అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడ‌వు

ఆదిత్య మ్యూజిక్.. తెలుగు సంగీత ప్రపంచంలో తిరుగులేని సంస్థ. 1996లో జర్నీ మొదలుపెట్టి..  అంచెలంచెలుగా ఎదిగింది. అయితే ప్రస్తుతం ఆడియో మార్కెట్‌లో విపరీతమైన కాంపిటీషన్‌ను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ఆడియో మార్కెట్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’, సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ తదితర భారీ సినిమాల ఆడియో రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య మ్యూజిక్ కంపెనీ అధినేత ఉమేశ్ గుప్తా కీలక […]

Share:

ఆదిత్య మ్యూజిక్.. తెలుగు సంగీత ప్రపంచంలో తిరుగులేని సంస్థ. 1996లో జర్నీ మొదలుపెట్టి..  అంచెలంచెలుగా ఎదిగింది. అయితే ప్రస్తుతం ఆడియో మార్కెట్‌లో విపరీతమైన కాంపిటీషన్‌ను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ఆడియో మార్కెట్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’, సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ తదితర భారీ సినిమాల ఆడియో రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య మ్యూజిక్ కంపెనీ అధినేత ఉమేశ్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

ఎన్నో ఏళ్లుగా పోటీ ఉంది

బాలీవుడ్ కంపెనీలు సోనీ, టీసిరీస్, సరిగమ తదితర కంపెనీలు తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించడంపై ఉమేశ్ గుప్తా స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యర్థి కంపెనీల నుంచి తాము ఎన్నో ఏళ్లుగా పోటీని ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇదేమీ కొత్త కాదని అన్నారు. అయితే ఆడియో రైట్స్‌ పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేట్లు 8 నుంచి 10 రెట్లు పెరిగిపోయాయని చెప్పారు. ఆ రేట్లు ఎంతనేది బయటపెట్టలేనని అన్నారు. తమకు అంత డబ్బును తిరిగి రాబట్టుకోవడం కష్టతరంగా మారుతోందని చెప్పారు. ‘‘కాసెట్లు, సీడీల కాలం పోయింది. స్ట్రీమింగ్ ద్వారా, మిలియన్ల వ్యూస్ ద్వారా మాత్రమే రికవర్ చేసుకోవాలి. ఇందుకు ఎంతో సహనం కావాలి” అని అన్నారు. 

కొన్ని సినిమాలు మిస్ అయ్యాం

తాము కొన్ని సినిమాల హక్కులను మిస్‌ అయ్యామని ఉమేశ్ గుప్తా చెప్పారు. తమకున్న పేరుతో మంచి స్థితిలోనే ఉన్నామని అన్నారు. ‘భోళా శంకర్’, ‘గుంటూరు కారం’ సహా 20 దాకా సినిమాలు తమ చేతిలో ఉన్నాయని చెప్పారు. ‘‘ప్రతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ లేదా ‘కేజీఎఫ్’ మాదిరి అవుతాయనే ఆశతో బాలీవుడ్ కంపెనీలు దక్షిణాదిపైకి పోటెత్తుతున్నాయి. ఇటీవల సూపర్‌‌హిట్‌ అయిన కొన్ని తెలుగు సినిమాలు బాలీవుడ్‌పై బాంబులా పడ్డాయి. కానీ అన్ని సినిమాలు పాన్‌ఇండియా స్థాయిలో అడుతాయని అనుకోవడం మిథ్య. కొన్ని మాత్రమే ఆ స్థాయిలో హవా చూపిస్తాయి” అని చెప్పారు. 

3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు

తమ చానల్‌ను ఎక్కువ మంది సంగీత ప్రేమికులు చూస్తారని ఉమేశ్ గుప్తా అన్నారు. తమకు 30 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, తాము టాప్‌లో ఉన్నామని వివరించారు. తమకు 2500కు పైగా సినిమాలు ఉన్నాయని చెప్పారు. పాత, కొత్త తరం సంగీత అభిమానులను తాము అలరిస్తున్నామని అన్నారు. 

సంస్థను విస్తరిస్తాం

తమ సంస్థను విస్తరించాలని అనుకుంటున్నామని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేశ్ గుప్తా చెప్పారు. తము సరిపోయే పని కాదన్న కారణంతో సినిమా నిర్మాణానికి దూరమయ్యామని అన్నారు. ‘ఎక్స్‌ట్రార్డినరీ’ మ్యాన్, ‘భైరవకోన’ తదితర సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్‌ను తీసుకుంటున్నామని తెలిపారు. తెలుగు నిర్మాతలు నాన్ థియేట్రికల్ రైట్స్‌ను పెంచబోరని ఆశిస్తున్నామని చెప్పారు.

ఆదిత్య మ్యూజిక్ ప్రస్తానమిదీ

మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ కంపెనీగా ఆదిత్య మ్యూజిక్ కంపెనీని ఉమేశ్ గుప్తా 1993లో స్థాపించారు. 2000 సంవత్సరంలో ఆడియో క్యాసెట్లను తయారు చేయడం ప్రారంభించారు. ఎన్నో సినిమాల రైట్లు కొనుగోలు చేశారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. మరోవైపు ఆదిత్య మ్యూజిక్ తెలుగు సినిమాలను హిందీ, భోజ్‌పురీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సంస్థల్లో ఒకటిగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది.