కొత్త రిలీజ్ డేట్ చెప్పిన పుష్ప టీం

పుష్ప‌ .. పుష్ప‌రాజ్ అంటూ దేశాన్ని షేక్ చేసాడు మ‌న అల్లు అర్జున్టా. లీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ పుష్ప మూవీ రాకముందు ఒకలా.. పుష్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒకలా మారిపోయింది. అసలు ఈ మూవీ ఇన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందని పుష్ప మూవీని తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ యే ఆలోచించలేదు కావొచ్చు. కానీ రిలీజైన తర్వాత ఒక్క ప్రాంతమని కాకుండా అన్ని వర్గాల మరియు అన్ని ప్రాంతాల […]

Share:

పుష్ప‌ .. పుష్ప‌రాజ్ అంటూ దేశాన్ని షేక్ చేసాడు మ‌న అల్లు అర్జున్టా. లీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ పుష్ప మూవీ రాకముందు ఒకలా.. పుష్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒకలా మారిపోయింది. అసలు ఈ మూవీ ఇన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందని పుష్ప మూవీని తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ యే ఆలోచించలేదు కావొచ్చు. కానీ రిలీజైన తర్వాత ఒక్క ప్రాంతమని కాకుండా అన్ని వర్గాల మరియు అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు

పుష్ప మూవీ ఫీవర్ ఎలా ఉండేదంటే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇందులోని డ్యాన్స్, డైలాగ్స్ ను అనుకరిస్తూ వీడియోలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే పుష్ప మూవీని అల్లు అర్జున్ తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈ మూవీకి అతనికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. ఇన్ని సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది స్టార్స్ వచ్చినా పర్ఫామ్ చేసినా కానీ నేషనల్ అవార్డు అనేది ఎవరినీ వరించలేదు. కానీ మొట్ట మొదటి సారిగా అల్లు అర్జున్ ను ఆ అదృష్టం వరించింది. పుష్ప సినిమా ఆ లక్ ను తీసుకొచ్చింది. అందుకోసమే పుష్ప-2 మూవీని మేకర్స్ చాలా జాగ్రత్తగా తీర్చి దిద్దుతున్నారు. అసలే పుష్ప మూవీ క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ ను అందుకోవాలనే టార్గెట్ మేకర్స్ ముందు ఉండగా.. ఇప్పుడు నేషనల్ అవార్డుతో ఆ బాధ్యత మరింత పెరిగింది. దీంతో మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లెక్కల మాస్టారు మూవీని మరో రేంజ్ లో తెరకెక్కించేందుకు ట్రై చేస్తున్నాడు. అందుకోసమే అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. 

పుష్ప రిలీజ్ డేట్ ప్రకటన..

పుష్ప-2 మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 2024 ఆగస్టు 15న సందడి చేయనున్నట్లు తెలిపాడు. డేట్లను మార్క్ చేసి పెట్టుకోండని చిత్ర నిర్మాణ సంస్థ కూడా ట్వీట్ చేసింది. ఈ ప్రకటనకు ఒక గంట ముందుగానే ఇందుకు సంబంధించి బిగ్ అప్డేట్ అందిస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. దీంతో ఆ బిగ్ అప్డేట్ ఏమై ఉంటుందా అని మూవీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. మూవీ ఫ్యాన్స్ ను నిరాశపర్చకుండా చిత్ర బృందం బిగ్ అప్డేట్ ను అందించింది. జాతీయ అవార్డు రావడం మరియు పుష్ప మూవీ పెద్ద హిట్ సాధించడంతో సీక్వెల్ మీద మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇందులో ఉండే ప్రతి ఆంశం ప్రేక్షకులకు నచ్చేలా డైరెక్టర్ కేర్ తీసుకుంటున్నాడు. కేవలం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికే డైరెక్టర్ ఏడాది సమయం తీసుకున్నాడనే ఫిలిం నగర్ టాక్. 

ఆకట్టుకున్న ‘వేర్ ఈజ్ పుష్ప’

పుష్ప-2 మూవీ నుంచి అప్డేట్స్ సరిగ్గా రావడం లేదంటూ ఫ్యాన్స్ గొడవ చేయడంతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు మూవీ యూనిట్ వేర్ ఈజ్ పుష్ప అనే ఓ వీడియోను వదిలింది. ఈ వీడియో చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కు కూడా గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. అంత ఎఫెక్టివ్ గా డైరెక్టర్ దీనిని కట్ చేశాడు. దీంతో ఈ స్పెషల్ వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. ఈ స్పెషల్ వీడియో ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టింది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. 

కథిదే..

ఇంత పెద్ద హిట్ సాధించిన పాన్ ఇండియా మూవీ పుష్ప కథ చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించిన సింపుల్ స్టోరీ. హీరో ఒక రెబల్ లా ఉంటాడు. తాను అతనికి నచ్చింది చేస్తాడు కానీ ఎవరి మాటా వినడు. ఇలా హీరో ఫుల్ ఫేమస్ అవుతాడు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న శ్రీ వల్లి పాత్రలో ఒదిగిపోయింది. మలయాళ యాక్టర్ ఫహాద్ కూడా భన్వర్ సింగ్ షెకావత్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సునీల్, అనసూయ వంటి వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నెక్ట్స్ లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చారు.