూ అల్లు అర్జున్‌(Allu Arjun) ఇటీవల జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న సందర్భంలో వార్నర్ అతడికి అభినందనలు తెలిపాడు. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన ఫొటోను రీషేర్ చేసిన వార్నర్.. బన్నీకి కంగ్రాట్స్ చెప్పాడు.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా సినిమా పుష్ప 2- ది రూల్. పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పుష్ప- ది రైజ్ పార్ట్ 1కు సీక్వెల్ ఇది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటోంది ఈ మూవీ.

ప్రస్తుతం భారత్‌లో వరల్డ్ కప్(World Cup) ఆడుతోన్న వార్నర్.. మైదానంలోనూ ‘తగ్గేదేలే’ అంటూ పుష్ప స్టైల్‌ను ఫాలో అవుతున్నాడు. ఇటీవల ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో వార్నర్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రేక్షకులు వార్నర్.. వార్నర్.. అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో వార్నర్ గడ్డం కింద చేతిని పెట్టి తగ్గేదేలే అంటున్నట్టుగా ప్రేక్షకులను అలరించాడు. మరో సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూనే.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు.

ఈ వరల్డ్ కప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్ వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. పాకిస్థాన్‌పై 163 పరుగులు చేసిన వార్నర్.. నెదర్లాండ్స్‌పై 104 పరుగులు చేశాడు. 5 మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేసిన వార్నర్.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

వార్నర్‌(Warner)కు తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టం. తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించాలని ఉందంటూ ఆ మధ్య వార్నర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. హైదరాబాదీలంతా ముద్దుగా డేవిడ్ భాయ్ అని పిలుచుకునే వార్నర్.. ఏదో ఒకరోజు బన్నీ సినిమాలో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలావుంటే వార్నర్‌ను తెలుగు అభిమానులు సినిమాల్లో నటించమని కోరుతున్నారు. తనకు ఇష్టమైన బన్నీ సినిమాలో ఒక పాత్రైనా చేయొచ్చు కదా! అని విజ్ఞప్తి చేస్తున్నారు. వార్నర్ వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నాడు. దీంతో ఖాళీ సమయంలో నటనపై దృష్టి పెడతాడేమో చూడాలి.